ETV Bharat / city

LIVE UPDATES: విశాఖ రైల్వే స్టేషన్​లో రైళ్ల రాకపోకలకు అనుమతి

author img

By

Published : Jun 18, 2022, 9:32 AM IST

Updated : Jun 18, 2022, 1:36 PM IST

live updates
live updates

13:16 June 18

క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న పోలీసులు

  • విశాఖ రైల్వే స్టేషన్లలో రైళ్ల రాకపోకలకు అనుమతి
  • మధ్యాహ్నం 12:15 గంటల నుంచి రైళ్ల రాకపోకలు పునరుద్ధరణ
  • విశాఖ: ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న పోలీసులు

13:14 June 18

విశాఖకు రైళ్ల రాకపోకలు పాక్షిక పునరుద్ధరణ

  • విశాఖకు రైళ్ల రాకపోకలు పాక్షిక పునరుద్ధరణ
  • విశాఖకు చేరుకున్న కడప-విశాఖ తిరుమల ఎక్స్‌ప్రెస్‌
  • కాసేపట్లో చేరుకుంటున్న యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు
  • కాసేపట్లో చేరుకుంటున్న ప్రశాంతి, చెన్నై మెయిల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు

13:13 June 18

కొత్తవలసలో కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్‌ నిలిపివేత.. ఒడిశావాసి మృతి

  • విజయనగరం: కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్‌ కొత్తవలసలో నిలిపివేత
  • చికిత్స కోసం ఒడిశా నుంచి వచ్చిన జోగేష్‌ బెహరా(70) మృతి
  • గుండెజబ్బు చికిత్స కోసం ఒడిశా నుంచి విశాఖ వస్తున్న జోగేష్‌ బెహరా
  • అగ్నిపథ్ అల్లర్లతో విశాఖ వెళ్లాల్సిన రైలు కొత్తవలసలో నిలిపివేత
  • సమయానికి అంబులెన్స్ లేక కొత్తవలసలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలింపు
  • ప్రాథమిక చికిత్స చేస్తుండగానే మృతిచెందిన జోగేష్ బెహరా
  • కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న మృతుని కుటుంబసభ్యులు

11:56 June 18

విజయవాడ రైల్వేస్టేషన్‌లో అదనపు బలగాల మోహరింపు

  • విజయవాడ రైల్వేస్టేషన్‌లో భద్రతను పరిశీలించిన సీపీ కాంతి రాణా టాటా
  • విజయవాడలో పటిష్ట బందోస్తు ఏర్పాటు చేశాం: సీపీ కాంతి రాణా టాటా
  • జీఆర్పీ, ఆర్పీఎఫ్‌, సివిల్‌తో పాటు అదనపు బలగాల మోహరింపు: సీపీ
  • రౌడీషీటర్లతో పాటు అనుమానితులను ముందస్తు అరెస్టు చేశాం: సీపీ
  • రైల్వే ఆస్తులు ధ్వంసం చేస్తే చట్టాలు కఠినంగా ఉన్నాయి: సీపీ
  • నాన్ బెయిల్ కేసులతో పాటు ఏడేళ్ల జైలు శిక్ష పడుతుంది: సీపీ
  • విధ్వంసాలకు పాల్పడితే భవిష్యత్తు పాడవుతుంది: సీపీ
  • తల్లిదండ్రులు తమ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి: సీపీ
  • విజయవాడలో ఇన్‌స్టిట్యూషన్లతో మాట్లాడి ఆదేశాలిచ్చాం: సీపీ
  • సోషల్ మీడియా పైనా నిఘా పెంచాం: సీపీ కాంతి రాణా టాటా
  • హింస వైపు ఎవరూ వెళ్లవద్దని కోరుతున్నాం: సీపీ కాంతి రాణా టాటా

11:17 June 18

శ్రీకాకుళంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకుల అరెస్టు

  • ఆమదాలవలసలోని శ్రీకాకుళం రోడ్‌ స్టేషన్‌లో ఎస్‌ఎఫ్‌ఐ నాయకుల అరెస్టు
  • గూడ్స్‌ రైలును అడ్డుకోవడానికి యత్నించగా అదుపులోకి తీసుకున్న పోలీసులు

