TOP NEWS: ప్రధాన వార్తలు @ 1 PM

author img

By

Published : Jun 19, 2022, 12:59 PM IST

top news

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

  • ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టినందుకే.. అయ్యన్న ఇంటిపై చీకటి దాడులు: చంద్రబాబు
    CBN ON AYYANNA ISSUE: చోడవరం మినీమహానాడు వేదికగా.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టినందుకే అయ్యన్న ఇంటిపై చీకటి దాడులు చేయించారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. తెలుగుదేశంలో బలమైన బీసీ నేతలే లక్ష్యంగా.. జగన్ రెడ్డి అక్రమ కేసులు, అరెస్టులు, దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ARREST: తిరుపతి రైల్వేస్టేషన్ లక్ష్యంగా పోస్టులు.. ఇద్దరు ఆర్మీ అభ్యర్థుల అరెస్ట్..!
    ARMY CANDADATES AREEST: తిరుపతి రైల్వేస్టేషన్​ను టార్గెట్ చేయాలనే లక్ష్యంగా పోస్టులు పెట్టిన ఇద్దరు ఆర్మీ అభ్యర్థులను తిరుపతి జిల్లా యర్రావారిపాళెం పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. సికింద్రాబాద్​లో విధ్వంసం జరిగే ముందురోజే కొంతమంది యువకులు రైల్వే స్టేషన్ బ్లాక్, ఆర్మీ 17/6 అనే రెండు వాట్సాప్ గ్రూపులను క్రియేట్ చేసుకున్నట్లు నిఘా వర్గాలు కనుగొన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • లారీని ఢీకొన్న ప్రైవేట్​ ట్రావెల్స్​ బస్సు.. తప్పిన పెను ప్రమాదం
    Accident: తిరుపతి జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. నరసాపురం నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్​ ట్రావెల్స్​ బస్సు.. ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్​, క్లీనర్​తో పాటు.. కొంతమంది ప్రయాణికులు గాయపడ్డారు. ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి బస్సు ఓవర్​ స్పీడే కారణమని పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • జగన్‌ను కలిసేందుకు అపాయింట్‌మెంట్‌ అడిగా.. కానీ..: సినీనటుడు సుమన్‌
    HERO SUMAN ON JAGAN: ఓటీటీల్లో వచ్చే వెబ్‌ సిరీస్‌ల్లో అశ్లీలతపై సెన్సార్‌బోర్డు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రముఖ సినీ నటుడు సుమన్‌ అన్నారు. పి.నైనవరంలో సుమన్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ ఆలిండియా అధ్యక్షుడు ధూళిపాళ్ల దేవేంద్ర భార్య నిర్మల మొదటి వర్థంతి కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అగ్నిపథ్​ రిక్రూట్​మెంట్​.. వాయుసేన కీలక ప్రకటన!
    Agnipath Recruitment Scheme: అగ్నిపథ్ పథకంపై గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వం.. నియామక ప్రక్రియను మొదలుపెట్టింది. తాజాగా భారత వాయుసేన నియామక వివరాలను వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • సుప్రీం కోర్టులో ఉద్యోగాలు.. డిగ్రీ ఉంటే చాలు.. జీతం రూ.60 వేలకుపైనే
    Supreme court job vacancy 2022: మీరు ఏదైనా డిగ్రీ చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం సన్నద్ధమవుతున్నారా? అయితే, ఇది మీకు సువర్ణావకాశం. జూనియర్​ కోర్టు అసిస్టెంట్​ పోస్టులకు సుప్రీం కోర్టు నోటిఫికేషన్​ జారీ చేసింది. డిగ్రీ అర్హతతో నెలకు రూ.63 వేల వేతనంతో ఉద్యోగం పొందొచ్చు. పోస్టులు ఎన్ని ఉన్నాయి, దరఖాస్తు తేదీ వంటి వివరాలేంటో తెలుసుకోండి మరి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ప్రవక్తపై వ్యాఖ్యలకు ప్రతీకారమే కాబుల్​ దాడి.. ఐసిస్​ ప్రకటన
    Kabul Gurdwara Attack: అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబుల్‌లో జరిగిన దాడిని తామే చేశామని ప్రకటించింది ఐసిస్​ ఉగ్రసంస్థ. మహమ్మద్‌ ప్రవక్తపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు ప్రతీకారంగానే ఈ దాడి జరిపినట్లు పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఏపీ, తెలంగాణలో బంగారం ధర ఎంతంటే?
    Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 10 గ్రాముల పసిడి ధర రూ.52,630గా ఉంది. కిలో వెండి ధర రూ.62,668గా ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పాయింట్​ బ్లాక్​లో గన్​ పెట్టి, బట్టలు విప్పేసి కొట్టారు: మాజీ క్రికెటర్​
    Stuart MAC Gill kidnap: ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్​ స్టువర్ట్​ మెక్​గిల్.. తాను కిడ్నాప్​ అయిన సంఘటనను గుర్తుచేసుకున్నాడు. దానికి సంబంధించి సంచలన విషయాలను బయటపెట్టాడు. దుండగులు తనను పాయింట్​ బ్లాక్​లో గన్​ పెట్టి.. నగ్నంగా మార్చి బాగా కొట్టారని చెప్పాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'విరాటపర్వం.. ఆ విమర్శల్లో ఏమాత్రం నిజం లేదు'
    Virataparvam Sarala brother: విరాటపర్వం చిత్ర క్లైమాక్స్​ సీన్స్​పై వస్తున్న విమర్శల్లో ఏ మాత్రం నిజంలేదని స్పష్టం చేశారు.. ఆ చిత్రానికి స్ఫూర్తి నిలిచిన సరళ సోదరుడు మోహన్​రావు. తాజాగా ఈటీవీ భారత్​కు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పారు. తన సోదరి ఉద్యమ నాయకుడ్ని కాకుండా ఉద్యమాన్ని ప్రేమిస్తూ అడవుల్లోకి వెళ్లిందని వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.