ETV Bharat / city

వైఎస్సార్ కంటి వెలుగు పథకం... దశలవారీగా ఉచిత కంటి పరీక్షలు

author img

By

Published : Sep 21, 2019, 4:55 AM IST

ప్రపంచ అంధత్వ దినాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 10 న వైఎస్ ఆర్ కంటి వెలుగు పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. అమలు చేసేందుకు పాలనా అనుమతులను విడుదల చేసింది.

వైఎస్సార్ కంటి వెలుగు పథకం... దశలవారీగా ఉచిత కంటి పరీక్షలు

వైఎస్ ఆర్ కంటి వెలుగు కార్యక్రమం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత కంటి పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్ 10నుంచి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు పాలనా అనుమతులను విడుదల చేసింది.
ప్రపంచ అంధత్వ దినం పురస్కరించుకుని అక్టోబర్ 10 న వైఎస్ ఆర్ కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించనుంది. మొత్తం 560కోట్లను పథకం కింద ఖర్చుచేయనుంది. ఈ మొత్తంలో..... 60శాతం రాష్ట్ర ప్రభుత్వం, 40శాతం కేంద్రం భరించనున్నాయి.
నాలుగు దశల్లో...

మొదట అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు...కంటి పరీక్షలను చేపట్టనున్నారు. అక్టోబర్ 10 నుంచి 15 వరకు మొదటిదశ పరీక్షలు నిర్వహిస్తారు. రెండో దశ పరీక్షలో.. కంటి అందాల సిఫార్సులు తదితర అంశాలను చేపట్టనున్నారు. మూడో దశలో..... సామాజిక కమ్యూనిటి సెంటర్లలో ఆశా వర్కర్లు, ఏఎన్​ఎమ్​లు... గ్రామీణ ప్రాంతాల్లో 2020 ఫిబ్రవరి నుంచి పరీక్షలు చేయిస్తారు. నాలుగోదశలో అవసరమైన వారికి శుక్లాల శస్త్ర చికిత్సలు, ఇతర వైద్య పరీక్షల కోసం సిఫారసు చేయనున్నారు.
ఇవీ చూడండి-ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఆర్థిక సాయం...ఈనెల 25 వరకు గడువు

Intro:ap_gnt_81_30_narasaraopetalo_tdp_dharna_avb_ap10170

కార్మికుల పొట్టకొట్టొద్దు. చదలవాడ అరవింద బాబు, తెదేపా ఇంచార్జి.

అనుభవం లేని పాలనతో వైసీపీ ప్రభుత్వం కార్మికుల పొట్టకొడుతోందని నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఇంచార్జి చదలవాడ అరవింద బాబు అన్నారు. ఇసుక విధానంపై వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తున్న తీరుకు నిరసంగా చంద్రబాబు పిలుపు మేరకు స్థానిక మల్లమ్మ సెంటర్ లో శుక్రవారం చదలవాడ అరవింద బాబు ఆధ్వర్యంలో తెదేపా నాయకులు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. వారికి మద్దతుగా భవన నిర్మాణ కార్మికులు ధర్నాలో పాల్గొన్నారు.


Body:ధర్నా అనంతరం అరవిందబాబు మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం అవగాహన లేని పాలన చేస్తుందని దుయ్యబట్టారు. దాని ద్వారా రోజు కూలీ చేసుకుని జీవనం సాగించే భావన కార్మికులు పనులు లేక దిక్కు తోచని స్థితిలోకి వెళ్తున్నారన్నారు. భవన నిర్మాణాలకు ఇసుకను ప్రభుత్వం అందించలేక పోవడం తో పలు రకాల కార్మికులు పనులు కోల్పోతున్నారని ఆయన అన్నారు. అదేవిధంగా ఇసుక లేకపోవడంతో సిమెంటు, ఇనుము, పెయింట్ వ్యాపారస్తులు సైతం వ్యాపారాలు లేక రోడ్డున పడే పరిస్థితి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే లారీలు, ట్రాక్టర్లు కలిగిన వారు ఫైనాన్సు కట్టుకోలేక వాహనాలను అమ్ముకుంటున్నారని తెలిపారు.


Conclusion:పనులు లేని కూలీలు, పేదలు తక్కువ ధరతో కడుపు నింపుకునేందుకు గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం మూసివేయడంతో దిక్కు తోచని స్థితిలో కూలీలు ఆకలి కేకలు వేస్తున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఇసుకను అందించి, అన్నా క్యాంటీన్లను పునరుద్ధరణ చేసే దిశగా ఆలోచించాలని అరవింద బాబు కోరారు.

బైట్: చదలవాడ అరవింద బాట, నరసరావుపేట తెదేపా ఇంచార్జి.

ఆర్.చంద్రశేఖరరావు,
ఈటీవీ రిపోర్టర్,
నరసరావుపేట,
9885066052.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.