ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 5 PM

author img

By

Published : Jul 16, 2022, 5:03 PM IST

5PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 5 PM

..

  • "ఈసారి ఓట్లడగడానికి వస్తారుగా అప్పుడు చూస్తా".. మాజీమంత్రిపై మహిళ ఫైర్ !
    ప్రభుత్వం చేపట్టిన 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో వైకాపా నేతలకు చేదు అనుభవం ఎదురైంది. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలంలోని శెట్టిపల్లి, శెట్టిపల్లి తండాల్లో శనివారం ఉదయం మాజీ మంత్రి శంకరనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నిరసన సెగ తగిలింది. ఇంటిముందుకు వచ్చిన శంకరనారాయణను ఓ మహిళ కడిగి పారేసింది. 11 నెలలుగా పింఛన్‌ నిలిపివేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అంబేడ్కర్ పేరు తొలగించి తన పేరు పెట్టుకుంటారా ?.. సీఎం జగన్​ది అహంకారమే: చంద్రబాబు
    విదేశీ విద్యానిధి పథకానికి అంబేడ్కర్‌ పేరు తొలగించి.. సీఎం జగన్ తన పేరు పెట్టుకోవటంపై తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఇది అంబేడ్కర్​ను అవమానించటమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కనిపిస్తే చంపకండి.. అవి చేసే మేలు మరవకండి !
    పల్లెటూర్లలోనే కాదు మహానగరాల్లోనూ పాము మన ఇంటిముందుకో, మైదానంలోకో, రోడ్డుమీదికో వచ్చిందంటే చాలు దాని అంతు చూడకుండా వదలం. భారత్‌లో ప్రతి ఏటా వేల కొద్దీ పాములను అన్యాయంగా చంపేస్తున్నారు. ఏమాత్రం అవగాహన లేకుండా పాము సమీపించిందంటే చాలు ప్రాణభయానికి గురై దాని ప్రాణం తీసుకుంటున్నాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • గురజాలలోని మదర్సాలో కలుషిత ఆహారం తిని విద్యార్థి మృతి
    పల్నాడు జిల్లా గురజాలలోని.. ఓ మదర్సాలో విషాదం చోటు చేసుకుంది. మధ్యాహ్న భోజనం చేశాక మున్నా అనే బాలుడు మృతిచెందాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్స్.. మహీంద్ర ఎస్​యూవీలు అందించిన సంస్థ
    Mahindra cars to employees: సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు కార్లను బహుమతిగా ఇచ్చింది ఓ కంపెనీ. మొత్తం 12 మందికి మహీంద్ర ఎస్​యూవీలు అందజేసింది. గురు పూర్ణిమ రోజు కార్లను అందుకున్నారు ఉద్యోగులు. ఈ సమయంలో కొందరు కంటతడి పెట్టారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • డీజిల్ ట్యాంకర్ బోల్తా.. ఇంధనం కోసం ఎగబడ్డ వాహనదారులు
    diesel tanker loot: ప్రమాదానికి గురైన డీజిల్ ట్యాంకర్ నుంచి ఇంధనాన్ని ఎత్తుకెళ్లేందుకు ప్రజలు ఎగబడ్డారు. ఝార్ఖండ్​లోని లోహర్దగా జిల్లా, రాజ్​గుర్వా మోర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఓ కారు చెట్టును ఢీకొట్టగా.. అటువైపు వచ్చిన డీజిల్ ట్యాంకర్ ఒక్కసారిగా బోల్తా పడింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • గోదావరి ఉగ్రరూపం.. ఆ గ్రామాల్లో ఎటు చూసినా నీరే.. నిండుకుండలా డ్యామ్​!
    ఒడిశాలో గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మల్కాన్​గిరి జల్లాలోని ముంపు గ్రామాలు.. వరద వలయంలో చిక్కుకున్నాయి. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్రమత్తమైన అధికారులు.. స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పెరిగిన విదేశీ డిపాజిట్​ రేట్లు.. రూపాయి పతనానికి చెక్​ పెట్టే దిశగా..
    విదేశీ మారక ద్రవ్యాన్ని ముఖ్యంగా అమెరికా డాలర్ల డిపాజిట్‌ను ఆకర్షించి, రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు వీలుగా ఆర్‌బీఐ పలు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కొన్ని ప్రత్యేక వెసులుబాట్లు కల్పించింది. వీటికి అనుగుణంగా పలు బ్యాంకులు ఫారిన్‌ కరెన్సీ నాన్‌ రెసిడెంట్‌ (ఎఫ్‌సీఎన్‌ఆర్‌) డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఫేస్​బుక్​ యూజర్లకు గుడ్​ న్యూస్.. ఒకే ఖాతాతో ఐదు ప్రొఫైల్స్..
    ఫేస్‌బుక్‌ వినియోగదారులకు శుభవార్త. ఫేస్​బుక్​లో ఒకే ఖాతాతో ఐదు ప్రొఫైల్స్‌ క్రియేట్‌ చేసుకునేందుకు వీలుగా కొత్త ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. ఈ ఫీచర్​ వల్ల కలిగే లాభాలెంటో ఓ సారి తెలుసుకుందాం.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • డబుల్​ బొనాంజా.. ఆలియా- రణ్​బీర్​కు కవలలు?
    బాలీవుడ్​ స్టార్​ హీరో రణ్​బీర్​ కపూర్​ భార్య, నటి ఆలియా భట్‌ ప్రస్తుతం ప్రెగ్నెన్సీ పీరియడ్‌ను ఆస్వాదిస్తోంది. తాను గర్భం దాల్చినట్లు ఆలియా.. జూన్ 27న ప్రకటించింది. పెళ్లైన రెండు నెలలకే ఆలియా ప్రెగ్నెంట్​ కావడంపై అందరూ ఆశ్చర్యంతో కూడిన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అయితే తాజాగా అయితే ఆమె ప్రెగ్నెన్సీపై మరో వార్త చక్కర్లు కొడుతోంది. ఆలియా కడుపులో కవలలు ఉన్నారట. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.