ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @9PM

author img

By

Published : Jun 6, 2022, 8:58 PM IST

9pm top news
9pm top news

.

  • పదో తరగతి ఫలితాలు విడుదల..
    రాష్ట్రంలో పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. గతంలో కంటే ఈసారి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం తగ్గింది. బాలికలు ఎక్కువ మంది ఉత్తీర్ణులై సత్తా చాటగా.. బాలురు వెనకబడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 71 పాఠశాలల్లో ఒక్క విద్యార్థీ పరీక్ష పాస్ కాలేదు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి'
    వైకాపా ప్రభుత్వంపై భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచారు.. కరెంటు కోతలు విధిస్తున్నారని మండిపడ్డారు. రైతులకు మోదీ అందించే సాయాన్ని జగన్ సొంత పథకంగా చెబుతున్నారని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • గవర్నర్​తో సీఎం జగన్ సమావేశం..
    గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజ్​భవన్​లో భేటీ అయ్యారు. కోనసీమలో జరిగిన ఆందోళనలు, ప్రభుత్వం తీసుకున్న చర్యలను గవర్నర్‌కు వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు.. సర్కారు పచ్చజెండా
    ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రాష్ట్రంలో సాధారణ బదిలీలపై ఇప్పటివరకు కొనసాగుతూ వచ్చిన నిషేధాన్ని సడలిస్తూ సర్కార్​ తాజాగా నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'మన కరెన్సీ, బ్యాంకులను 'అంతర్జాతీయం' చేద్దాం'
    అంతర్జాతీయ వాణిజ్యంలో భారత దేశ బ్యాంకులతో పాటు కరెన్సీని ముఖ్యమైన భాగంగా మార్చాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. కేంద్ర ఆర్థిక శాఖ చేపట్టిన ఐకానిక్​ వారోత్సవాలను ప్రారంభించిన ఆయన.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'మీలా మతోన్మాదులకు స్మారకాలు కట్టట్లేదు'... పాక్​పై భారత్ ఫైర్
    భారత్​లోని ముస్లింల హక్కులపై పాకిస్థాన్, సౌదీ అరేబియా, ఇస్లామిక్ సహకార సంస్థ(ఐఓసీ) చేసిన వ్యాఖ్యలను విదేశాంగ శాఖ ఖండించింది. ఈ సందర్భంగా పాకిస్థాన్​పై తీవ్రంగా మండిపడింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మంకీపాక్స్​ ​ నివారణకు డబ్ల్యూహెచ్​ఓ 'పంచ' సూత్రాలు
    మంకీపాక్స్​ మరిన్ని దేశాలకు విస్తరించడంపై డబ్ల్యూహెచ్​ఓ ఆందోళన వ్యక్తం చేసింది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తగు చర్యలు తీసుకోవాలని సూచించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • గూగుల్​కు భారీ జరిమానా..
    గూగుల్​కు ఆస్ట్రేలియా కోర్టు భారీ జరిమానా విధించింది. ఓ రాజకీయ నాయుకుడికి సుమారు రూ.4 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. వివాదాస్పద వీడియోల కారణంగా ఆ నేత రాజకీయాలను వీడాల్సి వచ్చిందని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఆనంద్​ జోరు.. ఐదో రౌండ్​లో ప్రపంచ నెం.1పై గెలుపు​
    నార్వే చెస్‌ టోర్నమెంట్​లో భాగంగా జరిగిన ఐదో రౌండ్​లో దిగ్గజ ఆటగాడు విశ్వనాథన్‌ ఆనంద్‌ విజయం సాధించాడు. ప్రపంచ నెం.1 మాగ్నస్​ కార్లెసన్​ను ఓడించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • సల్మాన్​ ఇంటి వద్ద పోలీస్ బందోబస్తు.. భద్రత కట్టుదిట్టం
    హత్యా బెదిరింపుల నేపథ్యంలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్​ ఖాన్ ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు ముంబయి పోలీసులు. ఈ మేరకు సోమవారం అతడి ఇంటి వద్దకు చేరుకొని భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.