ETV Bharat / city

Transfers: 28 మంది స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లకు బదిలీ

author img

By

Published : Jul 28, 2022, 8:32 AM IST

Transfers: రాష్ట్రంలో 28 మంది ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఇతర ప్రభుత్వశాఖల్లో సేవలు అందిస్తున్న పలువురిని మాతృశాఖకు బదిలీ చేసింది.

Transfers
బదిలీలు

Transfers: రాష్ట్రంలో 28 మంది స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇతర ప్రభుత్వశాఖల్లో సేవలు అందిస్తున్న పలువురిని మాతృశాఖకు బదిలీ చేసింది. ఇంకొందర్ని ఇతర శాఖల్లో నియమించారు. రాజమహేంద్రవరం పట్టణాభివృద్ధి సంస్థ వైస్‌ ఛైర్మన్‌గా ఇది వరకు నియమించినా బాధ్యతలు స్వీకరించని ఇ.మురళీని ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకి భూ సేకరణ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా వేశారు.

డిప్యూటీ కలెక్టర్‌ పి.కొండయ్యను సత్యసాయి జిల్లా రెవెన్యూ అధికారిగా నియమించారు. అక్కడ డీఆర్వోగా ఉన్న జి.గంగాధర్‌ గౌడ్‌ని వైఎస్సార్‌ కడప జిల్లాకు బదిలీ చేశారు. దేవాదాయశాఖ కర్నూలు జిల్లా డిప్యూటీ కమిషనర్‌గా ఉన్న తిప్పే నాయక్‌ని ధర్మవరం రెవెన్యూ డివిజనల్‌ అధికారిగా నియమించారు. వరహాలక్ష్మి నర్శింహస్వామి దేవస్థానం కార్యానిర్వాహక అధికారిని ఎంవీ సూర్యకళను విజయనగరం ఆర్డీవోగా బదిలీ చేశారు. స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ డి.హరితను నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్‌గా నియమించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.