"వర్సిటీకి, వైఎస్సార్​కు సంబంధం ఏంటి?.. జగన్​ చరిత్ర హీనుడిగా మిగిలిపోతారు"

author img

By

Published : Sep 21, 2022, 10:22 AM IST

Updated : Sep 21, 2022, 3:33 PM IST

TDP

TDP on NTR Health University: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై తెదేపా అధినేత చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. యూనివర్సిటీకి, వైఎస్సార్​కు సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఇలాంటి పనులతో సీఎం జగన్​... చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడని విమర్శించారు. హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు తుగ్లక్ చర్యని ఆగ్రహం వ్యక్తం చేశారు.

TDP on NTR Health University: హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగింపుపై తెలుగుదేశం నేతలు భగ్గుమన్నారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగింపు జగన్ ప్రభుత్వ దివాళాకోరుతనానికి నిదర్శనమని చంద్రబాబు అన్నారు. 1986లో ఏర్పాటైన ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీతో వైఎస్సార్‌కు ఏం సంబంధం ఉందని చంద్రబాబు ప్రశ్నించారు. ఎన్టీఆర్ నిర్మించిన వర్సిటీకి మీ తండ్రి పేరు ఎలా పెట్టుకుంటారన్నారు. ఆరోగ్య వర్సిటీకి ఎన్టీఆర్ పేరు కొనసాగించాల్సిందేనని డిమాండ్​ చేశారు. ఉన్న సంస్థలకు పేర్లు మార్పు కాదు... కొత్తగా నిర్మిస్తే పేరొస్తుందని చంద్రబాబు దయ్యబట్టారు.

  • హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగింపు జగన్ ప్రభుత్వ దివాళాకోరుతనానికి నిదర్శనం. తెలుగుదేశం పార్టీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తోంది. వైద్య విద్యకు ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండాలనే సంకల్పంతో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 1986లో ఈ హెల్త్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు.(1/5) pic.twitter.com/y3oSAdHgYw

    — N Chandrababu Naidu (@ncbn) September 21, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగింపు జగన్ ప్రభుత్వ దివాళాకోరుతనానికి నిదర్శనం. తెలుగుదేశం పార్టీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తోంది. వైద్య విద్యకు ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండాలనే సంకల్పంతో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 1986లో ఈ హెల్త్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి చెందిన రూ.450 కోట్ల నిధులను సైతం బలవంతంగా కాజేసిన జగన్ ప్రభుత్వం..ఏ హక్కుతో వర్సిటీ పేరు మార్చుతుంది?కనీసం స్నాతకోత్సవం నిర్వహణకు కూడా నిధులు లేకుండా చేసిన వీళ్ళు ఇప్పుడు పేరు మార్చుతారా?అసలు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ కు ఏం సంబంధం ఉంది?. దశాబ్దాల నాటి సంస్థలకు ఉన్న పేర్లు మార్చి కొత్తగా మీ పేర్లు పెట్టుకుంటే మీకు పేరు రాదు సరికదా...ప్రజలు మీ దిగజారుడుతనాన్ని ఛీకొడతారు. చేతనైతే కొత్తగా సంస్థలను నిర్మించండి. ఇకనైనా ప్రభుత్వం పిచ్చి ఆలోచనలు మానుకుని హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును యధావిధిగా కొనసాగించాలి." - తెదేపా అధినేత చంద్రబాబు

చరిత్ర హీనుడు జగన్​రెడ్డి... ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు నిర్ణయం వెనక్కి తీసుకోవాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు తుగ్లక్ చర్యని దుయ్యబట్టారు. తెలుగువారి ఆత్మగౌరవం... ఎన్టీఆర్ అని స్పష్టం చేశారు. వైఎస్​కు హెల్త్ యూనివర్సిటీకి సంబంధం ఎంటని నిలదీశారు. హెల్త్ యూనివర్సిటీ నెలకొల్పింది, అభివృధి చేసింది ఎన్టీఆర్ అని లోకేశ్ గుర్తుచేశారు. తన చర్యలతో జగన్ చరిత్ర హీనుడుగా మిగిలిపోతారని విమర్శించారు.

  • అసలు వైఎస్ కి, హెల్త్ యూనివర్సిటీకి సంబంధం ఏంటి? హెల్త్ యూనివర్సిటీ నెలకొల్పింది, అభివృద్ధి చేసింది ఎన్టీఆర్ గారు. ఈ చర్యలతో జగన్ రెడ్డి శాశ్వతంగా చరిత్రహీనుడు గా మిగిలిపోతాడు.(2/2)

