ETV Bharat / city

Top News: ఏపీ ప్రధాన వార్తలు @ 7 PM

author img

By

Published : Sep 5, 2022, 7:02 PM IST

7Pm Top News
ఏపీ ప్రధాన వార్తలు

.

  • కోనసీమలో కాల్పుల కలకలం.. దర్యాప్తు వేగవంతం
    GUN FIRING CASE UPDATES : కోనసీమలో జరిగిన కాల్పుల ఘటనలో దుండగులు వదిలిపెట్టిన నాటు బాంబులు, తుపాకీలు, జామర్​, మొదలగువాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాటు బాంబులను నీటిలో నానబెట్టి.. భూమిలో పాతిపెట్టారు. మిగిలిన సామగ్రిపై ఉన్న వేలిముద్రలను తీసుకుని సీజ్ చేశారు. ఆర్థిక లావాదేవీలా, లేక వ్యాపారాల్లో ఏమైనా గొడవలా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • చెన్నుపాటి వ్యవహారంలో ఎవ్వరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు: చంద్రబాబు
    CHANDRABABU FIRES ON YSRCP : తెదేపా నేత చెన్నుపాటి గాంధీపై దాడిని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఖండించారు. గాంధీపై దాడి అమానుషమన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక రౌడీమూకలు రెచ్చిపోతున్నారని.. ప్రశాంతంగా ఉన్న విజయవాడను కిష్కిందకాండగా మార్చరని మండిపడ్డారు. రౌడీయిజాన్ని నమ్ముకున్న వారు ఎవరూ బాగుపడలేదని. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పాదయాత్రకు అనుమతి కోసం హైకోర్టులో పిటిషన్​.. రేపు విచారణకు వచ్చే అవకాశం
    AMARAVATI FARMERS PETITION IN HIGH COURT: తమకు ఏకైక రాజధానిగా అమరావతే ఉండాలంటూ రైతులు రెండోసారి పాదయాత్రకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాదయాత్రకు అనుమతి కావాలని కోరుతూ అమరావతి పరిరక్షణ సమితి హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేసింది. ఈ పిటిషన్​పై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • తితిదే సిబ్బంది, యూపీ నటి మధ్య వాగ్వాదం.. అసలేం జరిగింది..!
    UP actress Archana Gautham: శ్రీవారి బ్రేక్ దర్శనాల కేటాయింపుపై యూపీ నటి అర్చన గౌతమ్ తీవ్ర ఆరోపణలు చేశారు. బ్రేక్ దర్శన టికెట్లు విక్రయిస్తూ దోపిడికి పాల్పడుతున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. తిరుమల యాత్రలో ఎదుర్కొన్న సంఘటనల దృశ్యాలను నటి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. నటి పోస్ట్ చేసిన తర్వాత సామాజిక మాధ్యమాల్లో భిన్నమైన దృశ్యాలు వైరల్‌ అవుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రాహుల్​ హామీల వర్షం.. రైతులకు రూ.3 లక్షల వరకు రుణమాఫీ
    Rahul Gandhi Ahmedabad : ఎన్నికలు సమీపిస్తున్న వేళ గుజరాత్​లో.. కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ హామీలు గుప్పించారు. తాము అధికారంలోకి వస్తే రైతులకు రూ. 3 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. భాజపా.. వ్యాపారవేత్తలకు కొమ్ముకాస్తుందని, రైతులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • యంగెస్ట్ మేయర్, ఎమ్మెల్యే వివాహం.. హాజరైన సీఎం విజయన్
    Mayor Arya Rajendran Wedding: తిరువనంతపురం మేయర్, బలుస్సెరి ఎమ్మెల్యే సచిన్ దేవ్​ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ కొత్త దంపతులను కేరళ సీఎం పినరయి విజయన్ ఆశీర్వదించారు. నిరాండంబరం జరిగిందీ ఆ వివాహ వేడుక. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రిషి సునాక్​ ఓటమి.. బ్రిటన్​ నూతన ప్రధానిగా లిజ్​ ట్రస్​.. మోదీ ట్వీట్​
    Liz Truss becomes British Prime Minister : బ్రిటన్​ నూతన ప్రధానమంత్రిగా లిజ్​ ట్రస్​ ఎన్నికయ్యారు. సోమవారం వెల్లడైన తుది ఫలితాల్లో భారత సంతతికి చెందిన రిషి సునాక్​పై ఆమె విజయం సాధించారు. కన్జర్వేటివ్‌ పార్టీ నేతగా, ప్రధానిగా లిజ్‌ ట్రస్​ను ఎన్నుకున్నారు. కన్జర్వేటివ్​ పార్టీ నేతను ఎన్నుకునేందుకు ఆరు వారాలుగా హోరాహోరీ ప్రచారంతో పాటు అంతర్గతంగా పోలింగ్‌ జరగ్గా.. తాజాగా తుది ఫలితాలు వెల్లడయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పండగొచ్చేస్తుంది.. అమెజాన్, ఫ్లిప్​కార్ట్​ బంపర్​ ఆఫర్లు.. ఆ కార్డులపై భారీ డిస్కౌంట్​
    Amazon Great Indian Festival: వచ్చే నెలలో దసరా పండగ ఉన్న నేపథ్యంలో ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలైన అమెజాన్​, ఫ్లిప్​కార్ట్ ఆఫర్ల పండగకు సిద్ధమయ్యాయి. 'గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌' పేరిట అమెజాన్ సేల్స్ నిర్వహించనుండగా, 'బిగ్ బిలియన్​ డేస్' పేరిట ఫ్లిప్​కార్ట్ ముందుకు రానుంది. వివిధ కంపెనీల మొబైళ్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులను తక్కువ ధరకే ఈ సేల్స్‌లో సొంతం చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రోహిత్​ భయ్యా దూకుడు లోపించిందా..?
    ఆసియా కప్​లో టీమ్​ఇండియా కెప్టెన్​ రోహిత్​ శర్మ దూకుడుగా ఆడట్లేదని క్రికెట్​ విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో అతడి ఆటతీరుపై ఓ లుక్కేద్దాం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అమలకు ఇచ్చిన మాట కోసం ఇప్పటికీ ఆ పని చేస్తున్న నాగ్​.. ఏంటంటే?
    హీరో నాగార్జున పెళ్లైన కొత్తలో తన భార్య అమలకు ఓ ప్రామిస్​ చేశారట. ఇప్పటికీ దాన్ని పాటిస్తున్నారట. అదేంటంటే. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.