ETV Bharat / city

AP TOPNEWS ప్రధానవార్తలు 9PM

author img

By

Published : Aug 27, 2022, 8:59 PM IST

.

9pm topnews
ప్రధానవార్తలు 9PM

  • చోరీలకు పాల్పడుతున్న బంగ్లాదేశీయులు అరెస్ట్​, ఎక్కడంటే

బంగ్లాదేశ్‌లో ట్రక్కు డ్రైవర్లు, టీ దుకాణదారులుగా జీవిస్తూ భారత్‌లో చోరీలకు పాల్పడుతున్న ఏడుగురు ముఠా సభ్యులను గన్నవరం పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. విలేకరుల సమావేశంలో ఎస్పీ జాషువా నిందితుల వివరాలను వెల్లడించారు.

  • తగ్గేదే లా, అంటోన్నతాడికొండ వైకాపాలోని ఆధిపత్యపోరు

గుంటూరు జిల్లా తాడికొండ వైకాపాలో ఆధిపత్యపోరు మరింత ముదురుతోంది. నియోజకవర్గ వైకాపా అదనపు ఇంఛార్జ్‌గా డొక్కా మాణిక్యవరప్రసాద్ నియామకాన్ని నిరసిస్తూ తాడికొండలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మద్దతుదారులు ర్యాలీకి సిద్ధమయ్యారు. తాడికొండ కూడలిలో ర్యాలీ ప్రారంభించే సమయంలో డొక్కా వర్గం అక్కడికి చేరుకుని డొక్కాకు అనుకూలంగా నినాదాలు చేసింది.

  • ట్రాఫిక్​ సీఐని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

విశాఖ జిల్లా పాత గాజువాక కూడలిలో రోడ్డు ప్రమాదం జరిగింది. విధినిర్వహణలో ఉన్న ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ రెడ్డిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సీఐకి స్వల్ప గాయాలయ్యాయి. తోటి సిబ్బంది వెంటనే అతనిని ఆస్పత్రికి తరలించారు.

  • కుప్పంను ఆక్రమించుకోవాలనుకోవడం పెద్దిరెడ్డికి పగటికలే

కుప్పంను ఆక్రమించుకోవాలనుకోవడం మంత్రి పెద్దిరెడ్డికి పగటికలే అవుతుందని తెదేపా నేత వర్ల రామయ్య అన్నారు. ఎంత అణగదొక్కితే రెట్టింపు వేగంతో ప్రజలు తిప్పికొడతారని హెచ్చరించారు.

  • భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యుయు లలిత్ ప్రమాణం

భారత 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యు.యు. లలిత్ ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్‌ లలిత్‌తో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సీజేఐగా ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మాజీ సీజేఐ జస్టిస్ ఎన్​వీ రమణ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా పలువురు కేంద్రమంత్రులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

  • దుమ్మురేపిన వందే భారత్‌, ట్రయల్‌ రన్‌లో గంటకు 180 కిమీ వేగం

వందేభారత్ రైలు దుమ్మురేపింది. ట్రయల్ రన్​లో గంటకు 180 కిలోమీటర్ల గరిష్ఠ వేగాన్ని నమోదు చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలను కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ ట్విట్టర్​లో పోస్టు చేశారు.

  • మళ్లీ మోదీనే నంబర్​ వన్​, ప్రపంచ అత్యుత్తమ నేతల్లో టాప్

భారత ప్రధాని నరేంద్ర మోదీని 75 శాతం మంది ప్రజలు ఆమోదిస్తున్నారని అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే సర్వే సంస్ధ వెల్లడించింది. ప్రపంచ నాయకులకంటే అధిక ప్రజామోదం ఉన్న నేతగా మోదీనే ముందున్నారని స్పష్టం చేసింది.

  • ఏపీ, తెలంగాణలో బంగారం ధర ఎంతంటే

ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర శనివారం స్వల్పంగా తగ్గింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.390 తగ్గి ప్రస్తుతం రూ.53,100 పలుకుతోంది. మరోవైపు కేజీ వెండి ధర కూడా రూ.490 మేర తగ్గింది. ప్రస్తుతం రూ. 56,820 వద్ద ఉంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

  • దాయాదితో పోరుకు భారత్ సిద్ధం, కసితో రోహిత్ సేన​, మరోసారి నెగ్గాలని పాక్ వ్యూహం

ఆసియా కప్‌లో భాగంగా భారత్‌ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. గతేడాది ప్రపంచకప్‌లో ఓటమికి బదులు తీర్చుకోవాలని రోహిత్‌ సేన ఉవ్విళ్లూరుతుండగా టీమ్‌ఇండియాపై మరోసారి నెగ్గాలని పాక్‌ వ్యూహాలు రచిస్తోంది. అక్టోబర్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌నకు సన్నద్ధమయ్యేందుకు ఇరుజట్లుతో పాటు ఆటగాళ్లకు టోర్నీ ఎంతో ఉపయుక్తం కానుంది.

  • పులితో ఎన్టీఆర్ ఫైట్​ సీన్​ మేకింగ్ వీడియో చూశారా

దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన పాన్​ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్​లో ఎన్టీఆర్ నటన భారతీయ ప్రేక్షకులతో పాటు హాలీవుడ్ సినిమా ప్రముఖులను సైతం మెప్పించింది. ముఖ్యంగా పెద్ద పులితో ఎన్టీఆర్ ఫైట్ చేసే సీన్ అద్భుతమని చెప్పొచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.