ETV Bharat / city

జగనన్న తోడు కార్యక్రమం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే!

author img

By

Published : Oct 19, 2021, 7:06 AM IST

ఇవాళ జరగాల్సిన జగనన్న తోడు కార్యక్రమం వాయిదా పడింది. మహ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ముస్లింలు నిర్వహించుకునే మిలాద్ ఉన్ నబి పర్విదినం కారణంగా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో జగనన్న తోడు కార్యక్రమాన్ని వాయిదా వేశారు.

Jagananna thodu program postponed
Jagananna thodu program postponed

జగనన్న తోడు కార్యక్రమం ఈ నెల 20 తేదికి వాయిదా వేసినట్టు గ్రామ, వార్డు సచివాలయ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ స్పష్టం చేశారు. ఇవాళ సీఎం జగన్ సమక్షంలో నిర్వహించాల్సిన జగనన్న తోడు కార్యక్రమం బుధవారానికి వాయిదా వేసినట్టు తెలిపారు. మహ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ముస్లింలు నిర్వహించుకునే మిలాద్ ఉన్ నబి పర్వదినం కారణంగా రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించటంతో జగనన్న తోడు కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు చెప్పారు. ఈ నెల 20 తేదీ ఉదయం 11 గంటలకు జగనన్న తోడు లబ్ధిదారుల వడ్డీ సొమ్మును తిరిగి బ్యాంకుల్లో వారి ఖాతాలలో జమ చేసే కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: private universities: ప్రైవేటు వర్సిటీల్లో కన్వీనర్‌ కోటా సీట్లు 2000

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.