HIGH COURT: ఇతరులపై ఏం చర్యలు తీసుకున్నారు? .. సీబీఐని ప్రశ్నించిన హైకోర్టు

author img

By

Published : Jun 22, 2022, 9:36 AM IST

hc

HIGH COURT: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితులు (పిటిషనర్లు) ఆరోపణలు చేస్తున్న ఇతరుల విషయంలో ఏం చర్యలు తీసుకున్నారని సీబీఐని హైకోర్టు ప్రశ్నించింది. దర్యాప్తు కొనసాగుతోందన్న కారణంతో ఎంతకాలం పిటిషనర్లను జైల్లో ఉంచుతామని వ్యాఖ్యానించింది. ఇతరుల పాత్రపై ఆధారాలు సేకరిస్తున్నామని సీబీఐ తరఫు న్యాయవాది చెన్నకేశవులు బదులిచ్చారు.

HIGH COURT: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితులు (పిటిషనర్లు) ఆరోపణలు చేస్తున్న ఇతరుల విషయంలో ఏం చర్యలు తీసుకున్నారని సీబీఐని హైకోర్టు ప్రశ్నించింది. దర్యాప్తు కొనసాగుతోందన్న కారణంతో ఎంతకాలం పిటిషనర్లను జైల్లో ఉంచుతామని వ్యాఖ్యానించింది. ఇతరుల పాత్రపై ఆధారాలు సేకరిస్తున్నామని సీబీఐ తరఫు న్యాయవాది చెన్నకేశవులు బదులిచ్చారు. ఫోరెన్సిక్‌, సాంకేతిక నివేదికలు అందాల్సి ఉందని.. దర్యాప్తు పురోగతిని సీల్డ్‌కవర్‌లో కోర్టు ముందుంచుతామని తెలిపారు. బెయిల్‌ కోసం నిందితులు వేసిన వ్యాజ్యాలపై సీబీఐ వాదనలు ముగియడంతో వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత తరఫు వాదనలు వినేందుకు విచారణను హైకోర్టు ఈనెల 27కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డి.రమేశ్‌ మంగళవారం ఈ మేరకు ఆదేశాలిచ్చారు.

వివేకా హత్య కేసు నిందితులు వై.సునీల్‌యాదవ్‌ (ఏ2), గజ్జల ఉమాశంకర్‌రెడ్డి (ఏ3), దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి (ఏ5) హైకోర్టులో బెయిల్‌ పిటిషన్లు వేసిన విషయం తెలిసిందే. దర్యాప్తును దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ప్రభావితం చేస్తున్నారని మంగళవారం జరిగిన విచారణలో సీబీఐ తరఫు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. సాక్షులను, అధికారులను బెదిరిస్తున్నారని తెలిపారు. న్యాయస్థానంనుంచి తాత్కాలిక అనుమతితో బయటకొచ్చిన ప్రతిసారి రాజకీయ పెద్దల ఫొటోలతో ఫ్లెక్సీలు వేస్తూ సాక్షులను ప్రభావితం చేస్తున్నారని వివరించారు. దర్యాప్తు కొనసాగుతున్న ఈ దశలో బెయిలు మంజూరు చేయవద్దని విన్నవించారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. ఇప్పటికే అభియోగపత్రం దాఖలు చేసినందున పిటిషనర్‌ను ఇంకా జైల్లో ఉంచడం సరికాదని ఆయన తరఫు న్యాయవాది పేర్కొంటున్నారని గుర్తుచేశారు. అభియోగపత్రం దాఖలు చేశామన్న కారణంతో బెయిలు ఇవ్వాలనడం సరికాదని సీబీఐ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. దర్యాప్తులో స్థానిక పోలీసులు సహకరించడం లేదని అన్నారు. దర్యాప్తు అధికారిపై కేసు పెట్టి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని వివరించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.