ETV Bharat / city

ప్రధానవార్తలు Topnews@9AM

author img

By

Published : Nov 18, 2021, 9:00 AM IST

9AM TOP NEWS
9AM TOP NEWS

.

  • Election Results: ‘పుర’ ఓట్ల కౌంటింగ్‌.. ఎక్కడెక్కడ ఏయే పార్టీలు గెలిచాయంటే..?

మిగిలిపోయిన మున్సిపల్, నగర పంచాయతీ ఎన్నికల్లో అధికార వైకాపా సత్తా చాటింది(Andhrapradesh municipal election results news). కీలకమైన కుప్పం, నెల్లూరు నగర పాలకను కైవసం చేసుకుంది(YSRCP wins in Kuppam news). రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల జరిగిన ఎన్నికల్లోనూ ఫ్యాన్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోగా.. కృష్ణా జిల్లా కొండపల్లి పురపాలికలో 14 స్థానాలను ఖాతాలో వేసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

  • pariashath election results: నేడు పరిషత్ ఎన్నికల ఫలితాలు

రాష్ట్రంలో 10 జెడ్పీటీసీ(zptc), 123 ఎంపీటీసీ(mptc) స్థానాల ఎన్నికల ఫలితాలను నేడు ప్రకటించనున్నారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభమవుతుంది. 14 జెడ్పీటీసీ స్థానాల్లో 4 ఏకగ్రీవమయ్యాయి. 10 చోట్ల పోలింగ్‌ నిర్వహించారు. 176 ఎంపీటీసీ స్థానాల్లో 50 ఏకగ్రీవమయ్యాయి. మూడు చోట్ల ఎవరూ నామినేషన్లు వేయలేదు. మిగిలిన 123 స్థానాలకు పోలింగ్‌ నిర్వహించారు. ఓట్ల లెక్కింపు కోసం జిల్లాల్లో యంత్రాంగం ఏర్పాట్లు చేసిందని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

  • PADAYATRA : అమరావతి రైతుల మహా పాదయాత్రకు నేడు విరామం

అమరావతి రైతుల మహా పాదయాత్రకు నేడు విరామం ప్రకటిస్తూ...అమరావతి జేఏసీ నేతలు నిర్ణయించారు. ప్రకాశం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పాదయాత్రకు విరామం ఏర్పడింది. రేపు ఉదయం గుడ్లూరు నుంచి యథావిధిగా యాత్ర ప్రారంభం కానుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

  • high court: రాజధాని వ్యాజ్యాలపై విచారణ... ప్రధాన న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు

కర్నూలులో హైకోర్టు ఏర్పాటు అన్న ప్రభుత్వ నిర్ణయం ప్రాంతాల మధ్య విభేదం తెచ్చే ప్రమాదం ఉందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్ర(High Court Chief Justice Prashant Kumar Mishra) వ్యాఖ్యానించారు. హైకోర్టు(high court) ఏర్పాటు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చేలా పాలనా వికేంద్రీకరణ చట్టంలో ఉందని.... అలా పొందుపరచవచ్చా అని ప్రశ్నించారు. అనంతరం రాజధాని వ్యాజ్యాలపై రోజువారీ విచారణ నేటికి వాయిదా వేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

  • వల్లభ్‌భాయ్‌ పటేల్‌కు 'సర్దార్' బిరుదు ఎలా వచ్చిందంటే?

భారత స్వాతంత్య్రోద్యమంలోని కీలక ఘట్టాల్లో తప్పక వినిపించే పేరు 'బర్దోలి'. ప్రలోభాలకు లొంగకుండా రైతులంతా కలసికట్టుగా బ్రిటిష్‌ ప్రభుత్వ మెడలు వంచిన ఘనత.. వల్లభ్‌భాయ్‌ పటేల్‌ను సర్దార్‌గా మార్చిన చరిత.. బర్దోలి సత్యాగ్రహానిది! పూర్తి వివరాల కోసం క్లక్​ చేయండి

