ETV Bharat / city

PROTEST: పాఠశాలల విలీనంపై కొనసాగుతున్న ఆందోళనలు

author img

By

Published : Jul 8, 2022, 2:06 PM IST

PROTEST: పాఠశాలల విలీనంపై విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. వరుసగా నాలుగో రోజూ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. మా బడి మాకే కావలంటూ విద్యార్థుల నినదిస్తున్నారు. చిన్నారులను దూర ప్రాంతాలకు పంపలేమంటూ తల్లిదండ్రుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ దిగివచ్చే వరకూ ఆందోళనలు కొనసాగుతాయని తేల్చిచెబుతున్నారు..

PROTEST
PROTEST

పాఠశాలల విలీనంపై కొనసాగుతున్న ఆందోళనలు

PROTEST: బాపట్ల జిల్లా బల్లికురవ మండలం కొప్పెరపాడులోని మండల పరిషత్ పాఠశాల విలీనాన్ని నిరసిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రుల ధర్నా చేపట్టారు. ప్రస్తుతం 90 కి పైగా విద్యార్థులు ఉన్నచోట అంతా బాగానే ఉన్నప్పటికీ ప్రభుత్వ అనాలోచిత ధోరణి కారణంగా తమ పిల్లలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని వాపోయారు.

కర్నూలు జిల్లా: ప్రాథమిక పాఠశాలలను ఉన్నత పాఠశాలలో విలీనం చేయడంపై కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని మద్దికేర, పత్తికొండ మండలంలోని హోసూరు, వ్వెల్దుర్తి, తుగ్గలి తదితర మండలాల్లోని ఆయా పాఠశాలల పరిధిలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాఠశాలలకు తాళాలు వేసి ఆందోళనకు దిగారు. మద్దికేరలోని ప్రధాన ప్రాథమిక పాఠశాలకు తాళం వేసిన స్థానికులు మా పాఠశాలను ఉన్నత పాఠశాలలో విలీనం చేస్తే సహించబోమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు.

వైఎస్సార్‌ జిల్లా ఖాజీపేట మండలం కొత్తపేట వద్ద చెముళ్లపల్లె, సంజీవ్‌నగర్‌, కొత్తనెల్లూరు పాఠశాలలకు చెందిన విద్యార్థులతో తల్లిదండ్రులు చిత్తూరు-కర్నూలు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. జాతీయ రహదారిపై పెద్దలు దాటేందుకే భయపడే పరిస్థితి నెలకొనగా.... పిల్లలు ఏవిధంగా వెళ్తారంటూ తల్లిదండ్రులు ప్రశ్నించారు. తల్లిదండ్రుల ఆందోళనతో తహసీల్దారు రమణారెడ్డి వారితో చర్చించి... రాస్తారోకోను విరమించేలా చేశారు.

శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలంలోని జగన్నాథపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను విలీనం చేయవద్దని.. తల్లిదండ్రులు, విద్యార్థుల ధర్నా చేశారు. పిల్లలు పాఠశాలకు వెళ్లి రావాలంటే రెండు రోడ్డులు దాటాలసిన పరిస్థితి నెలకొందని.. ఆందోళన వ్యక్తం చేశారు. హిరమండలం రెల్లివలసలో ఉన్న ప్రభుత్వప్రాథమిక పాఠశాలను అంబావల్లి గ్రామంలో ఉన్న పాఠశాలకు విలీనం చేయడంతో తల్లిదండ్రులు విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. పాఠశాలకు తాళాలు వేసి నిరసన తెలియజేశారు.

ఏలూరు జిల్లా ముసునూరు పాఠశాలల విలీనం రద్దుచేయాలని తల్లిదండ్రులు నిరసన తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం ఇచ్చిన జీవోను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 3, 4, 5 తరగతులను సమీపంలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడం వల్ల గ్రామీణ విద్యార్థులు చదువుకు దూరమవుతారని ఆందోళన వ్యక్తంచేశారు.



ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.