ETV Bharat / city

భద్రాచలంలో గోదావరి వంతెనపై రాకపోకల నిలిపివేత.. వారధి చరిత్రలోనే రెండోసారి

author img

By

Published : Jul 14, 2022, 12:54 PM IST

Updated : Jul 14, 2022, 6:24 PM IST

భద్రాచలంలో గోదావరి వంతెన
భద్రాచలంలో గోదావరి వంతెన

12:48 July 14

భద్రాచలం పట్టణాన్ని చుట్టుముడుతున్న వరదనీరు

భద్రాచలంలో గోదావరి వంతెనపై రాకపోకల నిలిపివేత.. వారధి చరిత్రలోనే రెండోసారి

FLOODS AT BHADRACHALAM: భభద్రాచలంలో గోదావరి వంతెనపై రాకపోకలను నిలిపేశారు. రాకపోకలను నిలిపివేయడం వారధి చరిత్రలోనే ఇది రెండో సారి. దీంతో ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌కు రాకపోకలు నిలిచిపోయాయి. గతంలో 1986లో నీటిమట్టం 75.6 చేరుకోవడంతో ఈ మేరకు ఆంక్షలు విధించారు. తాజాగా 36 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి 48 గంటలపాటు వారధిపై రాకపోకలు బంద్‌ కానున్నాయి. సాయంత్రం 5 గంటలనాటికి ఇక్కడ వరద మట్టం.. 61.80 అడుగులుగా ఉంది. ఇదిలా ఉండగా.. ఎగువ నుంచి భారీగా వరద పోటెత్తడంతో ఇప్పటికే భద్రాచలం పట్టణం అతలాకుతలమైన విషయం తెలిసిందే.

ఇవీ చదవండి:

Last Updated :Jul 14, 2022, 6:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.