  • కుప్పలుతెప్పలుగా మత్తుమందులు- పొంచి ఉన్న మహాముప్పు

పెచ్చరిల్లుతున్న మాదకద్రవ్యాలతో (Drug menace) యువశక్తులు నిర్వీర్యమైపోతూ పెను విషాద దృశ్యాలు ఆవిష్కృతమవుతున్నాయి. దేశీయంగా గంజాయి మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంటే- హెరాయిన్‌ వంటి మత్తుమందులు విదేశాల నుంచి కుప్పలుతెప్పలుగా వచ్చిపడుతున్నాయి. అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌ల నుంచి సముద్ర మార్గంలో గుజరాత్‌లోకి(Gujarat drugs news) మాదకద్రవ్యాలు వెల్లువెత్తుతున్నాయి. నిర్దేశిత కాలపరిమితితో కూడిన లక్ష్యాలు, సమధిక నిధులతో కేంద్ర, రాష్ట్ర పాలకులు ఏకతాటిపై పోరు సల్పితేనే- మాదకద్రవ్యాల భల్లూకం పట్టు నుంచి భారతావని బయటపడగలుగుతుంది! పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

  • మూడు సంస్థలుగా వేదాంతా వ్యాపారాల విభజన..!

వేదాంతా లిమిటెడ్‌ తన వ్యాపారాలను పునర్‌వ్యవస్థీకరించే దిశగా అడుగులు వేస్తోంది. అల్యూమినియం, ఇనుము- ఉక్కు, చమరు-గ్యాస్‌ వ్యాపారాలను ప్రత్యేక సంస్థలుగా విడదీసి స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదుచేసే ఉద్దేశంలో ఉంది. పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళిక కింద.. ఈ మూడు వ్యాపారాలను సమాంతరంగా నిర్వహించనున్నట్లు వేదాంతా గ్రూపు ఛైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

  • సంపన్న దేశాల్లో విస్తృతంగా బూస్టర్​ డోసు

ప్రపంచంలో అందరికన్నా ముందే ఇజ్రాయెల్‌ కొవిడ్‌ బూస్టర్‌ టీకాల పంపిణీని ప్రారంభించింది. మొత్తం 92 దేశాలు మూడో మోతాదు (బూస్టర్‌) టీకా కార్యక్రమాన్ని చేపడుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధరించింది. ఇంతవరకు అమెరికా, టర్కీ, చిలీలు ఎక్కువ సంఖ్యలో బూస్టర్‌ డోసులు ఇచ్చాయి. ఇజ్రాయెల్‌ తన జనాభాలో 44 శాతానికి మూడో మోతాదు టీకాలు అందించి అగ్రగామిగా నిలిచింది. ఇకపై 5-11 ఏళ్ల పిల్లలకూ వ్యాక్సిన్లు వేయడానికి ఆ దేశ నిపుణుల బృందం ఆమోద ముద్ర వేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

  • టీ20​ల్లో 'ఛేజింగ్' కింగ్.. టీమ్​ఇండియా కొత్త రికార్డు

న్యూజిలాండ్​తో టీ20 సిరీస్​లో(IND vs NZ T20 series) భాగంగా తొలి మ్యాచ్​లో విజయం సాధించింది టీమ్​ఇండియా. కివీస్ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని 19.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో టీమ్​ఇండియా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. టీ20ల్లో ఛేజింగ్​లో ఎక్కువసార్లు విజయం సాధించిన జట్టుగా నిలిచింది టీమ్​ఇండియా. బుధవారం(నవంబర్ 17) కివీస్​పై గెలుపుతో 50 విజయాలను సొంతం చేసుకుని మొదటి స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా, పాకిస్థాన్​ జట్లు 49 టీ20 విజయాలతో(ఛేజింగ్​) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

  • అమెరికా నేపథ్యంగా బాలయ్య కొత్త సినిమా

బాలకృష్ణ సినిమాల కథలు విదేశీ నేపథ్యంలో సాగడం అరుదు. ఆయన కొత్త సినిమా అమెరికాతో ముడిపడిన కథతో తెరకెక్కనుంది. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం.. ఇటీవల ప్రారంభమైంది. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ కలిసి నిర్మిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.