ETV Bharat / city

TDP: పోటుమెరకకు తెదేపా నిజనిర్ధరణ కమిటీ.. అడ్డుకున్న పోలీసులు

author img

By

Published : Jul 17, 2022, 12:31 PM IST

Updated : Jul 17, 2022, 8:55 PM IST

TDP HOUSE ARREST: బాపట్ల జిల్లా రేపల్లె మండలం పోటుమెరకలో మద్యం తాగి మరణించిన కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న తెలుగుదేశం నిజనిర్ధరణ కమిటీని.. పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటూ పోలీసులు.. అనుమతి ఇవ్వలేదు. ఈ చర్యతో ప్రభుత్వం తమకు తామే దోషులమని ఒప్పుకుందని నిజనిర్ధారణ కమిటీ విమర్శించింది.

TDP HOUSE ARREST
TDP HOUSE ARREST

రేపల్లెకు తెదేపా నిజనిర్ధరణ కమిటీ

TDP HOUSE ARREST: బాపట్ల జిల్లా రేపల్లె మండలం పోటుమెరకలో మద్యం తాగి మరణించిన కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న తెలుగుదేశం నిజనిర్ధారణ కమిటీని.. పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. చనిపోయిన ఇద్దరు కల్తీ మద్యం తాగే మృతి చెందారని ఆరోపిస్తున్న తెలుగుదేశం.. గ్రామంలో పర్యటించి వాస్తవాలను నిగ్గుతేల్చేందుకు ప్రయత్నించింది. శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటూ పోలీసులు.. అనుమతి ఇవ్వలేదు. ఈ చర్యతో ప్రభుత్వం తమకు తామే దోషులమని ఒప్పుకుందని నిజనిర్ధారణ కమిటీ విమర్శించింది.
బాపట్ల జిల్లా రేపల్లె మండలం పోటుమెరకలో మద్యం తాగి ఇద్దరు వ్యక్తులు చనిపోగా.. అవి ప్రభుత్వ హత్యలేనంటూ ఆరోపిస్తున్న తెలుగుదేశం.. వాస్తవాలు తెలుసుకునేందుకు నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది.

అనగాని సత్యప్రసాద్‌, బుద్దా వెంకన్న, అశోక్‌బాబు, పట్టాభి నేతృత్వంలోని బృందం..బాధిత కుటుంబాలను పరామర్శించి నిజాలు తెలుసుకునేందుకు పోటుమెరకకు వెళ్లాలని నిర్ణయించింది. తెలుగుదేశం నేతల పర్యటనకు అనుమతి లేదని.. శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందంటూ పోలీసులు.. కమిటీ సభ్యులను గృహనిర్బంధం చేశారు. మరికొందరి ఇళ్ల వద్ద ఆంక్షలు విధించారు. గుంటూరులో మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు, నెల్లూరులో ఆనం వెంకటరమణారెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. రేపల్లెలోని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఇంటి వద్ద భారీగా బలగాలను మోహరించగా.. ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చి పోటుమెరకకు వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు, తెదేపా శ్రేణులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. ఆగ్రహించిన ఎమ్మెల్యే రోడ్డుపైనే ఆందోళనకు దిగారు.

రేపల్లె వెళ్లకుండా విజయవాడలో.. తెలుగుదేశం నేత బుద్దా వెంకన్నను పోలీసులు అడ్డుకున్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్ళడమే నేరమా అని ప్రశ్నించిన బుద్దా వెంకన్న.. సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. మరో నేత పట్టాభిని విజయవాడలోని ఆయన నివాసంలో పోలీసులు గృహనిర్బంధం చేశారు. ప్రభుత్వ దుకాణాల్లో లభించే విషపూరిత మద్యం తాగడం వల్లే.. మరణాలు చోటు చేసుకున్నాయని పునరుద్ఘాటించిన పట్టాభి.. ఆంక్షలతో అడ్డుకున్నంత మాత్రాన ప్రభుత్వం తప్పించుకోలేదని అన్నారు. పోలీసులతో అడ్డుకున్నా అక్రమ మద్యంపై తమ పోరాటం ఆగదని తెలుగుదేశం నేతలు స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Jul 17, 2022, 8:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.