Lokesh: తెదేపా అధికారంలోకి వచ్చాక... వర్సిటీకి మళ్లీ ఎన్టీఆర్​ పేరు: లోకేశ్​

author img

By

Published : Sep 21, 2022, 5:28 PM IST

Updated : Sep 21, 2022, 10:25 PM IST

Lokesh comments

Nara Lokesh: తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఆరోగ్య విశ్వవిద్యాలయానికి మళ్లీ ఎన్టీఆర్​ పేరు పెడతామని నారా లోకేశ్‌ ప్రకటించారు. ఇది జరిగి తీరుతుందని స్పష్టం చేశారు. వైకాపా ప్రభుత్వ తీరు అత్యంత దారుణమని లోకేశ్ మండిపడ్డారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి చెందిన రూ.400 కోట్ల నిధులు జగన్ కొట్టేశారని ఆరోపించారు.

Nara Lokesh: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు ఏకపక్షంగా మార్చేశారని, రాష్ట్ర చరిత్రలో ఈ రోజు చీకటి రోజని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ మండిపడ్డారు. ఆనాడు హెల్త్ యూనివర్సిటీని ఎన్టీఆర్ ప్రారంభించారని.. దానికి వైఎస్​కు ఎలాంటి సంబంధం లేదన్నారు. జగన్ ఒక సైకో.. ఆయన ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి మహనీయుల పేర్లతో ఉన్న సంక్షేమ కార్యక్రమాల పేర్లు మార్చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి చెందిన రూ.400 కోట్ల నిధులు జగన్ కొట్టేశారని ఆరోపించారు. తెలుగు జాతి ఉన్నంత వరకూ ఎన్టీఆర్ పేరు చిరస్థాయిగా ఉంటుందని తేల్చిచెప్పారు. ఎన్టీఆర్ మహనీయుడు, తెలుగు జాతికి గర్వకారణం అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ పేరు తొలగించడం తెలుగు జాతిని అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

NTR Health University: తెలుగు వారికి గుర్తింపు తెచ్చింది, దేశంలో మొదట సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికింది ఎన్టీఆర్ అని నారా లోకేశ్​ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ పేరు మార్చడానికే రహస్య కేబినెట్​ నిర్వహించారని మండిపడ్డారు. ఇదే పద్ధతిలో చంద్రబాబు ఆలోచించి ఉంటే పరిస్థితులు వేరే విధంగా ఉండేవని.. ఆయన ఎక్కడా వైఎస్ పేరు తొలగించలేదని గుర్తు చేశారు. ఎన్టీఆర్ పేరు ఎందుకు తొలగించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. జగన్ రెడ్డి సీఎం అయ్యాక.. గతంలో తమిళనాడులో ఉన్న రాజకీయం ఇక్కడ తీసుకొచ్చారని... ఇదే పద్దతి కొనసాగితే రాష్ట్రం పేరు కూడా మార్చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు నిర్ణయం వెనక్కి తీసుకోవాలని నారా లోకేశ్​ డిమాండ్ చేశారు. యూనివర్సిటీ పేరు మార్పుతో జగన్ చరిత్ర హీనుడుగా మిగిలిపోతారని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలు అనేకం ఉంటే జగన్ ప్రభుత్వం పేర్లు మార్చే పనిలో బిజీగా ఉందని విమర్శించారు. తెదేపా అధికారంలోకి రాగానే ఎన్టీఆర్ పేరు పెట్టి తీరుతామని తేల్చిచెప్పారు. ఎన్టీఆర్​పై అంత గౌరవం ఉంటే 'హెల్త్ యూనివర్సిటీ పేరు ఎందుకు మార్చారు? అన్న క్యాంటీన్ ఎందుకు ఎత్తేసారు?' సంక్షేమ పథకాలకు ఎన్టీఆర్ పేరు ఎందుకు తొలగించారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు జిల్లాల్లో వైద్య, ఇంజినీరింగ్ కళాశాలలు తీసుకొచ్చిన సమయంలో బహుశా జగన్ టెన్త్ పేపర్లు కొట్టేసి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడేమో అని ఎద్దేవా చేశారు.

నారా లోకేశ్‌

"తెలుగు జాతి మొత్తం బాధపడే నిర్ణయాన్ని జగన్ తీసుకున్నారు. ఎన్టీఆర్‌ పేరు మార్చడాన్ని వైకాపా నేతలూ ఇష్టపడట్లేదు. ఎన్టీఆర్ పేరు తొలగించడం తెలుగుజాతిని అవమానించడమే. ఎన్టీఆర్ పేరు ఎందుకు తొలగించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎన్టీఆర్‌పై అంత గౌరవం ఉంటే హెల్త్ యూనివర్సిటీ పేరు ఎందుకు మార్చారు?. తెదేపా అధికారంలోకి వచ్చాక హెల్త్‌ యూనివర్సిటీకి మళ్లీ ఎన్టీఆర్‌ పేరు పెడతాం. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కి చెందిన రూ.400 కోట్ల నిధులు జగన్ కొట్టేశారు. ఏ ఆత్మతో మాట్లాడి జగన్‌రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారో తెలియదు. చంద్రబాబు హయాంలోనే జిల్లాకొక మెడికల్ కాలేజ్‌ తెచ్చారు. వైకాపా ప్రభుత్వం ఏకపక్షంగా బిల్లులను ఆమోదిస్తోంది. విపక్షాలకు భయపడి అసెంబ్లీ సమావేశాలు 5 రోజులే పెట్టారు." -నారా లోకేశ్​

లోకేశ్​ ట్వీట్​: జగన్‌ తన పార్టీకి తానే అధ్యక్షుడు కాకుండా పోయారని నారా లోకేశ్‌ ట్వీట్​ చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చిన రోజే ఈసీ నిర్ణయం వెల్లడించిందన్నారు. రెండూ ఒకే రోజు జరగడం.. దేవుడి రాసిన స్క్రిప్టు అని తెలిపారు. ఈసీ నిర్ణయంతో జగన్‌రెడ్డి భవిష్యత్‌ ఏంటో అని ట్వీట్​లో తెలిపారు.

  • ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు
    మార్చాడు..

    తన పార్టీకి తానే అధ్యక్షుడు కాకుండా పోయాడు..

    రెండూ ఒకే రోజు... దేవుడి స్క్రిప్ట్‌.
    జగన్ రెడ్డి భవిష్యత్తేంటో..?#RetainNTRname pic.twitter.com/umvoNJxelz

    — Lokesh Nara (@naralokesh) September 21, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి:

Last Updated :Sep 21, 2022, 10:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.