ETV Bharat / city

భవిష్యత్‌లో నా మద్దతు తమ్ముడు పవన్‌కు ఉంటుంది: చిరంజీవి

author img

By

Published : Oct 4, 2022, 2:14 PM IST

Updated : Oct 4, 2022, 5:47 PM IST

chiranjeevi
chiranjeevi

14:11 October 04

అంకితభావం కలిగిన నాయకుడు ఆంధ్రప్రదేశ్‌కు అవసరం: చిరంజీవి

అంకితభావం కలిగిన నాయకుడు ఆంధ్రప్రదేశ్‌కు అవసరం

CHIRU COMMENTS ON POLITICS : గాడ్‌ఫాదర్ ప్రీరిలీజ్‌ సమావేశంలో చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్‌కల్యాణ్‌ అంకితభావం కలిగిన నాయకుడని, అలాంటి నాయకుడు రాష్ట్రానికి అవసరమని ఆయన అన్నారు. భవిష్యత్తులో తన మద్దతు తప్పనిసరిగా పవన్​కు ఉంటుందని చిరంజీవి స్పష్టం చేశారు. సినిమాలో ప్రస్తుత రాజకీయ నేతలపై ఎలాంటి సెటైర్లు వేసే విధంగా చేయలేదని ఆయన అన్నారు. మాతృకలో ఉన్న కథ ఆధారంగానే డైలాగులు రాశారని.. అవి విని ఎవరైనా భుజాలు తడుముకుంటే నేనేం చేయలేనని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్​ను పరిపాలించే అవకాశాన్ని తన సోదరుడు పవన్ కల్యాణ్​కు ప్రజలు ఇస్తారన్న విశ్వాసం ఉంది. భవిష్యత్​లో తన మద్దతు పవన్​కల్యాణ్​కు ఉంటుంది. కల్యాణ్ నిబద్దత కలిగిన వ్యక్తి, అలాంటి నాయకుడు రావాలి. పవన్ కల్యాణ్​ను మంచి నాయకుడిగా చూడటం కోసమే.. నేను రాజకీయాల్లో తటస్థంగా ఉన్నాను. -చిరంజీవి

మోహన్ రాజా దర్శకత్వంలో సూపర్ గుడ్ ఫిల్మ్స్ పతాకంపై నిర్మించిన గాడ్​ ఫాదర్​ చిత్రంలో సత్యదేవ్, నయనతార, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 4, 2022, 5:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.