ETV Bharat / city

హైదరాబాద్​ జంట నగరాల్లో భారీగా వర్షం

author img

By

Published : Jun 27, 2021, 5:00 PM IST

భారీ వర్షం
భారీ వర్షం

హైదరాబాద్​ జంట నగరాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా రహదారులపైకి నీరు చేరింది. పలు చోట్ల విద్యుత్​ సరఫరాకు అంతరాయం కలిగింది.

హైదరాబాద్​ జంట నగరాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వాన పడింది. ఎల్బీ నగర్, మన్సూరాబాద్, నాగోల్, వనస్థలిపురం, హయత్​నగర్, అబ్దుల్లాపూర్​మెట్, ​బోయిన్​పల్లి, మారేడ్​పల్లి, చిలకలగూడా, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట, తిరుమలగిరి, ఫ్యాట్నీ, బేగంపేట, కూకట్ పల్లిలో భారీ వర్షం కురిసింది.

పాతబస్తీ చార్మినార్, బహదూర్​పురా, చాంద్రాయణగుట్ట, యాకుత్​పురా తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. తార్నాక, లాలాపేట్, ఓయూ క్యాంపస్, హబ్సిగూడా, నాచారం మల్లాపూర్ ప్రాంతాల్లోనూ ఓ మాదిరి వాన కురిసింది. మేడ్చల్ జిల్లా పరిధిలో సుచిత్ర, కొంపల్లి, గాజుల రామారం, షాపూర్​నగర్​లోనూ జోరుగా వర్షం పడింది.

భారీ వర్షం కారణంగా రహదారులపైకి నీరు చేరింది. పలుచోట్ల నాలాలు పొంగిపొర్లగా.. మరికొన్ని చోట్ల విద్యుత్​ సరఫరాకు అంతరాయం కలిగింది. వివిధ పనుల నిమిత్తం బయటికొచ్చిన వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు.

ఇదీ చూడండి: 'యువతను కించపరిచేలా మాట్లాడిన అధికారులపై చర్యలు తీసుకోండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.