10:57 June 18

విశాఖ రైల్వేస్టేషన్‌లో హెల్ప్‌లైన్లు ఏర్పాటు

  • విశాఖ రైల్వేస్టేషన్‌లో హెల్ప్‌లైన్లు ఏర్పాటు
  • రైళ్ల రద్దు, దారిమళ్లింపు వివరాలు అందిస్తున్న వాల్తేర్‌ డివిజన్‌ అధికారులు
  • విశాఖ హెల్ప్‌లైన్‌ నెంబర్లు: 08912746330, 08912744619
  • విశాఖ హెల్ప్‌లైన్‌ నెంబర్లు: 8106053051, 8106053052
  • విశాఖ హెల్ప్‌లైన్‌ నెంబర్లు: 8500041670, 8500041671

10:35 June 18

విజయనగరం రైల్వే స్టేషన్ ముందు ముళ్లకంచె ఏర్పాటు

  • విజయనగరం: సామాజిక మాధ్యమాల్లో మెసేజ్‌తో అప్రమత్తమైన పోలీసులు
  • విజయనగరంలో భారీగా భద్రత పెంపు, స్టేషన్ ముందు ముళ్లకంచె ఏర్పాటు
  • విశాఖ నుంచి బస్సుల్లో విజయనగరం చేరుతున్న ప్రయాణికుల తనిఖీ

10:25 June 18

కంభంలో 20 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

  • ప్రకాశం: అగ్నిపథ్‌ అల్లర్ల నేపథ్యంలో ముందస్తు చర్యలు
  • కంభంలో 20 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసుల అదుపులో 20 మంది

09:54 June 18

37 మంది ముందస్తు అరెస్టు

  • విశాఖ: గాజువాక పీఎస్‌ పరిధిలో 37 మంది ముందస్తు అరెస్టు
  • ముందస్తు చర్యల్లో భాగంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు

09:11 June 18

కొనసాగుతున్న తనిఖీలు

  • విశాఖ గాజువాక పీఎస్‌ పరిధిలో 37 మందిని ముందస్తు అరెస్టు చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా.. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​లో ఆందోళనల నేపథ్యంలో రాష్ట్రంలో అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లలో హై అలర్ట్ ప్రకటించారు. దాడులు జరగవచ్చన్న సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు.. అన్ని రైల్వే స్టేషన్​లలో అదనపు బలగాలను మోహరించారు.
  • గుంటూరు రైల్వేస్టేషన్‌లోనూ భారీగా పోలీసులను మోహరించారు. చలో గుంటూరు కార్యక్రమం జరుగుతుందనే నిఘా వర్గాల సమాచారంతో అప్రమత్తమైన అధికారులు.. ఆర్మీ నియామక బోర్డు వద్ద భద్రతను పెంచారు. ఆర్మీ కార్యాలయానికి వెళ్లే దారిని మూసివేశారు. రైల్వే స్టేషన్‌కు వచ్చిన అనుమానితులను ప్రశ్నిస్తున్న పోలీసులు.. సీసీ కెమెరాల ద్వారా భద్రతను పర్వ వేక్షిస్తున్నారు. కొత్తపేట స్టేషన్‌కు ఆందోళనకు వస్తున్నారన్న సమాచారంతో పలువురు ఆర్మీ అభ్యర్థులను పోలీసులు అరెస్టు చేశారు.
  • విశాఖపట్నంలో రైల్వేస్టేషన్​ను మధ్యాహ్నం 12 వరకు మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రైల్వేస్టేషన్‌లోకి ఎవ్వరికీ అనుమతి లేదన్న అధికారులు.. విజయవాడ నుంచి వచ్చే రైళ్లన్నీ దువ్వాడ వద్ద నిలిపివేయగా.. కొన్ని రైళ్లను దారి మళ్లించారు. హవ్‌డా, విజయవాడ నుంచి వచ్చే రైళ్లన్నీ కొత్తవలస వద్ద నిలిపివేసి.. దారి మళ్లిస్తున్నారు. విశాఖ స్టేషన్‌కు రైళ్లు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు.
  • రైల్వేస్టేషన్‌కు అర కిలోమీటర్‌ ముందే అన్నివైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల వరకు ఉన్న ప్రయాణికులకే తనిఖీల అనంతరం అనుమతిచ్చారు. స్టేషన్‌ రోడ్డులోని ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ అధికారి కార్యాలయం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. భద్రత వ్యవహారాలను పోలీసు కమిషనర్‌ శ్రీకాంత్‌ స్వయంగా పరిశీలిస్తున్నారు. విశాఖలో పలువురు విద్యార్థి సంఘాల నేతలను గృహనిర్బంధం చేశారు. విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
  • కంచరపాలెం గేట్, మర్రిపాలెం హాల్ట్, సింహాచలం స్టేషన్ల వద్ద.. అధికారులు భద్రత పెంచారు. మద్దిలపాలెం, జ్ఞానాపురం ప్రాంతాల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ముందస్తు చర్యలు చేపట్టారు.

