ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @9PM

author img

By

Published : Jun 17, 2022, 8:59 PM IST

9pm top news
9pm top news

..

  • జాబ్‌ క్యాలెండర్‌పై సీఎం జగన్ సమీక్ష..ఈ ఏడాది ఎన్ని పోస్టులు భర్తీ చేశారంటే...!

జాబ్‌ క్యాలెండర్‌పై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. 2021–22 ఏడాదిలో 39,654 పోస్టులు భర్తీ చేసినట్లు తెలిపారు. మిగిలిన 8 వేల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు.

  • Chandrababu: రోడ్డుపైన గుంతలనే పూడ్చలేని ముఖ్యమంత్రి అభివృద్ధి చేస్తారా..?: చంద్రబాబు

తెదేపా నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్న వైకాపా ప్రభుత్వం.. తగిన మూల్యం చెల్లించుకుంటుందని చంద్రబాబు హెచ్చరించారు. విజయనగరం జిల్లాలో పర్యటించిన ఆయన.. ఇష్టారాజ్యంగా పన్నులు పెంచేసిన ముఖ్యమంత్రిపై ప్రజలు తిరుగుబాటు చేస్తారని హెచ్చరించారు.

  • Agnipath Agitation: సికింద్రాబాద్‌లో ఆందోళన ఉద్రిక్తం.. ఒకరు మృతి, 13 మందికి గాయాలు

కేంద్రం తీసుకొచ్చిన కొత్త సర్వీస్ అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అగ్నిపథ్‌ను రద్దు చేయాలంటూ ఇప్పుడు హైదరాబాద్‌లోనూ నిరసనకారులు గళమెత్తారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకున్న ఆందోళనకారులు... రైలుకు నిప్పుపెట్టి నిరసన తెలిపారు.

  • అనంతబాబు బెయిల్ పిటిషన్ కొట్టేసిన ఎస్సీ, ఎస్టీ కోర్టు

ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పిటిషన్ ను.. ఎస్సీ, ఎస్టీ కోర్టు కొట్టివేసింది. కారు డ్రైవర్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అనంతబాబు.. ప్రస్తుతం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

  • ఈ ఏడాదే జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు!

జమ్ముకశ్మీర్​ అసెంబ్లీ ఎన్నికలపై కీలక ప్రకటన చేశారు రక్షణమంత్రి రాజ్​నాథ్​. కుదిరితే ఈ ఏడాది చివర్లోనే అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశముందన్నారు. నియోజకవర్గాల పునర్విభజన కసరత్తు ఇటీవలే ముగిసిందని చెప్పారు.

  • ఏడు రాష్ట్రాల్లో 'అగ్నిపథ్' మంటలు.. అనేక చోట్ల విధ్వంసకాండ!

కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపథ్ విధానాన్ని నిరసిస్తూ యువత చేస్తున్న ఆందోళనలు మరిన్ని రాష్ట్రాలకు విస్తరించాయి. మొత్తం 7 రాష్ట్రాలు ఈ నిరసనలతో హోరెత్తాయి. పలు ప్రాంతాల్లో ఆందోళనకారులు విధ్వంసాలకు పాల్పడ్డారు. రైళ్లు, బస్సులకు నిప్పంటించి భయానక వాతావరణం సృష్టించారు.

  • రష్యా పౌరులకు ఇకపై వీసా ఉంటేనే అనుమతి: జెలెన్​స్కీ

రష్యా పౌరులను ఇకపై వీసా ఉంటేనే తమ దేశంలోకి అనుమతించనున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్​ జెలెన్​స్కీ ప్రకటించారు. జులై 1న ఈ కొత్త విధానం అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు.

  • ఏపీ, తెలంగాణలో పెరిగిన బంగారం ధరలు.. క్రిప్టో కరెన్సీలు భారీ పతనం

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల పసిడి ధర రూ. 52,720గా ఉంది. కిలో వెండి ధర రూ. 63,225గా ఉంది. క్రిప్టోకరెన్సీలు కూడా నష్టాలను నమోదు చేస్తున్నాయి.

  • 'మెగా' సెట్​లో సుక్కూ.. రషెస్​ చూసి థ్రిల్.. దిపావళికి రకుల్ నవ్వులు!

కొత్త సినిమాల అప్డేట్లు వచ్చేశాయి. మెగాస్టార్ చిరంజీవి 'మెగా154', జాన్వీకపూర్ 'గుడ్​లక్​ జెర్రీ', అజయ్​దేవ్​గణ్​ 'థ్యాంక్ గాడ్' చిత్రాల విశేషాలు ఇందులో ఉన్నాయి.

  • చరిత్ర సృష్టించిన ఇంగ్లాండ్.. వన్డేల్లో అత్యధిక స్కోరు నమోదు

నెదర్లాండ్స్​తో మ్యాచ్​లో ఇంగ్లాండ్​ చరిత్ర సృష్టించింది. 498/4 పరుగులతో వన్డే చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసింది. దీంతో ఇంగ్లాండ్ తన రికార్డు తానే తిరగరాసుకుంది. అంతకుముందు కూడా వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇంగ్లాండ్ పేరిటే ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.