ETV Bharat / city

'నీతి, నిజాయితీలకు నిలువెత్తు రూపం ఈటల రాజేందర్​'

author img

By

Published : Aug 20, 2021, 9:21 PM IST

కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి
కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి

నీతి,నిజాయితీలకు ఈటల రాజేందర్​ ప్రతిరూపమని కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి అన్నారు. జన ఆశీర్వాద యాత్రలో భాగంగా తెలంగాణ.. హనుమకొండ జిల్లా కమలాపూర్​లో యాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో ఈటల రాజేందర్​ పాల్గొన్నారు.

జన ఆశీర్వాద యాత్రలో కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి

కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి చేపట్టిన జన ఆశీర్వాద యాత్ర తెలంగాణలోని హనుమకొండ జిల్లా కమలాపూర్​కు చేరింది. ఈ యాత్రలో కిషన్​ రెడ్డితో పాటు ఈటల రాజేందర్ పాల్గొన్నారు. హుజూరాబాద్​ ఎన్నికలు యావత్​ తెలంగాణ ప్రజల భవిష్యత్​ను నిర్ణయించే ఎన్నిలని కిషన్​ రెడ్డి అన్నారు. నీతికి, నిజాయితీకి ఈటల ​ ప్రతిరూపమని చెప్పారు. ప్రజలకు తప్ప ఎవరికి తల వంచని వ్యక్తి ఈటలని.. హుజూరాబాద్​ ప్రజలు కూడా ఎవరికి తల వంచరని అన్నారు. ఉప ఎన్నికలో ఈటల రాజేందర్​ను​ భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలకు కేంద్రం డబ్బులు ఇస్తోందని కిషన్​ రెడ్డి చెప్పారు. కేసీఆర్​ ఎన్ని పైసాలు ఇచ్చారో.. మోదీ ఎన్ని పైసాలిచ్చారో సర్పంచులను అడగాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకంతో అనేక మందికి ఉపాధి కల్పించామన్నారు. రైతులకు సంవత్సరానికి రూ.6 వేలు ఇస్తున్న ఘనత కేంద్ర ప్రభుత్వానికే దక్కుతుందని పేర్కొన్నారు. రైతుల కోసం లక్ష కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు తీసుకొచ్చామని కిషన్​ రెడ్డి తెలిపారు. బీసీ కమిషన్​కు చట్టబద్ధత కల్పించామని చెప్పారు. కేంద్రమంత్రివర్గంలో బీసీలకు మోదీ ప్రాధాన్యత కల్పించారన్నారు. తెలంగాణలో కుటుంబ పాలన కొనసాగుతోందని విమర్శించారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు 12 వందల మంది తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేశారని చెప్పారు. కల్వకుంట్ల కుటుంబం కోసం బలిదానం చేయలేదన్నారు. తెరాసలో ఉంటే ఆత్మగౌరవం లేకుండా ఉండాలి, బానిసలుగా ఉండాలి.

ఈ ఎన్నికల హుజూరాబాద్​కు చెందిన ఎన్నికలు కావు. తెలంగాణలో ఉన్న మూడున్నర కోట్ల ప్రజల భవిష్యత్​ను నిర్ణయించే ఎన్నికలు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. దానికి మొదటి అడుగు హుజూరాబాద్​లోనే పడాలి. ఈ ఎన్నికల్లో ఈటల రాజేందర్​ను భారీ మెజారిటీతో గెలిపించాలి. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్​ మధ్యలో ఉన్న దుబ్బాకలో భాజపా గెలిచింది. కేసీఆర్​ వద్ద భారీగా డబ్బు ఉంది. ఆ డబ్బుతో ఓట్లు కొనాలని చూస్తున్నారు.

-కిషన్​ రెడ్డి, కేంద్ర మంత్రి

ఇదీ చదవండి: KishanReddy: తొలిరోజు విజయవంతంగా కిషన్​రెడ్డి యాత్ర.. రెట్టింపు ఉత్సాహంతో రెండో రోజు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.