నిరుద్యోగులు, ప్రజలు ఎలాంటి ఆందోళనలకు దిగొద్దు.. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల ధ్వంసానికి పాల్పడితే కఠిన చర్యలు.. విధ్వంసాలకు పాల్పడితే సెక్షన్ 30 ఆఫ్ పోలీస్ యాక్టు ప్రకారం చర్యలు.. కార్యాలయాల ఆస్తుల పరిరక్షణకు అన్నిరకాల చర్యలు చేపట్టాం: సీపీ శ్రీకాంత్‌

  • విజయవాడ రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌లలో భద్రత భారీగా పెంచారు. ప్రత్యేక బలగాలతో ప్రయాణికులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

యువకులు, విద్యార్థులెవరూ ఆందోళనకు దిగొద్దు.. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.. కేసు నమోదైతే యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోతారని.. జాగ్రత్తగా ఉండాలి: సీపీ కాంతి రాణా టాటా

  • విజయవాడలో అగ్నిపథ్‌ రద్దు చేయాలంటూ ఆందోళన చేసిన విద్యార్థి, యువజన సంఘాల నాయకులను పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్​ చేశారు. వారిని అర్ధరాత్రి ఒంటిగంటకు ఇబ్రహీంపట్నం, కంచికచర్ల పీఎస్‌లకు తరలించారు. విద్యార్థి నాయకుల అరెస్టుపై ప్రశ్నించిన సీపీఎం నేతలను పోలీసులు అరెస్టు చేశారు.

విశాఖ రాకుండా దువ్వాడ నుంచి దారి మళ్లించిన రైళ్లు..

  • సంత్రాగచ్చి-ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌(22807) మళ్లింపు
  • చెన్నై సెంట్రల్‌-హావ్‌డా మెయిల్‌(12840) మళ్లింపు
  • ధన్‌బాద్‌-అలెప్పీ బొకారో(13351) మళ్లింపు
  • వాస్కోడగామా-హావ్‌డా(18048) మళ్లింపు
  • టాటా-యశ్వంత్‌పూర్‌ వీక్లీ (12889) మళ్లింపు
  • గుంటూరు-రాయగఢ (17243) మళ్లింపు
  • తిరుచిరాపల్లి-హావ్‌డా వీక్లీ(12664) మళ్లింపు
  • బెంగళూరు-భువనేశ్వర్‌ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌(18464)

దువ్వాడ వద్ద నిలిపివేయనున్న రైళ్లు...

  • విశాఖ-గోదావరి ఎక్స్‌ప్రెస్‌(12728)
  • కాచిగూడ-విశాఖ(12862) ఎక్స్‌ప్రెస్‌
  • సికింద్రాబాద్‌-విశాఖ గరీబ్‌రథ్‌ (12740) ఎక్స్‌ప్రెస్‌
  • లోకమాన్య తిలక్‌ టెర్మినల్‌-విశాఖ(18520)
  • కడప-విశాఖ తిరుమల ఎక్స్‌ప్రెస్‌(17487‌)

కొత్తవలస వద్ద నిలిపివేయనున్న రైళ్లు...

  • కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్‌(18517)
  • దిఘా-విశాఖ ఎక్స్‌ప్రెస్‌(22873)

అనకాపల్లి వద్ద నిలిపివేయనున్న రైళ్లు...

  • మచిలీపట్నం-విశాఖ (17219)
  • కాకినాడ-విశాఖ(17267‌‌)
  • తిరుపతి-విశాఖ డబుల్‌ డెక్కర్‌(22708)
Last Updated :Jun 18, 2022, 1:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.