ETV Bharat / city

RAINS IN TELANGANA: హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం

author img

By

Published : Jun 29, 2021, 6:45 PM IST

Heavy rain in many places in Hyderabad
హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం

ఉపరితల ఆవర్తన ప్రభావంతో.. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన వానతో వివిధ పనుల నిమిత్తం బయటికొచ్చిన ప్రజలు తడిసిముద్దయ్యారు. రహదారులపై నీరు నిలిచి వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు.

హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం

హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ట్యాంక్​బండ్, లిబర్టీ, హిమాయత్​నగర్, ముషీరాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కవాడిగూడ, గాంధీనగర్, భోలక్‌పూర్‌, ఆర్టీసీ క్రాస్​రోడ్స్​, చిక్కడపల్లి, రాంనగర్, విద్యానగర్‌లో ఓ మోస్తరు వాన పడింది.

వర్షం కారణంగా రహదారులపైకి నీరు చేరింది. వివిధ పనుల నిమిత్తం బయటికొచ్చిన వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారులు సిబ్బందిని అందుబాటులో ఉంచారు.

మరోవైపు నైరుతి, తూర్పు తెలంగాణ జిల్లాల్లో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఒకటి, రెండుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడుతుందని తెలిపింది. నేడు అక్కడక్కడ వర్షాలు పడతాయని తెలిపింది.

ఇదీ చదవండి:

DISHA APP: 'దిశ' యాప్ ఉంటే..అన్నయ్య తోడున్నట్లే: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.