ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 5PM

author img

By

Published : Aug 5, 2022, 5:01 PM IST

TOP NEWS
TOP NEWS

TOP NEWS: ప్రధాన వార్తలు @ 5PM

  • ఎంపీ గోరంట్ల మాధవ్‌పై.. పరువు నష్టం దావా
    హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌పై తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ పాత్రుడు పరువు నష్టం దావా వేశారు. తనపై చేసిన ఆరోపణలు మాధవ్ నిరూపించాలని డిమాండ్ చేస్తూ.. రూ. 50లక్షల మేర పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు నోటీసులు పంపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • బతికుండగానే చంపేశారు.. పామూరులో పింఛన్​దారుల ఆందోళన
    Pensioners Protest: పింఛన్​ రావడం లేదని వాలంటీర్లను ప్రశ్నించిన బాధితులకు గట్టి షాక్​ తగిలింది. పింఛన్​దారులు మరణించినట్లు నమోదు కావడంతో పింఛన్​ ఆగిపోయిందని వాలంటీర్​ తేల్చిచెప్పారు. ఈ విషయం విని ఖంగుతున్న లబ్ధిదారులు.. మరణించినట్లు ధృవీకరణ పత్రం ఇస్తే ఎల్​ఐసీ క్లెయిమ్​ చేసుకుంటామని కౌంటర్​ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • Amarnath: 'ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి పెద్దపీట..'
    Minister Amarnath: ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి పెద్దపీట వేస్తున్నామని మంత్రి అమర్​నాథ్​ తెలిపారు. కాలుష్య రహిత వాహనాలతో కర్బన ఉద్గారాలు తగ్గించడమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. రూ.32 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యమని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • WazirX Exchange: ‘వజీర్‌ఎక్స్‌ ఎక్స్ఛేంజ్‌’లో ఈడీ సోదాలు.. రూ.వంద కోట్లు జప్తు
    WazirX Exchange: బెట్టింగ్‌ యాప్‌ల వ్యవహారంలో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌ వ్యవహారంలో 'వజీర్​ఎక్స్​'కు చెందిన నిర్వాహకుల ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్​లో రెండు రోజులుగా జరిపిన సోదాల్లో రూ.100 కోట్లు జప్తు చేసినట్లు ఈడీ తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కాంగ్రెస్​ నిరసనల్లో ఉద్రిక్తత.. పోలీసుల అదుపులో రాహుల్, ప్రియాంక
    Congress protest on inflation: కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్‌ పార్టీ దేశవ్యాప్తంగా నిర్వహించిన ఆందోళనలు పలుచోట్ల ఉద్రిక్తంగా మారాయి. దిల్లీలో పాదయాత్రగా రాష్ట్రపతి భవన్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ ఎంపీలను.. విజయ్ చౌక్​ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. రాహుల్, ప్రియాంక సహా ఇతర నేతల్ని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'పార్లమెంటుతో సంబంధం లేకుండా హాజరు కావాలి'.. ఖర్గేకు వెంకయ్య కౌంటర్​
    Venkaiah naidu on ED cases enquiry: పార్లమెంట్​ సమావేశాలతో సంబంధం లేకుండా.. దర్యాప్తు సంస్థల విచారణకు హాజరుకావాలని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్​ వెంకయ్యనాయుడు సూచించారు. గురువారం రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లిఖార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన రాజ్యసభలో మాట్లాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • చైనాపై పెలోసీ 'తైవాన్​ పంచ్​'.. ఆంక్షలతో షాక్ ఇచ్చిన డ్రాగన్ దేశం
    Pelosi visit Taiwan: చైనా హెచ్చరికలు పట్టించుకోకుండా విజయవంతంగా తైవాన్ పర్యటన పూర్తి చేశారు అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ. తాజాగా ఆమె డ్రాగన్​కు గట్టి కౌంటర్ ఇచ్చారు. అమెరికా అధికారులను తైవాన్​కు వెళ్లకుండా చైనా అడ్డుకోలేదని అన్నారు పెలోసి. తైవాన్​ను ఏకాకి చేస్తానంటే తాము ఊరుకోబోమన్నారు. ఈ వ్యాఖ్యలు చేసిన కాసేపటికే.. పెలోసీపై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది చైనా. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • వడ్డీ రేట్లు పెంచిన ఆర్​బీఐ.. మీ EMI ఎంత పెరుగుతుందంటే...
    EMI RBI NEWS: ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడం కోసం ఆర్​బీఐ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ క్రమంలో రెపో రేటు ఆధారిత రుణాల రేట్లన్నీ సహజంగానే పెరుగుతాయి. గృహరుణం తీసుకుని, సొంతింటి కల నిజం చేసుకోవాలనుకునే వారు దీన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. ఇప్పటికే రుణం తీసుకున్న వారికీ వడ్డీ రేటు పెరిగినా, నెలవారీ చెల్లించాల్సిన వాయిదాలో మార్పు ఉండదు. రుణం చెల్లించాల్సిన వ్యవధి పెరుగుతుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • సుధీర్‌ గోల్డ్‌ 'లిఫ్ట్'.. వీడియో చూశారా?
    పారా వెయిట్‌లిఫ్టర్ సుధీర్‌ తొలిసారి కామన్వెల్త్‌ హెవీ వెయిట్‌లిఫ్టింగ్‌ కేటగిరీలో గోల్డ్ మెడల్ సాధించాడు. అయితే ఇప్పుడా ప్రదర్శనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సుధీర్‌ ఫీట్‌ను మీరూ చూసేయండి.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'మీ మాజీ భర్త షాహిద్​ కపూర్​'.. కరీనా షాక్​.. నాలుక్కర్చుకున్న కరణ్‌
    'కాఫీ విత్​ కరణ్​' షోలో ప్రముఖ నిర్మాత కరణ్​ జోహార్​ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. నటుడు షాహిద్​ కపూర్​ను కరీనా కపూర్​ మాజీ భర్తగా సంబోధించడమే అందుకు కారణం. కరణ్‌ మాజీ భర్త అని సంబోధించగానే.. కరీనా ఒక్కసారి షాకయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.