ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 3 PM

author img

By

Published : Jul 27, 2022, 3:01 PM IST

..

3PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 3 PM

  • విశాఖ బీచ్‌లో అదృశ్యం.. నెల్లూరులో ప్రత్యక్షం.. అసలేం జరిగింది?
    విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌ వద్ద రెండు రోజుల క్రితం కనిపించకుండా పోయిన వివాహిత చిరిగిడి సాయి ప్రియ వ్యవహారంలో ఊహించని మలుపు చోటుచేసుకుంది. ఆమె నెల్లూరులో ప్రత్యక్షమైంది. అక్కడ ఓ యువకుడితో సాయి ప్రియ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నిర్వాసితులకు పరిహారం ఇచ్చాకే.. పోలవరంలో నీళ్లు నింపుతాం: సీఎం జగన్​
    CM JAGAN : నిధుల విడుదల కోసం తరచూ కేంద్రానికి వినతిపత్రాలు పంపిస్తున్నామని.. సెప్టెంబర్‌ లోగా పోలవరం నిర్వాసితులకు పరిహారం అందిస్తామని సీఎం జగన్.. గోదావరి వరద ముంపు బాధితులతో అన్నారు. అల్లూరి జిల్లా చింతూరు మండలంలో పర్యటించిన సీఎం జగన్‌... కుయుగూరులో వరద బాధితులను పరామర్శించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కి'లేడి'.. మాయమాటలతో 15 ఏళ్ల బాలుడి కిడ్నాప్​.. అసలు విషయం తెలిస్తే.. !
    MISSING CASE: ఆమెకు పెళ్లై నలుగురు పిల్లలు ఉన్నారు. భర్త అనారోగ్యం కారణంగా ఇంట్లో ఉండటం లేదు. ఏమి తెలియాలో తోచక.. ఎదురింట్లో నివాసం ఉంటున్న 15 ఏళ్ల బాలుడిపై ఆమె కన్నేసింది. ముందుగా బాలుడిని పరిచయం చేసుకుని.. అతడితో సన్నిహితంగా ఉండటం మొదలుపెట్టింది. ఆ బాలుడు బాగా దగ్గరవడంతో ఫొన్లో వీడియోలు చూపించి ప్రలోభపెట్టి.. శారీరక సంబంధం ఏర్పరచుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఈ యాప్​ ఇన్​స్టాల్ చేసుకోండి.. మీ బస్ ఎక్కడుందో తెలుసుకోండి..!
    RTC Bus Tracking System: ప్రయాణికులకు మరింత చేరువయ్యేందుకు టీఎస్​ఆర్టీసీ సాంకేతికతను అందిపుచ్చుకుంటోంది. ఇందులో భాగంగా.. బ‌స్సు ట్రాకింగ్ వ్యవ‌స్థను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సదుపాయంతో బస్సు ఎక్కడ ఉందో తెలుసుకునే వెసులుబాటు కలిగింది. ప్రస్తుతానికి ప్రయోగాత్మకంగా కొన్ని బస్సుల్లో ప్రవేశపెట్టగా.. దశలవారీగా అన్నింటిలోనూ ట్రాకింగ్‌ వ్యవస్థను అందుబాటులోకి తేనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'ఇక మీరే చూసుకోండి!'.. జిల్లా కలెక్టర్​ బాధ్యతల్ని భర్తకు అప్పగించిన భార్య!!
    "ఇన్నేళ్లుగా ఈ జిల్లా వ్యవహారాల్ని నేను చూశా. ఇకపై మీ వంతు. జాగ్రత్తగా నిర్వర్తించండి" అంటూ భర్తకు జిల్లా కలెక్టర్ బాధ్యతలు అప్పగించారు ఓ మహిళ. ఎందుకలా? ఎక్కడ? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'భూములిస్తే ఉద్యోగాలు'.. ఆ రైల్వే స్కాంలో లాలూ అనుచరుడు అరెస్ట్​
    CBI Arrests Bhola Yadav: బిహార్​ మాజీ ముఖ్యమంత్రి, ఆర్​జేడీ అధినేత లాలూ ప్రసాద్​ యాదవ్​.. కీలక అనుచరుడు భోళా యాదవ్​ను సీబీఐ బుధవారం అరెస్టు చేసింది. యూపీఏ హయాంలో లాలూ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన రైల్వే స్కాంకు సంబంధించి ఈయనను అదుపులోకి తీసుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కేవలం స్వలింగ సంపర్కంతోనే మంకీపాక్స్‌ వ్యాపిస్తుందా? అందులో నిజమెంత?
    Monkeypox: ప్రపంచ దేశాలను మరోసారి వణికిస్తోన్న మంకీపాక్స్‌ వైరస్‌ కేవలం స్వలింగ సంపర్కం, లైంగిక కలయికతోనే వ్యాపిస్తుందా?.. వైరస్​ సోకిన వ్యక్తితో సన్నిహితంగా ఉన్నా సోకుతుందా? కరోనా వైరస్​తో మంకీపాక్స్​ను పోల్చవచ్చా? వీటిన్నంటిపై ప్రపంచ ఆరోగ్యసంస్థ చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌ క్లారిటీ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'అంతర్జాతీయ కరెన్సీగా రూపాయి'.. సాధ్యమేనా?
    Rupee as international currency: రూపాయి.. అంతర్జాతీయ కరెన్సీగా మారడం సాధ్యమేనా? అందుకున్న ప్రధాన సవాళ్లేంటి? అధిగమించే దిశగా రిజర్వు బ్యాంకు, కేంద్రం ఏం చేస్తున్నాయి? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అభిమానులతో సూర్య, రోహిత్‌, పంత్‌ ముచ్చట్లు.. లైవ్​లోకి ధోనీ
    రోహిత్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌తో కలిసి సరదాగా ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌ను నిర్వహించాడు రిషభ్‌ పంత్‌. వీరంతా కాసేపు అభిమానులతో ముచ్చటించారు. అయితే లైవ్​లోకి ధోనీని లాగేందుకు పంత్​ ప్రయత్నించడం గమనార్హం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్న ప్రియాంక-నిక్ దంపతులు!
    గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ దంపతులు తమ కుమార్తె మాల్తీ మేరీ చోప్రాను ఇంకా ప్రపంచానికి పరిచయం చేయలేదు. ఈ క్రమంలో ఈ జంట తమ రెండో సంతానానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 2018లో జోధ్‌పూర్‌లో పెళ్లి చేసుకున్నారు అమెరికన్ పాప్ సింగర్ నిక్ జొనాస్- ప్రియాంక చోప్రా. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.