ETV Bharat / city

ఎండాకాలం వచ్చేసింది.. చర్మ సంరక్షణకూ జాగ్రత్తలివే..!

author img

By

Published : Mar 19, 2021, 1:36 PM IST

Precautions for skin care
చర్మ సంరక్షణకూ జాగ్రత్తలు

ఎండాకాలం వచ్చేసిందంటే...ముఖం జిడ్డుగా మారిపోతూ ఉంటుంది. జుట్టైతే ఎండకి పొరిబాడిపోయి..హెయిర్​ఫాల్ అవుతుంటుంది. అలాంటప్పుడు ఏవేవో చేయాలనుకుంటాం! ఎన్ని క్రిములు రాసినా ఎదో అసంతృప్తితో ఉంటాం. మనం కొన్నిజాగ్రత్తలు తీసుకుంటే వీటినుంచి కాస్తా ఉపశమనం పొందొచ్చు. చర్నాన్ని, జుట్టును కాపాడుకోవాలంటే ఆ జాగ్రత్తలేంటే తెలుసుకోండి మరి..!

ఎండకాలంలో చర్మాన్ని, జుట్టును కాపాడుకోవాలంటే ఈ జాగ్రత్తలు పాటించాలి మరి!

తరచూ శుభ్రం చేయండి: వేసవిలో దుమ్మూ, ధూళి, చెమట వంటి వాటివల్ల చర్మంపై మురికి పేరుకుపోతుంది. వీటితో చర్మగ్రంథులు మూసుకుపోతాయి. అలాకాకుండా ఉండాలంటే తరచూ ముఖం కడుక్కోవాలి. వారానికోసారైనా మృతకణాలను తొలగించుకోవాలి. కీరదోస రసంలో కాస్త నిమ్మరసం పిండి చర్మాన్ని శుభ్రపరుచుకుంటే ఫలితం ఉంటుంది.


తేమ అవసరం: ఈ కాలంలో నీళ్లు ఎక్కువ తాగాలి. దీనివల్ల శరీరం చల్లబడుతుంది. వ్యర్థాలు, ట్యాక్సిన్లు బయటకు వెళ్లిపోతాయి. ఫలితంగా సహజంగానే చర్మం తాజాగా, తేమగా కనిపిస్తుంది. వాడే సౌందర్య ఉత్పత్తుల్లో సిరామైడ్‌, ఆక్వా, గ్లిజరిన్‌ వంటివి ఉండేలా చూసుకుంటే...సరి. అలాగే మాయిశ్చరైజర్‌ రాసుకోవడం మానొద్దు. అప్పుడే కాంతివంతంగా కనిపించొచ్చు.


సన్‌స్క్రీన్‌ తప్పనిసరి: ఈ విషయం అందరికీ తెలిసిందే అయినా ఈ కాలంలో మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. నేరుగా తగిలే ఎండ పిగ్మెంటేషన్‌కి కారణం అవుతుంది. రంగూ మారుతుంది. అందుకే మీ చర్మతత్వానికి నప్పే రకాన్ని ఎంచుకోండి.


వాటర్‌ప్రూఫ్‌ మేకప్‌: మేకప్‌ వేసుకున్నాక చర్మం జిడ్డుకారుతుంటే చూడ్డానికి ఎబ్బెట్టుగా ఉంటుంది. అందుకే వీలైనంత తక్కువగా ఉండేలా చూసుకోండి. తప్పనిసరిగా వేసుకోవాలనుకుంటే లైట్‌వెయిట్‌ బీబీ క్రీమ్‌ వాడండి. అప్పుడు సహజంగా కనిపిస్తారు. మస్కారాని ఎంచుకునేటప్పుడు వాటర్‌ప్రూఫ్‌ రకాన్ని ఎంచుకోండి.


జుట్టుకి వేడి తగలనివ్వకండి: జుట్టు ఆరబెట్టుకోవడానికో లేదా స్టైలింగ్‌ పేరుతోనో తరచూ డ్రైయ్యర్లు వాడటం, కర్లర్లు, స్ట్రెయిటనర్లు వినియోగించడం వంటివి చేయొద్దు. ఇవి మాడుమీద సహజంగా ఉండే నూనెల్ని తొలగిస్తాయి. ఫలితంగా వెంట్రుకలు పొడిబారి నిర్జీవంగా మారతాయి.

ఇదీ చూడండి. సంసార సాగరంలో.. మార్పు మీతోనే మొదలవ్వాలి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.