ETV Bharat / city

Topnews: ప్రధాన వార్తలు @ 1pm

author img

By

Published : Feb 8, 2022, 1:06 PM IST

ప్రధాన వార్తలు @ 1pm
ప్రధాన వార్తలు @ 1pm

.

  • Jagananna Chedodu Scheme Funds : చేతివృత్తులవారు బతకలేకపోతే వ్యవస్థలు కుప్పకూలుతాయి.. - సీఎం జగన్

జగనన్న చేదోడు పథకం రెండో విడత నిధులను ముఖ్యమంత్రి జగన్ విడుదల చేశారు. స్వయం సహాయ కేటగిరీలో ఎక్కువగా చేతివృత్తులపైనే ఆధారపడి ఉన్నాయన్నారు. చేతివృత్తుల పనివారు బతకలేకపోతే వ్యవస్థలు కుప్పకూలుతాయని ముఖ్యమంత్రి తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • teachers union on prc : పీఆర్సీపై ఉద్యమ కార్యాచరణకు సిద్ధం.. ఫ్యాప్టో ఆధ్వర్యంలో 5 రోజులు నిరసనలు

పీఆర్సీ సాధన సమితి ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయనుకున్నామని ఉపాధాయ ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. కానీ అది నేరవేరలేదన్నారు. అయినప్పటికీ ప్రభుత్వ ప్రతిపాదనలను అంగీకరించి.. సమ్మె విరమిస్తున్నట్లు పీఆర్సీ నేతలు ప్రకటించారు. స్టీరింగ్‌ కమిటీ నిర్ణయాన్ని ఎస్‌టీయూ, యూటీఎఫ్‌, ఏపీటీఎఫ్‌ వ్యతిరేకించాయన్నారు. అందుకే స్టీరింగ్‌ కమిటీకి తాము రాజీనామా చేస్తున్నామన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • అన్నదాతలు అప్​డేటయ్యారు.. మిర్చి పంటను కాపాడుకునేందుకు...ఆ ఏర్పాట్లు..

ఎంతో కష్టపడి పండించిన పంట దొంగలపాలు కాకుండా కాపాడుకునేందుకు గుంటూరు జిల్లాలో అన్నదాతలు వినూత్నంగా ఆలోచించారు. కొంత మంది కలిసి నిఘా ఏర్పాట్లు చేసుకున్నారు. మిర్చి కల్లాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. పంట దొంగలపాలు కాకుండా ఈ ఏర్పాట్లు చేసినట్లు చెబుతున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ఫుడ్‌ గార్డెన్‌తో.. లక్షలు పూయిస్తోంది

వీలున్న సమయాల్లో గంటల చొప్పున పనిచేసే అవకాశం.. శిక్షణ తర్వాతే పని చేసే వీలు. నైపుణ్యాలు సరిగా లేవనిపిస్తే వెళ్లి నేర్చుకుని మరీ నేర్పించడం.. కార్పొరేట్‌ సంస్థ తీరును తలపించడం లేదూ! కానీ ఇవన్నీ పాటిస్తోంది ఓ సామాన్య మహిళ. చదివిందీ ఇంటరే. అప్పటిదాకా భర్త చాటు భార్య అయినా ఆయనకు సమస్య వస్తే తోడుగా నిలవడానికి వ్యాపారాన్ని మొదలెట్టింది. తన ఆలోచనను మరికొందరితో పంచుకొని వాళ్లూ తనతో నడిచేలా చేసింది. నెలకు రూ.12 లక్షలకుపైగా సంపాదిస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'వారసత్వ పార్టీలు దేశానికి ప్రమాదకరం'

రానున్న 25 ఏళ్లలో దేశాన్ని అభివృద్ధి పథంలో ఎలా నడిపించాలో అందరూ ఆలోచించాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. దేశ అభివృద్ధిపైనే దృష్టిసారించాలన్నారు. మరోవైపు రాజ్యసభ వేదికగా విపక్షాలపై విమర్శలు గుప్పించారు మోదీ. వారసత్వ పార్టీలు దేశానికి ప్రమాదకరమని ధ్వజమెత్తారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • బాలికపై గ్యాంగ్​ రేప్- ముఖంపై కొరికి, చంపేస్తానని బెదిరించి...

17 ఏళ్ల గిరిజన బాలికపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఒకడు.. ఆమె ముఖంపై పళ్లతో గట్టిగా కొరికాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • రాయ్‌బరేలీ.. కాంగ్రెస్‌కు అగ్నిపరీక్షే

రాయ్​బరేలీ.. ఒకప్పుడు కాంగ్రెస్​ పార్టీకి కంచుకోట. కానీ ఇప్పుడు ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లను ఈ ఎన్నికల్లో ఆ పార్టీ గెలిపించుకోగలదా? పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో అయినా మెరుగైన ఫలితాలు సాధించగలరా అన్నదే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఇలా..

దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. వెండి ధర కూడా అదే దారిలో పయనించింది. ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల బంగారం ధర ఎంత ఉందంటే..? పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • Team India U19: కొత్తగా '19 ప్లస్​' టీమ్​.. బీసీసీఐ యోచన

అండర్​ 19లో సత్తా చాటిన కుర్రాళ్ల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా కొత్త ప్రణాళిక రూపొందించనుంది బీసీసీఐ. ఈమేరకు కొత్తగా 'అండర్‌-19+' వయో విభాగం జట్టును ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దాని ద్వార యువ ప్రతిభకు ప్రోత్సాహం అందించాలని చూస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • మహాభారతం నటుడు ​ ప్రవీణ్​ కుమార్​ కన్నుమూత

ప్రముఖ అథ్లెట్​, మహాభారతం సీరియల్​ నటుడు​ ప్రవీణ్​ కుమార్​ సోబ్తి(74) కన్నుమూశారు. గుండెపోటుతో తన నివాసంలోనే తుదిశ్వాస విడిచారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.