ETV Bharat / city

రామగుండం ఎన్టీపీసీ రణరంగం, సీఐఎస్​ఎఫ్ వర్సస్ ఒప్పంద కార్మికులు

author img

By

Published : Aug 22, 2022, 5:50 PM IST

ntpc
ntpc

NTPC Contract Laborers protest రామగుండం ఎన్టీపీసీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఒప్పంద ప్రక్రియ ముగుస్తున్న తరుణంలో పాతడిమాండ్లపై యాజమాన్యంతో చర్చించేందుకు ఒప్పంద కార్మికులు యత్నించారు. అక్కడకి వెళ్తున్న వారిని సీఐఎస్​ఎఫ్​ సిబ్బంది అడ్డుకోవడంతో పెద్దఎత్తున ఘర్షణ చోటుచేసుకుంది.

NTPC Contract Laborers protest : తెలంగాణ పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ఆగస్టుతో ఒప్పంద ప్రక్రియ ముగుస్తున్న తరుణంలో పాతడిమాండ్లపై యాజమాన్యంతో చర్చించేందుకు ఒప్పంద కార్మికులు యత్నించారు. అక్కడకి వెళ్తున్న వారిని సీఐఎస్​ఎఫ్​ సిబ్బంది అడ్డుకోగా ఒప్పంద కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సీఐఎస్‌ఎఫ్‌, ఒప్పంద కార్మికుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వారిని చెదరగొట్టేందుకు భద్రతాసిబ్బంది లాఠీఛార్జ్‌ చేశారు.

ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న స్థానిక పోలీసులు.. ఒప్పంద కార్మికులను అదుపుచేసే ప్రయత్నం చేశారు. ఎన్టీపీసీ వద్ద భారీగా పోలీసులను మోహరించారు.

ntpc

"నాలుగు సంవత్సరాల నుంచి అగ్రిమెంట్​లో ఉన్న డిమాండ్ల పరిష్కారం కోసం మేం ధర్నా నిర్వహిస్తున్నాం. ఇంతలోనే సీఐఎస్​ఎఫ్ పోలీసులు వచ్చి మాపై దాడి చేశారు. యాజమాన్యం చర్చించాల్సిన పద్ధతి ఇదేనా. వెంటనే మాపై దాడి చేసిన అధికారిని సస్పెండ్ చేయాలి. న్యాయమైన మా డిమాండ్లను పరిష్కరించాలి. యాజమాన్యం మాతో చర్చలు జరపాలి. " - కార్మిక సంఘాల జేఎసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.