    — Lokesh Nara (@naralokesh) September 21, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు నిర్ణయం తక్షణమే వెనక్కి తీసుకోవాలి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు తుగ్లక్ చర్య. తెలుగు వారి ఆత్మగౌరవం స్వర్గీయ శ్రీ ఎన్టీఆర్ నెలకొల్పిన యూనివర్సిటీ ఇది. అసలు వైఎస్​కి, హెల్త్ యూనివర్సిటీకి సంబంధం ఏంటి?. హెల్త్ యూనివర్సిటీ నెలకొల్పింది, అభివృద్ధి చేసింది ఎన్టీఆర్. ఈ చర్యలతో జగన్ రెడ్డి శాశ్వతంగా చరిత్రహీనుడుగా మిగిలిపోతారు." -తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​

ఎన్టీఆర్ పేరు మార్చే దుస్సాహసం చేశారంటే, జగన్‌కు రోజులు దగ్గర పడినట్లేనని... పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్‌ అన్నారు. వైద్య వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ ఆరోగ్య వర్సిటీకి అంకురార్పణ చేసిన ఎన్టీఆర్ పేరు ఎలా మారుస్తారని ప్రశ్నించారు. వైకాపాలో అంతర్గతంగా సీక్రెట్ ఓటింగ్ నిర్వహించినా.... జగన్‌ తప్పు చేశారనే విషయం అర్థమవుతుందన్నారు. ఇప్పటికైనా జగన్‌ పోకడలపై ప్రజలంతా నిరసన తెలపాలని... లేదంటే పుట్టే బిడ్డ నుంచి రాష్ట్రం వరకు అన్నింటికీ ఆయన పేర్లు పెట్టుకుంటారని ఆందోళన వ్యక్తంచేశారు.

శాడిస్టు ముఖ్యమంత్రికి పిచ్చికూడా పట్టింది కాబట్టే యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్చారని తెదేపా శాసనసభ పక్ష ఉపనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ జోలికి వస్తే జగన్మోహన్ రెడ్డి ఇక ఇంటికే పరిమితమవుతారని ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు మండిపడ్డారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే కడప జిల్లాకు వైఎస్ పేరు తొలగించే ఆలోచన జగన్మోహన్ రెడ్డి కల్పిస్తున్నారని ఎమ్మెల్సీ అశోక్ బాబు హెచ్చరించారు. ఎన్టీఆర్ పేరుపై ఉద్యమిస్తామని మరో ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ తేల్చిచెప్పారు.

బీసీల అన్నతి కోసమే తెదేపాను ఎన్టీఆర్ స్థాపించారని ఎమ్మెల్యే అనగాని అన్నారు. వైద్య విద్యలో సంస్కరణలు తీసుకొస్తూ వర్సిటీ స్థాపించారని గుర్తు చేశారు. మహనీయుడు పేరు వర్సిటీకి తొలగిస్తే బీసీలు ఊరుకోరని హెచ్చరించారు. తాడేపల్లి ప్యాలెస్‌ను ముట్టడిస్తామన్నారు.

దేవినేని ధర్నా: ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ పేరు మార్పు నిర్ణయంపై దేవినేని ఉమ ధర్నా చేపట్టారు. గొల్లపూడి ఎన్టీఆర్ సర్కిల్‌లో తెదేపా కార్యకర్తలతో కలిసి ధర్నాకు దిగారు. దేవినేని ఉమతో పాటు తెదేపా నేతలను పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడ భవానీపురం పోలీసుస్టేషన్‌కు తెదేపా నేతలను తరలించారు.

ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్చితే వైఎస్సార్ ఆత్మ శాంతించదని తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్​ రెడ్డి అన్నారు. 1986లో ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు హెల్త్ సైన్సెస్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. 1998లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ పేరు పెట్టారన్నారు. వైఎస్‌ఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు ఎన్టీఆర్‌ పేరుకు ముందు డాక్టర్ చేర్చారని స్పష్టం చేశారు.

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చటం దుర్మార్గమని తెదేపా నేత ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఎన్టీఆర్ పేరు మార్చితే చరిత్ర క్షమించదన్నారు. సీఎం జగన్ ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ప్రజలు బుద్ధిచెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.

ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ పేరు మార్చడం అత్యంత హేయమైన చర్య అని తెదేపా నేత ధూళిపాళ్ల అభిప్రాయపడ్డారు. పేర్లు, ఊర్లు మార్చడం తప్ప జగన్‌ కొత్తగా చేసిందేమీ లేదని విమర్శించారు. ఒక్క వైద్య కళాశాలైనా ఏర్పాటు చేసి తన నాన్న పేరు పెట్టుకోవాలని ధూళిపాళ్ల హితవు పలికారు.

ఎన్టీఆర్‌ ఆలోచనకు వాస్తవ రూపమే ఆరోగ్య వర్సిటీ అని కేశినేని నాని అభిప్రాయపడ్డారు. రాజకీయాలకు అతీతంగా ఎన్టీఆర్‌ పేరును కొనసాగించాలన్నారు. ఎన్టీఆర్ పేరు మార్చడం ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థనీయం కాదన్నారు.

ఎన్టీఆర్​ యూనివర్సిటీ పేరు మార్పుని ఖండిస్తున్న నేతలు

ఇవీ చదవండి:

Last Updated :Sep 21, 2022, 3:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.