ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 5 PM

author img

By

Published : Jun 13, 2022, 4:59 PM IST

5PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 5 PM

..

  • Prasanna Kumar Reddy: ఒకే వేదికపై చంద్రబాబుకు అభినందనలు.. విమర్శలు..
    Prasanna Kumar Reddy: ఆత్మకూరు ఉప ఎన్నిక ప్రచారంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఒకే వేదికపై అధికారపార్టీ నేతలు భిన్న విమర్శలు చేశారు. ఒక శాసనసభ్యుడు పదవీకాలం మధ్యలో మృతి చెంది.. ఉప ఎన్నికల్లో ఆ కుటుంబసభ్యులు పోటీ చేస్తే, అక్కడ పోటీ పెట్టకూడదని తెలుగుదేశం ఒక నియమం పెట్టుకుని అమలు చేస్తోందని, ఇందుకు తెదేపా అధినేత చంద్రబాబునాయుడికి అభినందనలు తెలుపుతున్నట్లు కోవూరు శాసనసభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తెలిపారు. ఇదే సందర్భంలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి మాత్రం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నన్నొదిలి పోతున్నవా బిడ్డా.. కుమారుడికి తల్లి అంత్యక్రియలు!
    బిడ్డకు చిన్న దెబ్బ తగిలితేనే అమ్మ హృదయం తల్లడిల్లిపోతుంది.. అలాంటిది తన చేతులతోనే బిడ్డ ఒంటికి నిప్పంటించాల్సి వస్తే..? కడుపున మోసి.. కళ్లలో పెట్టుకొని కాచిన బిడ్డను.. స్వయంగా కాటికి పంపాల్సి వస్తే..?? ఆ తల్లి గుండె కోతను కొలిచేందుకు ఏ సాధనమూ సరిపోదు! బిడ్డ కలిగిన ఐదేళ్లకే భర్త దూరమైతే.. తనకంటూ ఒక జీవితం ఉందన్న సంగతే మరిచిపోయింది! ఆ పసివాడి ఎదుగుదలలోనే.. తన భవిష్యత్ ను చూసుకుంది. పాతికేళ్లపాటు కంటికి రెప్పలా కాపాడుకుంది. కానీ.. విధి మళ్లీ కాటు వేసింది! నాడు భర్త దూరమైతే.. నేడు మిగిలిన కొడుకు కూడా వెళ్లిపోయాడు. ఈ రంపపు కోతను తట్టుకోలేక.. గుండెలు పగిలేలా రోదిస్తున్న ఆ ఒంటరి తల్లి కన్నీళ్లకు ఎవరు ఖరీదు కట్టగలరు? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • జగన్ అలా చేస్తే.. కేంద్రం నుంచి రావాల్సినవి వస్తాయి: హర్ష కుమార్
    రాష్ట్రపతి ఎన్నికను పావుగా వాడుకొని రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలుకు వైకాపా పట్టుబట్టాలని మాజీ ఎంపీ హర్షకుమార్‌ సూచించారు. సీఎం జగన్ కేసులకు భయపడితే రాష్ట్రానికి తీవ్ర అన్యాయమే జరగుతుందన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • చీపురుపల్లి ఆర్ఈసీఎస్‌లో అవినీతి రాజ్యమేలుతోంది: ఎంపీ బెల్లాన
    విజయనగరం జిల్లా చీపురుపల్లి ఆర్ఈసీఎస్‌లో అవినీతి రాజ్యమేలుతోందని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. జిల్లా సమీక్ష సమావేశంలో అవినీతి సంగతి తేలుస్తానని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'ఆన్​లైన్​ బెట్టింగ్'​పై కేంద్రం సీరియస్.. ఇక అవన్నీ బంద్!
    Online betting advertising: ఆన్​లైన్​ బెట్టింగ్ ప్రచార ప్రకటనలపై కొరడా ఝుళిపించింది కేంద్రం. బెట్టింగ్​, గ్యాంబ్లింగ్​ వంటి ప్రకటనలకు దూరంగా ఉండాలని ప్రింట్​, ఎలక్ట్రానిక్​, డిజిటల్​ మీడియాలకు అడ్వైజరీ జారీ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఈడీ ముందుకు రాహుల్.. నియంతృత్వమా? 'నల్ల ఖజానా' రక్షణా?
    Rahul Gandhi ED case: రాహుల్ గాంధీకి ఈడీ సమన్లు పంపడంపై కాంగ్రెస్, భాజపా వర్గాల మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. అక్రమాస్తులను కాపాడుకునేందుకే కాంగ్రెస్ ర్యాలీలు చేస్తోందని భాజపా మండిపడింది. కాగా, సత్యాన్ని భాజపా అణచివేయలేదని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. ఆరోపణల నుంచి రాహుల్ గాంధీ బయటపడతారని ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా విశ్వాసం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఈడీ కార్యాలయానికి రాహుల్​.. రెండో రౌండ్​ విచారణ
    భోజన విరామం తర్వాత మళ్లీ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు రాహుల్​ గాంధీ. భోజనం కోసం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ఈడీ ఆఫీసు నుంచి తుగ్లక్​ సేన్​లోని నివాసానికి వెళ్లిన రాహుల్​ గాంధీ.. అక్కడి నుంచి సర్​ గంగారామ్​ ఆసుపత్రికి వెళ్లారు. సోనియా గాంధీని కలిసిన అనంతరం తిరిగి ఈడీ కార్యాలయానికి వెళ్లారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఢమాల్ స్ట్రీట్​.. రూ.7లక్షల కోట్లు ఆవిరి.. రూపాయి పతనంలో నయా రికార్డ్
    stock market crash: అమెరికా ఫెడ్​ నిర్ణయాలు, ద్రవ్యోల్బణం భయాలతో దేశీయ మార్కెట్లు సోమవారం కుప్పకూలాయి. సెన్సెక్స్​ ఏకంగా 1450 పాయింట్లకుపైగా నష్టపోయింది. నిఫ్టీ 16వేల దిగువకు చేరింది. సోమవారం ఒక్కరోజే మదుపరుల సంపద దాదాపు రూ.7లక్షల కోట్లు ఆవిరైంది. మరోవైపు.. రూపాయి తొలిసారి 78 మార్క్​ దాటింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బీసీసీఐకి కాసుల పంట.. ఒక్క మ్యాచ్​కు రూ.107.5కోట్లు.. మీడియా హక్కులు ఎంతంటే?
    IPL Media Rights Auction 2023: 2023-27 కాలానికి ఐపీఎల్​ మీడియా ప్రసార హక్కులు ఏకంగా రూ.44,075 కోట్లకు అమ్ముడుపోయాయి. రాబోయే ఐదేళ్లలో 410 మ్యాచ్​ల కోసం ఈ మొత్తాన్ని బీసీసీఐ అందుకోనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'బ్రహ్మస్త్రం' కోసం చిరు.. భోళాశంకర్​లో నితిన్​!.. కొత్త పోస్టర్​తో మెగాహీరో
    కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో మెగాస్టార్​ చిరంజీవి, నితిన్​, సాయిధరమ్​ తేజ్​, బాలీవుడ్ హీరో రణ్​బీర్​ కపూర్​ చిత్రాల సంగతులు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.