ETV Bharat / state

పోలీస్ స్టేషన్ ఎదురుగా పార్క్ చేసిన బైక్ చోరీ చేసిన దొంగ

author img

By

Published : Aug 22, 2022, 5:04 PM IST

Bike Theft ఈ దొంగ మామూలోడు కాదు. ఎవరి వస్తువు అయితే నాకేంటి నాపనేదో నేను చేసేస్తే పోలా అనుకున్నాడు. అంతే కానిస్టేబుల్ బైక్ నే చోరీ చేశాడు. ఇంతకి ఇది ఎక్కడ జరిగిందంటే.

Etv Bharat
Etv Bharat

Bike Theft:విజయవాడలోని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ఎదురుగా పార్క్ చేసి ఉంచిన బైకును గుర్తు తెలియని వ్యక్తి దొంగిలించాడు. తాళం బైక్​కు ఉండడాన్ని గమనించిన వ్యక్తి చాకచక్యంగా బైక్​ను ఎత్తుకెళ్లి పోయాడు. పోలీస్ స్టేషన్ దగ్గరలోని ఓ సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి.

విజయవాడ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ఎదురుగా ఓ కానిస్టేబుల్ బండిని పార్క్ చేశాడు. పోలీస్ స్టేషన్ ఎదురుగానే కదా! ఎవరు తీసుకుపోతారు అనుకున్నాడో లేక మర్చిపోయాడో తాళం కూడా దానికే వదిలేశాడు. ఈ విషయాన్ని గమనించిన దొంగ చక్కగా తన చేతివాటం ప్రదర్శించాడు. చుట్టూ చూసి తర్వాత దర్జాగా బైక్ తీసుకుని అక్కడ నుంచి వెళ్లిపోయాడు. పోలీస్​ స్టేషన్​ ఎదురుగా నిలిపి ఉంచిన బైక్​ చోరీకి గురికావడంతో పోలీసులు అవాక్కయ్యారు. వెంటనే అక్కడున్న సీసీ కెమెరాలను పరిశీలించారు. అందులో నమోదైన దృశ్యాల ఆధారంగా ఆ దొంగను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

పోలీస్ స్టేషన్ ఎదురుగా పార్క్ చేసిన బైక్ చోరి చేసిన దొంగ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.