ETV Bharat / city

RAIN ALERT: హైదరాబాద్‌లో ఇవాళ భారీ వర్షాలు.. ఎవరూ బయటికి రావొద్దు: జీహెచ్​ఎంసీ

author img

By

Published : Oct 9, 2021, 11:56 AM IST

Updated : Oct 9, 2021, 1:02 PM IST

RAINS IN HYDERABAD
హైదరాబాద్‌లో ఇవాళ భారీ వర్షాలు

11:53 October 09

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జీహెచ్‌ఎంసీ

హైదరాబాద్​లో భారీ వర్షాలు(HYDERABAD RAIN ALERT) కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించినట్లు జీహెచ్​ఎంసీ ప్రకటించింది. శనివారం మధ్యాహ్నం నుంచి భారీ వానలు(HYDERABAD RAIN ALERT) పడే అవకాశముందని వెల్లడించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. కార్యాలయాలకు వెళ్లిన వారు తిరిగి ఇంటికి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించింది. 

ఇంట్లో ఉన్న వాళ్లు అత్యవసరమైతేనే బయటకు రావాలని జీహెచ్​ఎంసీ చెప్పింది. సహాయం కోసం కంట్రోల్​ రూంను సంప్రదించాలన్న జీహెచ్​ఎంసీ కంట్రోల్ రూం నంబరు 040 2111 1111కు కాల్ చేయాలని పేర్కొంది.

చెరువుల్లా రహదారులు..

శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి(Heavy Rain in Hyderabad Yesterday) భాగ్యనగరం అతలాకుతలం అయింది. నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలు ప్రాంతాల్లో రహదారులపైకి నీరు చేరి చెరువులను తలపించాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగి.. రాత్రంతా అంధకారంలోనే గడిపాల్సిన పరిస్థితి ఏర్పడింది.

చంపాపేట, చందానగర్, చాంద్రాయణగుట్ట, జిల్లెలగూడ, దిల్​సుఖ్​నగర్, కోఠి, సరూర్​నగర్​, హయత్​నగర్​ పరిధిలోని చాలా వరకు కాలనీలు నీట మునిగాయి. ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రాకుండా వరద(Heavy Rain in Hyderabad Yesterday) చుట్టుముట్టింది. శనివారం కూడా వరద ప్రభావం ఉండటం వల్ల చాలాచోట్ల జనజీవనం స్తంభించింది. జిల్లెలగూడ బాలాజీనగర్​ కాలనీలో ఇళ్లలోకి మురికి నీరు చేరింది. ఆ ప్రాంతంలో డ్రైనేజీ పనులు జరుగుతుండటం వల్ల భారీ వర్షానికి మురికికాల్వలు పొంగిపొర్లి రహదారులపైకి, ఇళ్లలోకి చేరాయి. ఇప్పటికీ ఆ ప్రాంత ప్రజలు తమ ఇళ్లు శుభ్రం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

ప్రజలను వణికిస్తున్న వర్షాలు..

శుక్రవారం వరణుడు సృష్టించిన బీభత్సం(Heavy Rain in Hyderabad Yesterday) ప్రభావంలోనే ఉన్న భాగ్యనగర ప్రజలు.. శనివారం కూడా వర్షాలు పడతాయన్న జీహెచ్​ఎంసీ ప్రకటనతో భయాందోళనకు గురవుతున్నారు. ఇళ్లలోంచి బయటకు వెళ్తే ఎక్కడ వరద(Heavy Rain in Hyderabad Yesterday)లో చిక్కుకుంటామో.. తిరిగి ఇంటికి చేరుకుంటామో లేదోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రం బయటకు వచ్చి.. వీలైనంత త్వరగా ఇళ్లకు చేరుకునేలా ప్రణాళిక చేసుకుంటున్నారు.

ఇదీ చదవండి :  

AP RAINS: సీమ జిల్లాల్లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాల జలమయం

Last Updated :Oct 9, 2021, 1:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.