ETV Bharat / city

Review Petition in telangana High court: 'నిమజ్జనం ఆంక్షలు సడలించండి... 24 గంటల్లో వ్యర్థాలు తొలగిస్తాం'

author img

By

Published : Sep 13, 2021, 10:42 AM IST

జీహెచ్‌ఎంసీ(GHMC) కమిషనర్ లోకేశ్‌ కుమార్‌.. గణేశ్‌ నిమజ్జనంపై తీర్పును పునఃపరిశీలించాలని హైకోర్టులో(high court)లో రివ్యూ పిటిషన్ వేశారు. హుస్సేన్‌సాగర్, జలాశయాల్లో నిమజ్జనంపై నిషేధం ఎత్తివేయాలని కోరారు. ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనానికి అనుమతించాలని కోరారు.

HC REVIEW PITITION
HC REVIEW PITITION

గణేశ్‌ నిమజ్జనంపై తీర్పును పునఃపరిశీలించాలని హైకోర్టులో(high court) జీహెచ్‌ఎంసీ(GHMC) కమిషనర్ లోకేశ్‌ కుమార్‌ రివ్యూ పిటిషన్(review petition) దాఖలు చేశారు. తీర్పులో 4 అంశాలు తొలగించాలని కోరారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్(pop) విగ్రహాలపై నిషేధం ఎత్తివేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. హుస్సేన్‌సాగర్, జలాశయాల్లో నిమజ్జనంపై నిషేధం ఎత్తివేయాలని కోరారు. ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనానికి అనుమతించాలని కోరారు.

ఉత్తర్వులు సవరించాలి

కృత్రిమ రంగుల్లేని విగ్రహాలనే అనుమతించాలని హైకోర్టు స్పష్టం చేయగా.. ఆంక్షలు తొలగించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ విజ్ఞప్తి చేశారు. రబ్బరు డ్యాం నిర్మాణ ఉత్తర్వులు సవరించాలని విన్నవించారు. రబ్బరు డ్యాం నిర్మాణానికి కొంత సమయం అవసరమని... ట్యాంక్‌బండ్‌కు అనుమతించకపోతే.. నిమజ్జనం పూర్తికి ఆరు రోజులు పడుతుందన్నారు. నగరంలో వేలసంఖ్యలో భారీ విగ్రహాలు ఉన్నాయని.. అందుకు తగినన్ని నీటి కుంటలు లేవని హైకోర్టు దృష్టికి తెచ్చారు.

గందరగోళం తలెత్తుతుంది

పెద్ద విగ్రహాలను కుంటల్లో నిమజ్జనం చేయడం కష్టమన్న జీహెచ్‌ఎంసీ కమిషర్‌.. ఇప్పటికే హుస్సేన్‌సాగర్ వద్ద క్రేన్లు, ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి వివరించారు. నెలల క్రితమే ప్రణాళికలు సిద్ధమయ్యాయని.. ఇప్పుడు మార్చితే గందరగోళం తలెత్తుతుందన్నారు. నిమజ్జనం తర్వత 24 గంటల్లో వ్యర్థాలు తొలగిస్తామని.. మాస్కులు ధరించేలా ప్రజలను చైతన్యపరుస్తామని హామీ ఇచ్చారు. విగ్రహాలను ఆపితే నిరసన చేపడతామంటున్నారని.. రోడ్లపైనే వాహనాలు ఆపాలని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి పిలుపునిచ్చిందని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నిమజ్జనంపై మినహాయింపులు ఇవ్వకపోతే గందరగోళం తలెత్తుతుందన్నారు.

ఇదీ చదవండి: ఏకగ్రీవ పంచాయతీలకు త్వరలో ప్రోత్సాహకాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.