ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 5 PM

author img

By

Published : Jul 3, 2021, 5:02 PM IST

5pm top news
ప్రధాన వార్తలు @ 5 PM

ప్రధాన వార్తలు @ 5 PM

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
  • కొత్తగా 2,930 కరోనా కేసులు

రాష్ట్రంలో కొత్తగా 2,930 కరోనా కేసులు, 36 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం 35,871 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కేంద్ర హోంశాఖ స్పందన

సీఐడీ (AP CID) అదనపు డీజీ సునీల్‌కుమార్‌పై వచ్చిన ఫిర్యాదులపై కేంద్ర హోంశాఖ స్పందించింది. సునీల్‌కుమార్ వ్యవహారంపై వచ్చిన 3 ఫిర్యాదులపై నివేదిక ఇవ్వాలని ఏపీ సీఎస్​ను ఆదేశించింది. ఫిర్యాదులపై తీసుకున్న చర్యల వివరాలు కోరుతూ సీఎస్‌కు కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పోలీస్ స్టేషన్​ ఎదుటే..

నందవరం పోలీస్ స్టేషన్​లో దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహిత.. పది రోజులు క్రితం పొలానికి వెళ్లగా ఓ వ్యక్తి అత్యాచారయత్నం చేశాడు. రెండు సార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆ దంపతులు ఆరోపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కొనసాగుతున్న నీటి విడుదల

ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి నీటి విడుదల కొనసాగుతోంది. మొత్తం 20 గేట్ల ద్వారా 8,340 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. బ్యారేజీలో ప్రస్తుత నీటి నిల్వ 3.07 టీఎంసీలు ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సీఎంగా పుష్కర్​ సింగ్ ధామీ

ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీ నియమితులయ్యారు. దెహ్రాదూన్​లో జరిగిన భాజపా శాసనసభాపక్ష సమావేశంలో ఆ పార్టీ నేతలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటీలో కేంద్ర పరిశీలకులుగా కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్ పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • జలఫిరంగుల ప్రయోగం

పంజాబ్​లో విద్యుత్​ కొరతను నిరసిస్తూ ముఖ్యమంత్రి అమరీందర్​ సింగ్​ సిస్వాన్ ఫామ్​ హౌస్​ వద్ద ఆందోళన చేపట్టారు ఆమ్​ ఆద్మీ పార్టీ కార్యకర్తలు. ఈ నేపథ్యంలో నిరసనకారులపై జలఫిరంగులు ప్రయోగించారు పోలీసులు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ట్విట్టర్ స్పష్టత

రెసిడెంట్ గ్రీవెన్స్ అధికారి(Resident Grievance Officer) నియామకంపై ట్విట్టర్(Twitter) సంస్థ స్పందించింది. ఈ నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుందని దిల్లీ హైకోర్టుకు తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • వాట్సాప్​ నయా ఫీచర్

'వ్యూవ్​ వన్స్​' ఫీచర్​ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నద్ధమవుతోంది వాట్సాప్​. ఈ ఫీచర్​ టెస్టింగ్​ కోసం ఇప్పటికే ఆండ్రాయిడ్​ బీటాలో అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా ఫొటోలు, వీడియో పంపింతే, ఎవరైనా కేవలం ఒక్కసారే వాటిని చూడగలుగుతారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • టెస్టు సిరీస్​కు పృథ్వీ!

టీమ్ఇండియా యువ ఓపెనర్​ పృథ్వీ షా మరోసారి టెస్టు జట్టులో కనిపించనున్నాడు! ఇంగ్లాండ్ పర్యటన కోసం అతడిని పిలవనున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 4న ఈ మ్యాచ్​లు ప్రారంభం కానున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • టీవీ నటుడు అరెస్టు..

'కసూతీ జిందగీ కే' పాటు పలు సీరియళ్లలో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రచీన్ చౌహాన్(pracheen chauhan)ను పోలీసులు అరెస్టు చేశారు. బాలికపై వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలే ఇందుకు కారణమని ఇతడిపై ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.