ETV Bharat / city

AP TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 9PM

author img

By

Published : Jul 19, 2022, 9:00 PM IST

ఏపీ ప్రధాన వార్తలు
ఏపీ ప్రధాన వార్తలు

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

  • హైదరాబాద్‌ను ఏపీలో కలిపేయాలని అడగగలమా?: మంత్రి బొత్స
    పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముంపు ముప్పు, విలీన మండలాలను తెలంగాణలో కలపాలంటూ ఆ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. తెలంగాణ విడిపోవడం వల్ల హైదరాబాద్‌ ద్వారా ఏపీకి రావాల్సిన ఆదాయం తగ్గిపోయిందని.. గతంలా ఉమ్మడి రాష్ట్రంగానే ఉంచాలని తాము అడిగితే బావుంటుందా? అని ప్రశ్నించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత వల్లే పోలవరం నిర్మాణంలో జాప్యం: కేంద్రం
    రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతతోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమవుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికే పోలవరం నిర్మాణం పూర్తి కావాల్సి ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత వల్ల ఆలస్యమైనట్లు వెల్లడించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • బటన్ నొక్కితే బాధ్యత తీరిపోదు.. మానవత్వంతో స్పందించాలి: పవన్
    గోదావరి వరద పరిస్థితులపై వైకాపా ప్రభుత్వం ఏ మాత్రం అప్రమత్తంగా లేదని జనసేన అధినేత పవన్ మండిపడ్డారు. బాధితులు వేలల్లో ఉంటే నామమాత్రంగా పునరావాసకేంద్రాలు ఏర్పాటు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి వరద తీవ్రత తగ్గుముఖం పట్టినా.. ముంపు బాధితుల ఇక్కట్లు రోజురోజుకీ పెరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • తగ్గిన గోదావరి ఉద్ధృతి.. ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ
    వళేశ్వరం వద్ద గోదావరి ప్రవాహం మరిత తగ్గుముఖం పట్టింది. ఉదయం వరకు మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగించిన అధికారులు.. వరద తగ్గుముఖం పట్టడంతో ఉపసంహరించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • అగ్నిపథ్​కు 'కులం' చిచ్చు!.. 'ఆ లెక్కల ప్రకారం నియామకాలు'.. రాజ్​నాథ్​ స్ట్రాంగ్ కౌంటర్
    తీవ్ర వ్యతిరేకత మధ్య అమలులోకి వచ్చిన అగ్నిపథ్​పై మరోసారి రాజకీయ దుమారం చెలరేగింది. అగ్నివీరుల నియామకంలో కులానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు భాజపా నేత ఒకరు సహా ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. అయితే దీనిపై స్పందించిన రక్షణ మంత్రి రాజ్​నాథ్​ ఈ ఆరోపణలపై క్లారిటీ ఇచ్చారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • నుపుర్​ శర్మకు ఊరట.. చర్యలు తీసుకోవద్దని సుప్రీం ఆదేశం
    భాజపా మాజీ నేత నుపుర్ శర్మకు సుప్రీంకోర్టులో కాస్త ఊరట లభించింది. ఆమెపై ఆగస్టు 10వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అత్యున్నత ధర్మాసనం ఆదేశించింది. తనపై నమోదైన కేసులను ఒకే కోర్టుకు మార్చాలని నుపుర్ దాఖలు చేసిన పిటిషన్​పై.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు పంపింది సుప్రీం. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • రిషి సునాక్ దూకుడు​.. మూడో రౌండ్​లోనూ టాప్​.. పెరిగిన ఆధిక్యం
    బ్రిటన్‌ ప్రధాని రేసులో మాజీ ఆర్థిక మంత్రి, భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ మరోసారి ముందంజలో నిలిచారు. తాజాగా జరిగిన మూడో రౌండులో 115 ఓట్లతో నలుగురు అభ్యర్థుల్లో అగ్రస్థానంలో నిలిచారు. టామ్​ తుగెన్​ధాట్​ తక్కువ ఓట్లతో ఈ రౌండ్​లో నిష్క్రమించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • 'అలా అయితే పెరుగు, పప్పు, బియ్యంపై నో జీఎస్​టీ'.. నిర్మల​ క్లారిటీ
    సోమవారం అమలులోకి వచ్చిన కొత్త జీఎస్​టీ నిబంధనలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ మరింత స్పష్టత ఇచ్చారు. పెరుగు సహా 11 రకాల వస్తువుల జాబితాను పేర్కొంటూ.. అవి విడిగా అమ్మితే వాటిపై జీఎస్​టీ వర్తించదని తేల్చిచెప్పారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • 'పుష్ప 2'.. సేతుపతి వర్సెస్​ మనోజ్ బాజ్​పాయ్​.. అవకాశం దక్కెదెవరికో?
    ఐకాన్​స్టార్​ అల్లుఅర్జున్​ నటించనున్న కొత్త చిత్రం 'పుష్ప 2'లోని ఓ పాత్ర కోసం విజయ్​సేతుపతి, మనోజ్​బాజ్‌పాయ్‌ను దర్శకుడు సుకుమార్​ సంప్రదించినట్లు తెలిసింది. మరి ఈ రోల్​ ఎవరు చేస్తారో? పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • కోహ్లీ నాతో 20నిమిషాలు మాట్లాడితే.. తిరిగి ఫామ్​లోకి..: గావస్కర్‌
    ఫామ్​ కోల్పోయి ఇబ్బంది పడుతున్న విరాట్ కోహ్లీపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. అయితే కొంతమంది ఆటగాళ్లు, సీనియర్లు మాత్రం ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. తాజాగా.. దిగ్గజ ఆటగాడు గావస్కర్‌ కోహ్లీకి తన విలువైన సలహాలు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.