ETV Bharat / city

EMPLOYEES JAC LEADERS: ' అందరిదీ ఒకే మాట, ఒకే వాదన, ఒకే డిమాండ్'

author img

By

Published : Jan 20, 2022, 9:48 PM IST

Updated : Jan 21, 2022, 3:39 AM IST

EMPLOYEES JAC LEADERS: పీఆర్‌సీ అంశంలో ప్రభుత్వంపై ఉమ్మడి పోరాటానికి ఉద్యోగ సంఘాలు సిద్ధమయ్యాయి. పీఆర్సీ సాధన కోసం అన్ని జేఏసీలు ఏకతాటిపైకి రావాలని నిర్ణయించినట్లు ఉద్యోగ సంఘాల నాయకులు వెల్లడించారు.

employees jac leaders meeting in vijayawada
employees jac leaders meeting in vijayawada

EMPLOYEES JAC LEADERS: ఉద్యోగుల పీఆర్​సీ డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు ఉద్యోగ సంఘాలు ఏకమయ్యాయి. ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి సంఘాలు ఐక్యమై ఇప్పటి వరకు పోరాటం చేస్తుండగా.. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, సచివాలయ ఉద్యోగుల సంఘాలు జతకలిశాయి. విజయవాడలో ఓ హోటల్ లో సమావేశమైన ఉద్యోగ సంఘాల నేతలు ఐక్య కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. మెరుగైన పీఆర్సీ సాధన కోసం అన్ని సంఘాలు ఐక్యం కావాలని సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్ని సంఘాలు ఒకే జేఏసీ గా ఏర్పడి ఉమ్మడి పోరాటం చేయనున్నారు.

నాలుగు ఉద్యోగ సంఘాల చర్చలు అనంతరం .. ఎన్జీవో హోంలో ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ సంఘాల నేతలు , కార్యవర్గ సభ్యులు మరోసారి సమావేశమై చర్చించారు. ఉమ్మడి పోరాటంతో ప్రయోజనం ఉంటుందనే కలసి పోరాడాలని నిర్ణయించామన్న ఏపీ జేఏసీ ఛైర్మన్‌ బండి శ్రీనివాసరావు.. ఐక్య కార్యాచరణ కోసం తమ పోరాట కార్యాచరణను నేటికి వాయిదా వేసుకున్నట్లు తెలిపారు. పీఆర్సీపై ప్రభుత్వం రాత్రికి రాత్రి చీకటి జీవోలు ఇచ్చిందన్న బొప్పరాజు వెంకటేశ్వర్లు .. ఉద్యోగులకు న్యాయం జరిగే వరకు వెనుదిరిగేది లేదన్నారు.

ఉమ్మడిగా పోరాటం చేయడం ద్వారానే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాగలమని, తద్వారా ప్రభుత్వం దిగి వచ్చేలా చేయగలమని ప్రభుత్వ ఉద్యోగుల, సచివాలయ ఉద్యోగుల సంఘాల నేతలు అభిప్రాయపడ్డారు.సీఎస్ కు సమ్మె నోటీసు ఎప్పుడు ఇవ్వాలనే విషయంపై నేటి సమావేశంలో చర్చించి తుది నిర్ణయాన్ని ఉద్యోగ సంఘాల నాయకులు ప్రకటించనున్నారు.

ఇదీ చదవండి:

తెదేపా నేతతో బ్రదర్ అనిల్.. అరగంట పాటు చర్చలు!

Last Updated : Jan 21, 2022, 3:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.