AP LOANS: వ్యవసాయ రుణాల్లో ఏపీది రెండో స్థానం.. తమిళనాడు ప్రథమం

author img

By

Published : Aug 3, 2022, 8:57 AM IST

AP AGRICULTURE LOANS

AP AGRICULTURE LOANS:వ్యవసాయ రుణాల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలో( Andhra Pradesh in second place ) రెండో స్థానంలో నిలిచింది. 2022 మార్చి 31 నాటికి ఏపీ వ్యవసాయ రుణాలు రూ.1.92 లక్షల కోట్లకు చేరాయి. దేశంలోని వివిధ రాష్ట్రాలను ఉత్తర, ఈశాన్య, తూర్పు, కేంద్ర, పశ్చిమ, దక్షిణ ప్రాంతాలుగా విభజించి కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ(agriculture loans) రుణాలను లెక్కించింది. అందులో 8 రాష్ట్రాల సమాహారమైన ఉత్తర ప్రాంతంలో మొత్తం కలిపి రూ.2.83 లక్షల కోట్ల రుణాలు ఉంటే.. దక్షిణాది రాష్ట్రాల్లోని ఒక్క తమిళనాడులోనే రూ.2.78 లక్షల కోట్లు ఉన్నాయి.

AP AGRICULTURE LOANS: వ్యవసాయ రుణాల్లో ఆంధ్రప్రదేశ్‌(AGRICULTURE LOANS) దేశంలో రెండో స్థానంలో నిలిచింది. 2022 మార్చి 31 నాటికి ఏపీ వ్యవసాయ రుణాలు రూ.1.92 లక్షల కోట్లకు చేరాయి. ఈ విషయంలో తమిళనాడు (రూ.2.78 లక్షల కోట్లు) మొదటి స్థానంలో నిలిచింది. మార్చి 31 నాటికి దేశంలోని(ap loans in agriculture) అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలపై వ్యవసాయ రుణభారం రూ.17,09,893 కోట్లు ఉండగా, అందులో 46.20% దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉంది. దేశంలోని() వివిధ రాష్ట్రాలను ఉత్తర, ఈశాన్య, తూర్పు, కేంద్ర, పశ్చిమ, దక్షిణ ప్రాంతాలుగా విభజించి కేంద్ర(central on agriculture loans ) ప్రభుత్వం వ్యవసాయ రుణాలను లెక్కించింది. అందులో 8 రాష్ట్రాల సమాహారమైన ఉత్తర ప్రాంతంలో మొత్తం కలిపి రూ.2.83 లక్షల కోట్ల రుణాలు ఉంటే.. దక్షిణాది రాష్ట్రాల్లోని ఒక్క తమిళనాడులోనే రూ.2.78 లక్షల కోట్లు ఉన్నాయి. జనాభా పరంగా అతిపెద్ద(uttar pradesh) రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్‌లో వ్యవసాయ రుణాలు రూ.1.14 లక్షల కోట్లు ఉండగా.. దక్షిణాదిలో అతిచిన్న రాష్ట్రమైన కేరళలోనూ(kerala) దానికి సమానంగా ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో అతితక్కువ రుణాలు తెలంగాణ (రూ.82,601.97 కోట్లు)లో ఉన్నాయి. మంగళవారం లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ ఈ వివరాలు వెల్లడించారు.

2,209 పంచాయతీలకు సొంత భవనాల్లేవు
ఆంధ్రప్రదేశ్‌లోని 13,371 గ్రామ పంచాయతీలు ఉండగా 2,209 వాటిల్లో సొంత భవనాలు లేవని కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ సహాయ మంత్రి కపిల్‌ మోరేశ్వర్‌ పాటిల్‌ తెలిపారు. మంగళవారం లోక్‌సభలో వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. స్థానిక సంస్థలు రాష్ట్ర పరిధిలోకి వస్తాయని, వాటికి భవనాలు, విద్యుత్తు, (water resources)తాగునీరులాంటి మౌలిక వసతులను కల్పించే ప్రాథమిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని వెల్లడించారు.

రాష్ట్రంలో ఎయిడ్స్‌ రోగులు 3.21 లక్షలు
దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 3.94 లక్షల మంది ఎయిడ్స్‌(aids) రోగులుండగా దాని తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో 3.21 లక్షలమంది ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ సహాయమంత్రి భారతీ ప్రవీణ్‌ పవార్‌ తెలిపారు. ఆమె మంగళవారం రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు.

* విజయవాడ నుంచి ముక్త్యాల వరకు కృష్ణానదిపై చేపట్టిన జలరవాణా ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.96 కోట్లు విడుదల చేయగా, జూన్‌ 30 నాటికి రూ.54.08 కోట్లు వినియోగించినట్లు శర్బానంద సోనోవాల్‌ తెలిపారు. వైకాపా ఎంపీ మోపిదేవి వెంకటరమణ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ఈ మార్గంలో సాగరమాల స్కీం కింద ఎలాంటి అభివృద్ధి పనులూ చేపట్టడంలేదని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.