ETV Bharat / city

గంజాయికి అడ్డాగా మారుతున్న హైదరాబాద్.. చర్యలకు సిద్ధమవుతున్న టీసర్కారు

author img

By

Published : Oct 19, 2021, 9:34 AM IST

ఆంధ్ర-ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతంలో సాగవుతున్న గంజాయిని తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ కేంద్రంగా పలు రాష్ట్రాలకు ముఠాలు తరలిస్తున్నాయి (Growing ganja sales in Hyderabad). నెల రోజుల వ్యవధిలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 78 కేసుల్లో 121 మందిని అరెస్టు చేసిన పోలీసులు... 14 వందల కిలోలకు పైగా గంజాయి స్వాధీనం చేసుకోవటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దీంతో డ్రగ్స్‌ను పూర్తి స్థాయిలో రూపుమాపేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించేదుకు సిద్ధమైంది. ఈ విషయంపై ఈనెల 20న టీసీఎం కేసీఆర్​ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు (cm kcr will be review on drugs control in the state).

kcr on ganja
గంజాయికి అడ్డాగా మారుతున్న హైదరాబాద్.. చర్యలకు సిద్ధమవుతున్న టీసర్కారు

తెలంగాణలో ఆ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లోనూ తరచూ గంజాయి పట్టివేత ఘటనలు చోటుచేసుకుంటున్నాయి (Growing ganja sales in Hyderabad). ఎక్సైజ్ శాఖ ఎన్ని చర్యలు చేపట్టినా... నిత్యం మాదకద్రవ్యాల సరఫరా, విక్రయం యథేచ్ఛగా సాగుతోంది. ఇటీవల తెలంగాణలో గంజాయి విక్రయం, సరఫరా పెరగడంతో వీటిని అరికట్టేందుకు అక్కడి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆంధ్ర - ఒడిశా సరిహద్దులోని దట్టమైన అటవీ ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా సాగు చేస్తున్న గంజాయి... హైదరాబాద్‌తో పాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు సరఫరా అవుతోంది. ఏజెన్సీ ప్రాంతం నుంచి భారీ వాహనాల్లో గంజాయిని సరఫరా చేస్తున్న ముఠాలు... హైదరాబాద్ మీదుగా పుణె, నాందేడ్, ముంబయి, అహ్మద్‌నగర్, బెంగళూరు, రాయిచూర్, బీదర్‌కు తరలిస్తున్నారు. తాజాగా నర్సీపట్నం నుంచి మహారాష్ట్రలోని అహ్మద్ నగర్‌కు డీసీఎంలో తరలిస్తున్న 300 కిలోల గంజాయిని హైదరాబాద్ ఉత్తర మండల టాస్క్​ఫోర్స్ పోలీసులు ముసారాంబాగ్‌లో పట్టుకున్నారు.

పదుల సంఖ్యలో కేసులు.. వందల కేజీల స్వాధీనం

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ధూల్‌పేట్‌, మంగళ్‌హాట్‌, గోల్కొండ, మణికొండ, లంగర్‌హౌజ్‌, సింగరేణి కాలనీ, తార్నాక, లాలాగూడ, సికింద్రాబాద్‌, అంబర్‌పేట్‌, నాంపల్లిలోని పలు కాలనీల్లో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి. ఇటీవల తెలంగాణ పోలీసులు ప్రత్యేక సోదాలు నిర్వహించి పలువురిని అరెస్ట్ చేసి కిలోల కొద్దీ గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కేవలం నెల వ్యవధిలోనే 78 గంజాయి కేసుల్లో 121మందిని అరెస్ట్ చేశారు. 14 వందల కిలోలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 23మంది గంజాయి విక్రేతలపై పీడీ చట్టం ప్రయోగించారు. కేసు విచారణలో భాగంగా వెళ్లిన నల్గొండ పోలీసులపై ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి స్మగ్లర్ల దాడి ప్రాధాన్యత సంతరించుకుంది.

జైలుకెళ్లొచ్చాక కూడా అదేపని..

గోవా కేంద్రంగా హైదరాబాద్‌లోకి వస్తున్న మాదక ద్రవ్యాలను విక్రయిస్తూ పలువురు అడపాదడపా పట్టుబడుతున్నారు. విమానాశ్రయాల వద్ద డీఆర్​ఐ అధికారులు సైతం ప్రయాణికుల నుంచి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకుంటున్నారు. ఎడ్యుకేషన్‌ వీసాపై ఇక్కడి వస్తున్న నైజీరియన్లు... వారికి ఉన్న సంబంధాలతో మాదక ద్రవ్యాలు ఇక్కడికి తెప్పించుకుని విక్రయిస్తున్నారు (Nigerian Drug gang in Hyderabad). వీరిపై కేసు నమోదు చేసి జైలుకు తరలించినా విడుదలై తిరిగి మళ్లీ అదే దందా కొనసాగిస్తున్నారు.

అధికారులతో సమీక్షించనున్న టీసీఎం కేసీఆర్​

దేశ వ్యాప్తంగా మాదకద్రవ్యాల కేసులు పెరుగుతన్న క్రమంలో సరిహద్దుల్లో టన్నుల కొద్దీ మత్తు పదార్థాలు పట్టుబడుతున్నాయి. దీంతో ప్రత్యేక దృష్టి సారించిన తెలంగాణ ప్రభుత్వం బుధవారం ప్రగతిభవన్‌లో ఆ రాష్ట్ర పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులతో టీసీఎం కేసీఆర్​ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు (cm kcr will be review on drugs control in the state). తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ (Mahmood ali), ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (minister Srinivas goud), డీజీపీ మహేందర్ రెడ్డి (dgp mahender reddy), సీఎస్​ సోమేశ్ కుమార్ (cs somesh kumar), హోంశాఖ, ఎక్సైజ్ శాఖల ప్రధాన కార్యదర్శులు, ఆ రాష్ట్ర మాదకద్రవ్యాల ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అధికారులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో గంజాయి, డ్రగ్స్ సరఫరా, విక్రయం వ్యవహారంపై కట్టుదిట్టమైన కార్యాచరణ రూపొందించే అవకాశం ఉంది.

ఇదీ చూడండి: జగనన్న తోడు కార్యక్రమం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.