ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు@ 1PM

author img

By

Published : Jul 17, 2022, 1:03 PM IST

.

topnews@1pm
topnews@1pm

  • వరదలతో యానాం ప్రజల అవస్థలు.. సాయం కోసం డాబాలపై ఎదురుచూపులు..
    మహోగ్ర గోదావరి.. మూడు దశాబ్ధాల తర్వాత లంక గ్రామాల ప్రజల్ని బిక్కుబిక్కుమనేలా చేస్తోంది. ప్రతిఏడాది వరదలానే భావించి అక్కడే ఉండిపోయిన యానాం ప్రజలు.. ప్రస్తుత గోదావరి ఉద్ధృతికి తేరుకుని బయటికి రాలేక సర్వం కోల్పోయారు. పలు కాలనీల్లో నడుములోతు నీరు చేరింది. గూడుచెదిరిన వారంతా గుడారాల్లోనూ.. కింది అంతస్తు మునిగిన వారంతా.. డాబాల మీదకు చేరి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • TDP: రేపల్లెకు తెదేపా నిజనిర్ధారణ కమిటీ.. అడ్డుకున్న పోలీసులు..
    TDP HOUSE ARREST: కల్తీ మద్యం తాగి మృతి చెందిన ఇద్దరు వ్యక్తులను పరామర్శించేందుకు వెళ్తున్న తెదేపా నేతలను.. పోలీసులు మందుస్తుగా గృహనిర్బంధం చేశారు. బాపట్ల జిల్లా రేపల్లె మండలంలో పోటు మెరక గ్రామాని వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుపడ్డారు. అర్ధరాత్రి నుంచే పలువురి తెదేపా నేతల ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • AP Floods: దారి తెలియని నిస్సాహయ స్థితిలో గోదారి వరద బాధితులు.
    వర్షాలు తగ్గినా ఉగ్ర గోదావరి ఉరకలేస్తూ గోదావరి జిల్లాల్లో ఊళ్లు, లంకలను ఏకం చేస్తూనే ఉంది. వరద నీరు ఇళ్లను ముంచెత్తడంతో బాధితులు మూటాముల్లె సర్దుకుని సురక్షిత ప్రాంతాలకు వెళ్లి తలదాచుకుంటున్నారు. పోలవరం ముంపు, విలీన గ్రామాల ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. మరోవైపు గోదావరి వరద రైతులకు కడగండ్లు మిగిల్చింది.చేతికొచ్చిన పంట మొత్తం నీటిపాలైపోయింది. లక్షలాది రూపాయల పెట్టుబడి, రైతు కష్టం మొత్తం వరద నీటిలో కొట్టుకుపోయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • Ramayam port: ఈ నెల 20న నెల్లూరు జిల్లాలో రామాయపట్నం ఓడరేవుకు సీఎం జగన్‌ శంకుస్థాపన..
    (Ramayampatnam port) ఈ నెల 20న నెల్లూరు జిల్లా రామాయపట్నం ఓడరేవుకు సీఎం జగన్‌ శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబందించి స్థానిక ఎమ్మెల్యే, అధికార్లు కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం ఎక్కడంటే?..
    కర్ణాటక శివమొగ్గలో ఓ అరుదైన పాము కనిపించింది. పూర్తిగా తెలుపు రంగులో ఉన్న కోబ్రా తీర్థహల్లిలోని గార్డెన్​లో కనిపించింది. సాధారణంగా కోబ్రాలు గోధుమ, నలుపు రంగుల్లో ఉంటాయి. ఈ అరుదైన శ్వేతనాగును అల్బినో కోబ్రాగా పిలుస్తారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • విభజన గాయాలు గుర్తు చేసుకున్న రీనా వర్మ.. 75 ఏళ్ల తర్వాత పాకిస్థాన్​కు..
    1947 దేశవిభజన సమయంలో పాకిస్థాన్​ నుంచి ఇండియా వచ్చేసిన ఓ బామ్మ కోరిక నెరవేరనుంది. పుణెలో నివసిస్తున్న రీనా వర్మ సుమారు 75 ఏళ్ల తర్వాత పాకిస్థాన్​కు బయలుదేరారు. ఈ సందర్భంగా దేశ విభజన గాయాలు గుర్తుచేసుకున్నారు భారతీయ వనిత.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • త్వరలోనే 'ఎన్​బీకే 107' టైటిల్​ అనౌన్స్​మెంట్​.. కర్నూల్​లో బాలయ్య రోర్​!..
    ఎన్​బీకే 107పై అభిమానులకు ఆసక్తి కలిగించే ఓ అప్డేట్​ వచ్చింది. టీచర్​ విడుదలైనా ఇంకా వర్కింట్​ టైటిల్​తోనే షూటింగ్​ కొనసాగిస్తున్న చిత్రబృందం త్వరలోనే టైటిల్​ను ప్రకటించనున్నట్లు సమాచారం. అంతేకాదు కొత్త షెడ్యూల్​లో భాగంగా మూవీటీమ్​ కర్నూల్​లో షూటింగ్​ను నిర్వహించనుంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • సింగపూర్​ ఓపెన్​ విజేతగా సింధు.. తేలిపోయిన చైనా షట్లర్..
    భారత స్టార్​ షట్లర్​ పీవీ సింధు సింగపూర్​ ఓపెన్​ టైటిల్​ గెల్చుకుంది. 21-9, 11-21, 21-15 తేడాతో చైనాకు చెందిన వాగ్​ యీని ఓడించింది. దీంతో ఈ సీజన్​లో తొలి సూపర్​ 500 టైటిల్​ను దక్కించుకుంది డబుల్​ ఒలింపిక్ మెడలిస్ట్​ అయిన సింధు. ఆసియా ఛాంపియన్​షిప్స్​ గోల్డ్​ మెడలిస్ట్​, 22 ఏళ్ల వాంగ్​.. సింధు ముందు తేలిపోయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • ఏపీ, తెలంగాణలో బంగారం ధర ఎంతంటే?..
    Gold Price Today: బంగారం, వెండి ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఇలా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • రోజులో మనిషి పీల్చుకునే ఆక్సిజన్ ఎంతో తెలుసా?..
    మీరు రోజూ ఎంత గాలి పీల్చుకుంటున్నారో, రోజుకు ఎన్నిసార్లు శ్వాస తీసుకుంటున్నారో ఎప్పుడైనా లెక్కించారా? ఆరోగ్యవంతులైన వారు నిమిషానికి 16 సార్లు శ్వాస తీసుకుంటారని అధ్యయనాలు చెబుతున్నాయి. కరోనా ప్రభావం శ్వాస సంబంధిత రోగులపై అధికంగా ఉన్న వేళ మీ ఊపిరితిత్తులు బాగా పనిచేస్తున్నాయో లేదో తెలుసుకోవడం ముఖ్యం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.