ETV Bharat / city

తెలంగాణ: హుజూరాబాద్ ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థిగా వెంకట నర్సింగ్ రావు

author img

By

Published : Oct 2, 2021, 10:24 PM IST

తెలంగాణలోని హుజూరాబాద్ ఉపఎన్నికకు కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థిని అధిష్ఠానం ప్రకటించింది. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బల్మూరి వెంకటనర్సింగ్​ రావును హుజూరాబాద్ అభ్యర్థిగా ఖరారు చేసింది.

హుజూరాబాద్ ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థిగా వెంకటనర్సింగ్ రావు
హుజూరాబాద్ ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థిగా వెంకటనర్సింగ్ రావు

తెలంగాణలోని హుజూరాబాద్ ఉపఎన్నికకు కాంగ్రెస్​ పార్టీ ఎట్టకేలకు అభ్యర్థి(huzurabad congress candidate)ని ఖరారు చేసింది. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బల్మూరి వెంకటనర్సింగ్​ రావును హుజూరాబాద్​ అభ్యర్థి(huzurabad congress candidate)గా అధిష్ఠానం ప్రకటించింది.

యువ‌జ‌న కాంగ్రెస్ రాష్ట్ర కార్యద‌ర్శి తిప్పర‌పు సంప‌త్‌, కిసాన్ కాంగ్రెస్ క‌రీంన‌గ‌ర్ జిల్లా అధ్యక్షుడు ప‌త్తి కృష్ణారెడ్డి, ఎన్​ఎస్​యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బ‌ల‌మూరి వెంక‌ట్​.. పేర్లను పార్టీ నాయకత్వం పరిశీలించింది. చివరగా.. ఉమ్మడి కరీంనగర్​ జిల్లాకు చెందిన బల్మూరి వెంకటనర్సింగ్​ రావును ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది.

మాజీ మంత్రి ఈటల రాజేందర్​ రాజీనామాతో హుజూరాబాద్​లో ఉపఎన్నిక అనివార్యమైంది. తెరాస తరఫున బరిలో నిలిచిన గెల్లు శ్రీనివాస యాదవ్​.. ఇవాళ తన నామినేషన్​ వేశారు. భాజపా తరఫున ఈటల అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే అధికార తెరాస, భాజపాలు హుజూబాద్​ ఉప ఎన్నికలో దూసుకుపోతుండగా.. హస్తం పార్టీ మాత్రం అభ్యర్థిని ఎట్టకేలకు నేడు ప్రకటించింది. హుజూరాబాద్​ ఉపఎన్నికల పోలింగ్​ అక్టోబర్ 30న జరగనుంది. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు చేపడతారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.