ETV Bharat / city

హైదరాబాద్‌ను ఏపీలో కలిపేయాలని అడగగలమా?: మంత్రి బొత్స

author img

By

Published : Jul 19, 2022, 2:08 PM IST

Updated : Jul 19, 2022, 2:38 PM IST

botsa
మంత్రి బొత్స

14:06 July 19

పోలవరం ఎత్తు ఎవరు పెంచారు: మంత్రి బొత్స సత్యనారాయణ

హైదరాబాద్‌ను ఏపీలో కలిపేయాలని అడగగలమా?: మంత్రి బొత్స

పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముంపు ముప్పు, విలీన మండలాలను తెలంగాణలో కలపాలంటూ ఆ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. తెలంగాణ విడిపోవడం వల్ల హైదరాబాద్‌ ద్వారా ఏపీకి రావాల్సిన ఆదాయం తగ్గిపోయిందని.. గతంలా ఉమ్మడి రాష్ట్రంగానే ఉంచాలని తాము అడిగితే బావుంటుందా? అని ప్రశ్నించారు. పువ్వాడ అజయ్‌ చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రతినిధులు బొత్స వద్ద ప్రస్తావించగా ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముంపు విషయం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచే అందరికీ తెలుసన్నారు.

ఉమ్మడి రాష్ట్రంగానే ఉంచమనండి.. మాకు అభ్యంతరం లేదు: ‘‘పోలవరం ఎత్తు ఎప్పుడు పెంచారు? డిజైన్ల ప్రకారమే నిర్మాణం జరుగుతోంది. సీడబ్ల్యూసీ అనుమతి లేకుండా ఏమీ చేయలేదు కదా? తెలంగాణ విడిపోవడం వల్ల హైదరాబాద్‌ ద్వారా ఏపీకి రావాల్సిన ఆదాయం తగ్గిపోయింది. హైదరాబాద్‌ను ఏపీలో కలిపేయమని అడగగలమా? గతంలా ఉమ్మడి రాష్ట్రంగా ఉంచాలని అడిగితే బావుంటుందా? అలా అయితే చేసేయమనండి. ఉమ్మడి రాష్ట్రంగానే ఉంచమని చెప్పండి.. మాకు అభ్యంతరం లేదు. సాంకేతికంగా ఇబ్బందులొస్తే దాన్ని ఎలా అధిగమించాలనేది ఆలోచించాలి." -మంత్రి బొత్స సత్యనారాయణ

పువ్వాడ అజయ్‌.. మీ సంగతి మీరు చూసుకోండి: మాట్లాడే వ్యక్తులు బాధ్యతగా మాట్లాడాలి. సమస్యను పరిష్కరించుకునేలా ఉండాలి తప్ప.. రెచ్చగొట్టేలా వ్యవహరించకూడదు. పువ్వాడ అజయ్‌ అతడి సంగతి చూసుకోవాలి. ఖమ్మం జిల్లాలోని ముంపు ప్రాంతాల సంగతి ఆయన చూసుకుంటే సరిపోతుంది. ముంపు మండలాలు, ప్రజలు ఏపీ రాష్ట్ర కుటుంబసభ్యులు. ఆ ప్రజల బాధ్యత పూర్తిగా మాది. విలీన మండలాలను తెలంగాణలో కలిపేయాలని వాళ్లు అంటే.. రాష్ట్రాన్ని మళ్లీ కలిపేయాలని మేం కూడా డిమాండ్‌ చేస్తాం’’ అని బొత్స వ్యాఖ్యానించారు.

ఇవీ చదవండి:

Last Updated :Jul 19, 2022, 2:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.