ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @5PM

author img

By

Published : Jan 13, 2022, 5:01 PM IST

5pm Top news
5pm Top news

.

  • సినీ పరిశ్రమ సమస్యలు త్వరలో పరిష్కారం అవుతాయని భావిస్తున్నాం: చిరంజీవి
    సినిమా టికెట్ల ధరలపై రెండు, మూడు వారాల్లో ప్రభుత్వ నిర్ణయం వచ్చే అవకాశం ఉందని చిరంజీవి అన్నారు. సినీ పరిశ్రమ కష్టాలు త్వరలోనే పరిష్కారమవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • సీఎంవో అధికారులతో ఉద్యోగ సంఘాల నేతల సమావేశం
    ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో ఏపీ ఐకాస, ఏపీ ఐకాస అమరావతి నేతలు సమావేశమయ్యారు. పీఆర్సీకి సంబంధించిన అంశాలపై సమావేశంలో చర్చిస్తున్నారు. హెచ్‌ఆర్ఏ, ఉద్యోగుల వేతనాలు తగ్గకుండా చర్యలు తీసుకోవాలని ఐకాస నేతలు బండి శ్రీనివాస్, బొప్పరాజు వెంకటేశ్వర్లు సీఎంవో అధికారులను కోరుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'తిరుమలలో పది రోజుల పాటు వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు'
    తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను పది రోజుల పాటు నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • తెదేపా నేత హత్యతో మాకు సంబంధం లేదు: ఎమ్మెల్యే పిన్నెల్లి
    గుంటూరు జిల్లాలో వెల్దుర్తి మండలం గుండ్లపాడులో తెదేపా నాయకుడు తోట చంద్రయ్య హత్య ఘటనపై మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్పందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • భాజపాకు మరో​ మంత్రి గుడ్​బై.. ఎస్​పీలో చేరిక?
    ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది యూపీ రాజకీయాల్లో ఫిరాయింపులు జోరందుకున్నాయి. భాజపాను వీడిన నేతల జాబితాలో మరో ఇద్దరు చేరారు. కేబినెట్​ మంత్రి ధరమ్​ సింగ్​ సైనీ.. పదవికి రాజీనామా చేసి పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • క్షుద్రపూజలు చేస్తోందని.. బతికుండగానే మహిళకు నిప్పంటించి..
    క్షుద్రపూజలు చేస్తోందన్న ఆరోపణలతో ఓ మహిళపై కర్కశంగా వ్యవహరించారు. దారుణంగా కొట్టి.. ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అఫ్గాన్ ఆర్థిక సంక్షోభం- ఆకలి తీర్చుకోవడానికి అవయవాల విక్రయం
    తాలిబన్ల పాలనలో అఫ్గాన్ల పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. కుటుంబ ఆకలి తీర్చేందుకు ప్రజలు తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. పూట గడిచేందుకు తమ అవయవాలు విక్రయిస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • తీవ్ర ఒడుదొడుకుల సెషన్​లో చివరకు లాభాలు
    తీవ్ర ఒడుదొడుకుల మధ్య సాగిన సెషన్​లో దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్​ 85, నిఫ్టీ 45 పాయింట్లు పెరిగాయి.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • సింధు క్వార్టర్స్​లోకి.. సైనా ఔట్
    భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్స్​కు చేరుకుంది. మరో షట్లర్ సైనా నెహ్వాల్​ టోర్నీ నుంచి నిష్క్రమించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • తాప్సీ 'లూప్​ లపేటా' ట్రైలర్​.. వైష్ణవ్​ తేజ్​ కొత్త సినిమా
    కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో రష్మిక, తాప్సీ, నాగశౌర్య, వైష్ణవ్​ తేజ్​ చిత్రాల వివరాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.