ETV Bharat / city

telangana Cabinet meeting updates : తెలంగాణ కేబినెట్ భేటీ.. ఆ అంశాలే ప్రధాన అజెండా!

author img

By

Published : Nov 29, 2021, 4:58 PM IST

ప్రగతి భవన్​లో సీఎం అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గం భేటీ అయింది. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు, యాసంగి సాగు, కొవిడ్​ పరిస్థితులు, ప్రజారోగ్యం, వైద్యారోగ్యశాఖ సన్నద్ధత, కార్యాచరణ, రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ టీకాల పురోగతి వంటి పలు అంశాలపై చర్చ జరిగింది.

telangana Cabinet
telangana Cabinet

Telangana Cabinet Meeting: ప్రగతి భవన్​లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ అధ్యక్షతన కేబినెట్ భేటీ అయ్యింది. ధాన్యం కొనుగోళ్లు, యాసంగి సాగు, రాష్ట్రంలో కొవిడ్​ పరిస్థితులు, ప్రజారోగ్యం, వైద్యారోగ్యశాఖ సన్నద్ధత, కార్యాచరణ, కొవిడ్ టీకాల పురోగతి, కరోనా పరీక్షల పెంపు, మందుల లభ్యత, ఆక్సిజన్ పడకల సామర్థ్యం, తదితర అంశాలపై మంత్రివర్గం సమీక్ష నిర్వహించింది. కార్యాచరణకు సంబంధించిన నివేదికను వైద్యశాఖ మంత్రివర్గానికి అందించింది.

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ గురించి కేబినెట్​కు వైద్య అధికారులు వివరించారు. వివిధ దేశాల్లో ఒమిక్రాన్ పరిస్థితిని కేబినెట్​ దృష్టికి తీసుకొచ్చారు. వైద్యశాఖ పూర్తి సన్నద్ధతతో ఉందని, అన్ని మందులు, పరికరాలూ అందుబాటులో ఉన్నాయన్న తెలిపారు. మానవ వనరులు పూర్తిగా అందుబాటులో ఉన్నాయని, అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నామని వైద్యాధికారులు మంత్రివర్గానికి తెలిపారు.

దీనిపై రాష్ట్ర కేబినెట్​ సూచనలు చేసింది. రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లోని పరిస్థితులను సమీక్షించాలని, మందులు, టీకాలు, మౌలిక వసతులు సమకూర్చుకోవాలని సూచించింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేసింది.

జిల్లాల్లో వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. మంత్రులంతా జిల్లాల్లో సమీక్షించాలని స్పష్టం చేశారు. ఆరు జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆరోగ్యశాఖ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. ఆదిలాబాద్, కుమురం భీం, నిర్మల్, మహబూబ్‌నగర్, నారాయణపేట, గద్వాల్‌ జిల్లాలపై దృష్టి పెట్టాలని ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీని ఆదేశించారు.

ఇదీ చదవండి:

Central Team Meet CM Jagan: వరదలతో కడప జిల్లాకు భారీ నష్టం.. సీఎం జగన్​తో కేంద్ర బృందం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.