ETV Bharat / city

ఏకగ్రీవ పంచాయతీలకు త్వరలో ప్రోత్సాహకాలు

author img

By

Published : Sep 13, 2021, 9:02 AM IST

మరికొద్ది రోజుల్లో రాష్ట్రంలోని ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహకాలను అందించనున్నట్లు పంచాయతీరాజ్‌ కమిషనర్‌ ఎం.గిరిజాశంకర్‌ తెలిపారు. మొత్తం 134.12 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలను ఆర్థిక శాఖకు నివేదించినట్లు చెప్పారు.

incentives-coming-soon-for-unanimous-panchayats
ఏకగ్రీవ పంచాయతీలకు త్వరలో ప్రోత్సాహకాలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా మరికొద్ది రోజుల్లో ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహకాలను అందించనున్నట్లు పంచాయతీరాజ్‌ కమిషనర్‌ ఎం.గిరిజాశంకర్‌ తెలిపారు. విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి మండల పరిషత్తు కార్యాలయానికి ఆదివారం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏకగ్రీవమైన పంచాయతీలకు ప్రోత్సాహకాల నిమిత్తం రూ.134.12 కోట్లతో ప్రతిపాదనలను ఆర్థిక శాఖకు నివేదించినట్లు చెప్పారు.

పంచాయతీ వార్డు సభ్యులకు సాధారణ శిక్షణ ఈ నెల 16, 17 తేదీల్లో ఉంటుందన్నారు. ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ రంగాన్ని అనుసంధానం చేసే ప్రక్రియ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉందని స్పష్టం చేశారు. గత ఐదేళ్లుగా ఉపాధి పనుల్లో దేశంలోనే రాష్ట్రం తొలి నాలుగు స్థానాల్లో ఉంటోందన్నారు. రానున్న రోజుల్లో 4 కోట్ల పనిదినాల కల్పనకు ప్రతిపాదనలను తయారు చేసి కేంద్రానికి పంపించినట్లు ఆయన చెప్పారు.

ఇదీ చూడండి: gokul scheme funds: రెండున్నరేళ్లు దాటినా బిల్లులు రాలేదు.. ఎప్పుడొస్తాయో !

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.