HIGH COURT: రుషికొండ పనుల పరిశీలనకు వెళ్లిన న్యాయవాదిపై కేసు.. హైకోర్టు స్టే
Updated on: Aug 3, 2022, 12:19 PM IST

HIGH COURT: రుషికొండ పనుల పరిశీలనకు వెళ్లిన న్యాయవాదిపై కేసు.. హైకోర్టు స్టే
Updated on: Aug 3, 2022, 12:19 PM IST
HIGH COURT: విశాఖలోని రుషికొండ వద్ద పర్యాటక పునరుద్ధరణ ప్రాజెక్ట్ నిర్మాణం పనులను పరిశీలించడానికి వెళ్లిన సీనియర్ న్యాయవాది కేఎస్ మూర్తిపై పోలీసులు నమోదు చేసిన కేసులో హైకోర్టు తదుపరి చర్యలన్నింటిని నిలిపేసింది. ఆరిలోవ పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ కేఎస్ మూర్తి మంగళవారం హైకోర్టులో అత్యవసరంగా వ్యాజ్యం దాఖలు చేశారు. ఆయన తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు.
HIGH COURT: విశాఖలోని రుషికొండ వద్ద పర్యాటక పునరుద్ధరణ ప్రాజెక్ట్ నిర్మాణం(high court stay) పనులను పరిశీలించడానికి వెళ్లిన సీనియర్ న్యాయవాది కేఎస్ మూర్తిపై పోలీసులు నమోదు చేసిన కేసులో హైకోర్టు తదుపరి చర్యలన్నింటిని నిలిపేసింది. న్యాయమూర్తి జస్టిస్ ఎన్.జయసూర్య మంగళవారం ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు. ఆరిలోవ పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ కేఎస్ మూర్తి మంగళవారం హైకోర్టులో అత్యవసరంగా వ్యాజ్యం దాఖలు చేశారు. ఆయన తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు.
రుషికొండలో అక్రమ తవ్వకాలు, నిర్మాణాలపై కోర్టు ధిక్కరణ కేసు విచారణ విషయంలో కోర్టు సూచన మేరకు(rushikonda works examine) క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లారన్నారు. వారిపై నేరపూర్వక ప్రవేశం (క్రిమినల్ ట్రెస్‌పాస్) కింద కేసు నమోదు చేయడం చెల్లదన్నారు. అక్రమాలను అడ్డుకునే వారిని వేధించడం కోసం పోలీసులు తప్పుడు కేసు పెడుతున్నారన్నారు. ఆ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి.. ఎఫ్‌ఐఆర్ ఆధారంగా చేపట్టే అన్ని చర్యలపైనా స్టే ఉత్తర్వులిచ్చారు. జులై 31న రుషికొండ పనుల పరిశీలనకు వెళ్లిన కేఎస్ మూర్తి సహా హైకోర్టులో పిల్, కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేసిన విశాఖ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్, మరికొందరిపైనా పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి:
