ETV Bharat / city

AP TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @9PM

author img

By

Published : Jul 16, 2022, 8:59 PM IST

ఏపీ ప్రధాన వార్తలు
ఏపీ ప్రధాన వార్తలు

.

  • Floods: గోదావరి మహోగ్రరూపం..అల్లాడిపోతున్న జనం
    డతెరిపిలేని వర్షాలతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రహదారులన్నీ జలమయమవ్వటంతో.. ప్రజల ఇబ్బందులకు గురయ్యారు. గోదావరి ఉగ్రరూపాన్ని చూసి జనం హడలిపోతున్నారు. లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోగా మరికొన్నింటిని ముంపు ముప్పు వెంటాడుతోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • వరదలపై సీఎం జగన్ సమీక్ష.. మరో 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశం
    రాష్ట్రంలో వరదలు, సహాయ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి సమీక్ష చేపట్టారు. ఇవాళ ఉదయం అధికారులతో చర్చించిన ఆయన, రాష్ట్రంలో ఎక్కడా ప్రాణనష్టం ఉండకూడదని ఆదేశించారు. మరో 24 గంటలపాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • ఏపీ భవిష్యత్తుకు వైకాపా ప్రభుత్వం హానికరం..వారితోనే మార్పు సాధ్యం: పవన్‌
    తూర్పుగోదావరి జిల్లా చైతన్యవంతమైనదని.. రాష్ట్రంలో మార్పు రావాలంటే గోదావరి జిల్లాలతోనే సాధ్యమవుతుందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. జనసేన కౌలు రైతు భరోసాయాత్రలో భాగంగా.. కోనసీమ జిల్లా మండపేటలో ఆత్మహత్య చేసుకున్న 52 మంది కౌలు రైతుల కుటుంబాలకు పవన్‌ ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన.. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే శక్తి గోదావరి జిల్లాలకు ఉందన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • అంబేడ్కర్ పేరు తొలగించి తన పేరు పెట్టుకుంటారా ?.. సీఎం జగన్​ది అహంకారమే: చంద్రబాబు
    విదేశీ విద్యానిధి పథకానికి అంబేడ్కర్‌ పేరు తొలగించి.. సీఎం జగన్ తన పేరు పెట్టుకోవటంపై తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఇది అంబేడ్కర్​ను అవమానించటమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • ఎన్​డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగ్దీప్ ధన్​కడ్
    ఎన్​డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్​కడ్​ను భాజపా అధిష్ఠానం ఎంపిక చేసింది. ఈ మేరకు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. ధన్​కడ్ మూడు దశాబ్దాలుగా ప్రజాసేవలో ఉన్నారని నడ్డా పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • 'ఓట్ల కోసం ఉచిత హామీలు దేశాభివృద్ధికి ప్రమాదకరం'
    ఉచిత పథకాల హామీలు దేశాభివృద్ధికి ప్రమాదకరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. తమ ప్రభుత్వం సౌకర్యాలు కల్పించడమే కాకుండా దేశ భవిష్యత్‌నూ నిర్మిస్తోందని ఉద్ఘాటించారు. యూపీలో నిర్మించిన బుందేల్​ఖండ్ ఎక్స్​ప్రెస్ వేను ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్​తో కలిసి ప్రారంభించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • 'ప్రధానిగా సునాక్​ తప్ప ఇంకెవరైనా ఓకే.. అతను నాకు ద్రోహం చేశాడు'
    బ్రిటన్​ ప్రధాని రేసులో ఉన్న రిషి సునాక్​ను ఎన్నుకోవద్దని మద్దతుదారులకు మాజీ ప్రధాని బోరిస్​ జాన్సన్​ సూచిస్తున్నట్లు తెలుస్తోంది. విదేశాంగమంత్రి లిజ్‌ ట్రస్‌ లేదంటే జాకబ్‌ రీస్‌, డోరిస్‌, పెన్నీ మోర్డాంట్‌లలో ఎవరో ఒకరికి మద్దతివ్వాలని ఆయన సూచించినట్టు తెలిపింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • సామాన్యుడిపై మరో పిడుగు.. నిత్యావసర ధరలు పైపైకి.. పాలు, పెరుగు సహా..
    పేద, మధ్య తరగతి వర్గాలపై నిత్యావసర సరుకుల భారం మరింత పెరగనుంది. ఇటీవల జరిగిన జీఎస్టీ భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు.. పాలు, మజ్జిగ తదితరాల వస్తువులపై 5 శాతం పన్ను విధించనున్నారు. చెక్కుల జారీ సహా హోటల్‌ గదుల అద్దెలు, ఎల్‌ఈడీ లైట్ల ధరలు కూడా ప్రియం కానున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • రవితేజను కారవాన్​లోకి లాగిన చిరంజీవి​.. 'మెగా154' సెట్​లో సందడి
    చిరు-బాబీ కాంబినేషన్​లో తీస్తున్న కొత్త సినిమా 'మెగా154' షూటింగ్​లో ఆసక్తికర పరిణామం జరిగింది. శనివారం షూటింగ్​లో మాస్​హీరో రవితేజ జాయిన్ అయ్యారు. రవితేజ వచ్చిన వెంటనే.. తన కారవాన్​లోకి లాగేశారు మెగాస్టార్​. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • ఫైనల్లో పీవీ సింధు.. జపాన్​ షట్లర్​ను చిత్తుచిత్తుగా ఓడించి..
    భారత స్టార్​ షట్లర్​ పీవీ సింధు మరోసారి అదరగొట్టింది. సింగపూర్​ బ్యాడ్మింటన్​ ఓపెన్ ఫైనల్లో అడుగుపెట్టి.. మరో టైటిల్​పై కన్నేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.