ETV Bharat / city

KISHAN REDDY: 'జనవరి నుంచి పర్యాటక రంగాన్ని పునః ప్రారంభిస్తాం'

author img

By

Published : Aug 21, 2021, 11:55 AM IST

తన సేవలను గుర్తించి ప్రధాని మోదీ కేబినెట్​ మంత్రిగా పదోన్నతి కల్పించారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. దేశంలో పర్యాటక శాఖను బలోపేతం చేస్తామని వెల్లడించారు. తెలంగాణలోని వేడుకలను, జాతరలను చిత్రీకరించి దేశవ్యాప్తంగా గుర్తించేలా చేస్తామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

KISHAN REDDY
KISHAN REDDY

దేశంలో పర్యాటక శాఖను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. జనవరి నుంచి పర్యాటక రంగాన్ని పునఃప్రారంభించాలని అనుకుంటున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో కిషన్‌ రెడ్డి చేపట్టిన జన ఆశీర్వాద యాత్ర మూడోరోజు సాగుతోంది. తెల్లవారుజామునే యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్న కిషన్ రెడ్డి.. ఆలయ పునర్నిర్మాణాన్ని పరిశీలించారు. తెలుగు ప్రజల ఆశీస్సులతోనే కేంద్రమంత్రిని అయ్యానని తెలిపారు.

మాట్లాడుతున్న కిషన్ రెడ్డి

"గతంలో పార్టీ అధ్యక్షుడిగా 3సార్లు పని చేశాను. అంబర్‌పేట ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా 3సార్లు గెలిచాను. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా రెండేళ్లు చేశాను. అది నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది. నా పని తీరును గుర్తించి కేబినెట్ మంత్రిగా మోదీ పదోన్నతి కల్పించారు. ప్రధాని మోదీ నాపై నమ్మకం ఉంచి ప్రభుత్వంలో కీలకమైన సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి బాధ్యతలను అప్పగించారు. 370 ఆర్టికల్ రద్దులో భాగస్వామిని అయ్యాను.

దేశంలో పర్యాటక శాఖను బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జనవరి నుంచి పర్యాటక రంగాన్ని పునః ప్రారంభించాలని అనుకుంటున్నాం. ఆధ్యాత్మిక కేంద్రాలు, జలపాతాలు, అతి పురాతన కట్టడాలు దేశంలో ఉన్నాయి. వాటిని పరిరక్షించేందకు చర్యలు చేపడుతున్నాము. బతుకమ్మ, బోనాలు, వినాయక చవితి, మేడారం జాతరలను చిత్రీకరించి దేశవ్యాప్తంగా చూపించబోతున్నాము. తెలంగాణతో పాటు ప్రతి రాష్ట్రంలోని పండుగలను గుర్తిస్తాం.'' -కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

యునెస్కో గుర్తించిన 40 కేంద్రాలు దేశంలో ఉన్నాయని... వాటిల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని యాదాద్రి, భద్రాచలం, వేములవాడ ఆలయాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. గత పాలకులు ఈ ఆలయాల అభివృద్ధిని పట్టించుకోలేదని కిషన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి: AP RAINS: రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు.. రహదారులు జలమయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.