ETV Bharat / city

VINAYAKA CHAVITHI: 'కరోనాను పారద్రోలాలని గణనాథుడిని ప్రార్థిద్దాం '

author img

By

Published : Sep 10, 2021, 9:19 AM IST

రాష్ట్ర ప్రజలందరికీ తెదేపా అధినేత చంద్రబాబు, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. కరోనా నిబంధనలు పాటిస్తూ పండగ జరుపుకోవాలని ప్రజలకు సూచించారు.

tdp vinayaka chavithi wishes
tdp vinayaka chavithi wishes

రాష్ట్ర ప్రజలందరికీ తెదేపా అధినేత చంద్రబాబు, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. . కొవిడ్ విబంధనలు పాటిస్తూ.. ఇళ్లలోనే పండుగను జరుపుకోవాలని అన్నారు. సకల విఘ్నాలను తొలగించే దేవాధిదేవుడు గణనాథుడని.. రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలని ఆ భగవంతుడిని ప్రార్థిద్దామని చెప్పారు.

దేశంలో విశిష్టత కలిగిన పండగ వినాయక చవితి అని అచ్చెన్నాయుడు అన్నారు. పర్యావరణ రక్షణకు మట్టి వినాయకులను పూజించాలని ప్రజలను ఆయన కోరారు.

  • ప్రకృతి, పర్యావరణం, ఆరోగ్యం పరమార్థాలుగా నిర్దేశింపబడిన భారతీయ పండుగలకు, మన విశిష్ట సంస్కృతికి ప్రతీక వినాయక చవితి. పత్రి పూజలతో ఏకదంతుడిని ప్రసన్నం చేసుకుంటున్న ప్రజలందరికీ #VinayakaChaturthi శుభాకాంక్షలు. గణనాథుడు మీకు సర్వదా క్షేమ, విజయ, శుభాలను అనుగ్రహించాలని కోరుకుంటున్నాను pic.twitter.com/4A6IjU9X0W

    — N Chandrababu Naidu (@ncbn) September 10, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

పాలకులకు గణేశుడు మంచి బుద్దిని ప్రసాదించాలని నారా లోకేశ్ కోరారు. రాష్ట్ర ప్రజలందరిపై ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

  • వినాయకుడిని సిద్ధి, బుద్ధి ప్రదాత అంటారు. అప్పులు, తప్పులు చేసి రాష్ట్ర ప్రజలను తిప్పలు పెడుతున్న మన పాలకులకు ఆ గణేశుడు మంచి బుద్ధిని ప్రసాదించాలి. ప్రజల అభివృద్ధికి ఆటంకంగా ఉన్న పాలకుల వక్రబుద్ధిని ఆ వక్రతుండుడు చక్కదిద్దాలి.(1/2)#VinayakaChaturthi pic.twitter.com/LdhCvUCZHI

    — Lokesh Nara (@naralokesh) September 10, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి: Ganesh Chaturthi: వినాయకుడి రూపాలెన్ని? పూజ ఎలా చేయాలి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.