ETV Bharat / city

JAGAN MARRIAGE ANNIVERSARY: సీఎం జగన్​ దంపతుల పెళ్లిరోజు.. ప్రముఖుల శుభాకాంక్షలు

author img

By

Published : Aug 28, 2021, 2:41 PM IST

సీఎం జగన్​ దంపతులు
సీఎం జగన్​ దంపతులు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దంపతుల 25వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా..గవర్నర్​ బిశ్వభూషణ్​​ హరిచందన్​ శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు.

ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దంపతుల 25వ వివాహ వార్షికోత్సవం. ఈ సందర్భంగా ప్రముఖులు ఆ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్​ బిశ్వభూషణ్​​ హరిచందన్..​ ట్విటర్​ వేదికగా జగన్​ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

  • Hon'ble Governor Sri Biswa Bhusan Harichandan conveyed his greetings to @AndhraPradeshCM Sri @ysjagan & Smt. Y S Bharathi Reddy on their 25th wedding anniversary. Governor prayed Lord Jagannath & Lord Balaji to shower their blessings on them for a long, healthy & prosperous life. pic.twitter.com/K3XTZ4fvDj

    — Governor of Andhra Pradesh (@governorap) August 28, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ - వైఎస్‌ భారతి రెడ్డిలకు 25వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. జగన్నాథుడైన బాలాజీ ఆశీస్సులు ఈ దంపతులకు ఎల్లవేళలా ఉండాలని, ఆయురారోగ్యాలతో జీవితం గడపాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నా'- గవర్నర్​, బిశ్వభూషణ్ హరిచందన్

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దంపతులు తమ వివాహ వార్షికోత్సవాన్ని హిమాచల్​ప్రదేశ్​లోని షిమ్లాలో చేసుకుంటున్నారు. ఇరువురి వివాహం జరిగి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో.. ఆ వేడుకల్ని కుటుంబంతో కలిసి ముఖ్యమంత్రి జగన్ నిర్వహించుకుంటున్నారు.

వైఎస్ భారతీజగన్.. వివాహ వార్షికోత్సవ స్పెషల్ పిక్
వైఎస్ భారతీజగన్.. వివాహ వార్షికోత్సవ స్పెషల్ పిక్

సతీమణి భారతి, కుమార్తెలతో కలిసి జగన్ ఈ నెల 26 తేదీన షిమ్లా పర్యటనకు వెళ్లారు. ఆయన వివాహ 25 వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కొందరు మంత్రులు, ప్రముఖులు, బంధువులు ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ట్విటర్​లో జగన్ అభిమానులు, పార్టీ నేతలు వివాహ శుభలేఖతో పాటు ఆయన ఫొటోలను కూడా పెట్టి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరోవైపు హిమాచల్​లోని షిమ్లాలో ఆయన బస చేస్తున్న అతిథిగృహం ఎదురుగా సీఎం జగన్ దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు చెబుతూ భారీ బ్యానర్ వెలిసింది.

ఇదీ చదవండి:

CM JAGAN MARRIAGE DAY: సీఎం జగన్​ దంపతుల పెళ్లిరోజు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.