ETV Bharat / city

Seethakka in telangana Assembly sessions 2021: 'ప్రజా గొంతుకలను కట్‌ చేయడమే మీ లక్ష్యమా?'

author img

By

Published : Oct 1, 2021, 12:47 PM IST

Seethakka in Assembly sessions telangana 2021
Seethakka in Assembly sessions telangana 2021

తెలంగాణ శాసనసభ సమావేశాల్లో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే సీతక్క(Seethakka in Assembly sessions 2021) నడుమ వాగ్వాదం చోటు చేసుకుంది. గ్రామపంచాయతీలపై ప్రశ్నించిన సీతక్క... స్పీకర్‌పై(seethakka vs speaker) ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా గొంతుకలను కట్‌చేయడమే లక్ష్యమంటూ ఆరోపించారు.

స్పీకర్ వర్సెస్ సీతక్క

'ప్రజా గొంతుకలను కట్‌చేయడమే మీ లక్ష్యమంటూ' ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క(Seethakka in Assembly sessions 2021) మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సభలో గ్రామపంచాయతీల గురించి పలు ప్రశ్నలు సంధించిన సీతక్క.. తాను కేవలం ప్రశ్నలే అడిగానని.. రాజకీయం మాట్లాడడం లేదని అన్నారు. వాస్తవ పరిస్థితిపై మాట్లాడుతున్నానని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆమె డీవీయేట్ అవుతున్నారని స్పీకర్ అభిప్రాయపడ్డారు. ప్రశ్న వేరుందని పేర్కొన్నారు. ప్రశ్నకే పరిమితమవ్వాలని సూచించారు.

సీతక్క ఆగ్రహం

తాను ప్రశ్నకే పరిమితమయ్యాయని సీతక్క అన్నారు. ప్రజా గొంతుకలను కట్‌చేయడమే లక్ష్యమంటూ ఆరోపించారు. గ్రామపంచాయతీలను బలోపేతం చేయడం కోసం ప్రభుత్వం ఇస్తున్నటువంటి గ్రాంట్ ఎంత ఉందని ఆమె ప్రశ్నించారు. ఈ మధ్యకాలంలో చాలామంది సర్పంచులు మానసిక ఆవేదనకు గురవుతున్నారని అన్నారు. చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాక.. ప్రభుత్వ గ్రాంట్లు నెలనెలకు రాకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

గ్రామపంచాయతీలకు కేంద్రం నుంచి ఎన్ని నిధులు ఇస్తున్నారు? రాష్ట్రం నుంచి ఎన్ని కేటాయిస్తున్నారు. చిన్నచిన్న పంచాయతీలకు ఇచ్చేటువంటి రూ.30, రూ.40 వేలు సరిపోతున్నాయా?. గ్రామాల అభివృద్ధి కార్యక్రమాల కోసం ఈ నిధులు సరిపోతున్నాయా? అని ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి.

-ఎమ్మెల్యే సీతక్క

ఉపాధి హామీ పథకం కింద కేంద్రం ఇస్తున్న రూ.15,738 కోట్లను గ్రామపంచాయతీలకు రాకుండా డైవర్ట్ అయినట్లు తెలుస్తోందని.. వాటిపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. బిల్లులు రాక సర్పంచులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

ఇదీ చదవండి:

Dhawaleswaram dam : ధవళేశ్వరం ఆనకట్టపై గుంతలు పూడ్చిన అధికారులు...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.