TOP NEWS: ప్రధాన వార్తలు @1 PM

author img

By

Published : Jun 20, 2022, 12:59 PM IST

TOP NEWS

..

  • రాత్రిపూట కూల్చివేతలపై కోర్టు వ్యాఖ్యలకు సీఎం ఏం సమాధానం చెబుతారు: చంద్రబాబు
    Chandrababu: తప్పు చేసిన అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదని.. తెదేపా అధినేత చంద్రబాబు హెచ్చరించారు. రాత్రిపూట కూల్చివేతలపై కోర్టు వ్యాఖ్యలకు సీఎం జగన్ ఏం సమాధానం చెబుతారని.. ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • DIED: నీటిలో మునిగి పెద్దకోట్ల గ్రామ వీఆర్వో మృతి..
    DIED: అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పీఏబీఆర్ జలాశయంలో మునిగి ఓ వీఆర్వో మృతి చెందారు. అనంతపురానికి చెందిన నూర్ మహమ్మద్.. తాడిమర్రి మండలం పెద్దకోట్ల గ్రామ వీఆర్వోగా పనిచేస్తున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • Father's Day: నాన్నతో కలిసి కుమార్తెల క్యాట్​వాక్..
    Father's Day: తండ్రుల దినోత్సవం సందర్భంగా ఆదివారం వైజాగ్ ఎక్స్​పో ప్రాంగణంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్బంగా తండ్రులతో కలిసి కుమార్తెలు క్యాట్​వాక్ నిర్వహించడం ఆకట్టుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • BIRTHDAY CELEBRATIONS: ఆరని తండ్రి.. కంట తడి
    BIRTHDAY CELEBRATIONS: ఆ తండ్రికి ఆడపిల్ల పుడితే లక్ష్మిదేవి పుట్టిందని మురిసిపోయాడు. పుట్టిన దగ్గరనుంచి గుండెల మీద పెట్టుకొని గారాబం చేశాడు. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. పుట్టిన ఎనిమిది సంవత్సరాల తర్వాత బ్లడ్ క్యాన్సర్​తో మృతి చెందింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు మరణించడంతో ఆ తండ్రి ఆవేదన వర్ణనాతీతం. కూతురు పుట్టినరోజు సందర్భంగా కుమార్తె త్రీడీ ఫొటో పెట్టి ఆమె అందరి మధ్య ఉన్న భావనను కల్పిస్తూ ఘనంగా వేడుకలు జరిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • భర్తతో నిద్రిస్తున్న మైనర్​పై గ్యాంగ్​రేప్.. కత్తితో బెదిరించి..!
    భర్తతో డాబాపై నిద్రపోతుండగా ఐదుగురు యువకులు కత్తితో బెదిరించి మైనర్​ భార్యపై అత్యాచారం చేసిన ఘటన రాజస్థాన్ అల్వార్​లో జరిగింది. మరో ఘటనలో పదేళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రెండో రోజు కాంగ్రెస్​ సత్యాగ్రహ దీక్ష.. దిల్లీలో భారీగా ట్రాఫిక్ జామ్
    అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా పలు సంఘాలు.. భారత్ బంద్​కు పిలుపునివ్వడం వల్ల దిల్లీలో ట్రాఫిక్​ భారీగా స్తంభించపోయింది. వేలకొలది వాహనాలు రోడ్డుపైనే నిలిచిపోయాయి. మరోవైపు, కాంగ్రెస్​ నాయకులు రెండో రోజు.. జంతర్​మంతర్​ వద్ద సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. సోమవారం రాహుల్​ గాంధీ ఈడీ ముందు హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'అగ్నివీరుల'కు ఆనంద్​ మహీంద్రా బంపర్​ ఆఫర్​
    Anand Mahindra Offer: త్రివిధ దళాల నియామకాల కోసం కేంద్రం ప్రవేశపెట్టిన 'అగ్నిపథ్'​ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతోన్న వేళ.. ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్​ మహీంద్రా స్పందించారు. హింసాత్మక ఆందోళనలు విచారకరమని అన్నారు. ట్విట్టర్​ వేదికగా అగ్నివీరులకు ఓ బంపర్​ ఆఫర్​ కూడా ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పార్లమెంట్​లో మెజారిటీ కోల్పోయిన మెక్రాన్​
    ఫ్రాన్స్ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికై రెండు నెలలు కూడా గడవకముందే.. మెక్రాన్​కు గట్టి షాక్​ తగిలింది. జాతీయ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాల్లో మెక్రాన్​ కూటమి మెజారిటీని కోల్పోయింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రుతురాజ్​, మెద్వెదేవ్​పై ఫ్యాన్స్​​ ఫైర్​.. అలా చేయడమే కారణం!
    టీమ్​ఇండియా ప్లేయర్​ రుతురాజ్​ గైక్వాడ్​, రష్యన్‌ టెన్నిస్‌ స్టార్‌, ప్రపంచ నంబర్‌ 1 ఆటగాడు మెద్వెదేవ్​పై నెటిజన్లు మండిపడుతున్నారు. మైదానంలో వారు వ్యవహరించిన తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏం జరిగిందంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • బాలయ్య 'అన్​స్టాపబుల్'​ సీజన్-2​ రెడీ.. ఫ్యాన్స్​లో ఫుల్​ జోష్​
    Unstoppable with NBK talk show: ఓటీటీ ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్​ సంపాదించుకుంది బాలకృష్ణ 'అన్‌ స్టాపబుల్‌ విత్​ ఎన్​బీకే' టాక్​ షో. ఇటీవలే తొలి సీజన్​ పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం రెండో సీజన్​కు సన్నద్ధమవుతోంది.​ అయితే తాజాగా ఈ రెండో సీజన్​ ప్రారంభంపై అప్డేట్​ ఇచ్చింది ఓటీటీ ప్లాట్​ఫామ్​ ఆహా. ఆ వివరాలు.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.