ETV Bharat / city

సీఎంను కలిశాకే వెళ్తాం.. న్యాయవాదుల ఆందోళన!

author img

By

Published : Oct 16, 2019, 11:52 AM IST

Updated : Oct 16, 2019, 12:50 PM IST

lawyers-protest-againist-ap-govt-at-secretary

సచివాలయం గేటు వద్ద రాయలసీమ న్యాయవాదుల ఆందోళన చేపట్టారు. హైకోర్టును రాయలసీమకు తరలించాలని డిమాండ్ చేశారు.

సీఎంను కలిశాకే వెళ్తాం.. న్యాయవాదుల ఆందోళన!

హైకోర్టును రాయలసీమకు తరలించాలని సచివాలయం ఎదుట రాయలసీమ న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. ముఖ్యమంత్రిని కలిశాకే వెళ్తామని డిమాండ్ చేశారు. అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల నుంచి వచ్చిన న్యాయవాదులు సీఎం కాన్వాయ్ వెళ్తుండగా నినాదాలు చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలంటే రాయలసీమలోనే హైకోర్టు ఉండాలని న్యాయవాదులు అన్నారు.

ఇదీ చదవండి:''శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం.. హై కోర్టు ఏర్పాటు చేయండి''

Intro:రిపోర్టర్ : కె. శ్రీనివాసులు
సెంటర్   :  కదిరి
జిల్లా      : అనంతపురం
మొబైల్ నం     7032975449
Ap_Atp_46_16_BJP_Leader_On_Alliance_AVB_AP10004


Body:ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం ,జనసేన పార్టీలతో భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు సునీల్ దేవధర్ అన్నారు. ఈ రెండు పార్టీలు 2014 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేశాయన్నారు. తరువాత భాజపా, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. భవిష్యత్తులో భారత జనతా పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదంటూ బీరాలు పలికిన ఆ రెండు పార్టీల వైఖరిలో ఇటీవల మార్పు వచ్చిందన్నారు. తిరిగి భాజపాతో కలిసి నడిచేందుకు ఆసక్తి చూపుతున్న
తమ పార్టీ పెద్దలు వారికి తలుపులు మూసేశారని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఇతర పార్టీలతో పొత్తు లేకుండా పోటీకి దిగుతోంది అన్నారు. కొందరు వైకాపా నాయకులు భారతీయ జనతాపార్టీ నాయకులు ఉత్తమ సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు అంటూ గొప్పలు చెప్పడం విడ్డూరమన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా మార్గదర్శకంలోనే వైకాపా నాయకులు పని చేయాలన్న విషయాన్ని మరవద్దని సునీల్ దేవధర్ హితవు పలికారు. ఏపీలో 2024 ఎన్నికల్లో భాజపా వైకాపాల మధ్యే పోటీ ఉంటుందని ఆయన అన్నారు.


Conclusion:బైట్
సునీల్ దేవధర్, భాజపా, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి
Last Updated :Oct 16, 2019, 12:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.