ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 3 PM

author img

By

Published : Jul 15, 2022, 2:59 PM IST

3PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 3 PM

..

  • YSR VAHANA MITRA: వైఎస్సార్‌ వాహనమిత్ర నిధులు విడుదల.. 2.60 లక్షల మంది డ్రైవర్లకు లబ్ధి
    కరోనా సమయంలో ప్రభుత్వం ఆర్థిక కష్టాల్లో ఉన్నా వాహనమిత్ర పథకం అమలు చేశామని సీఎం జగన్ అన్నారు. విశాఖలో వాహనమిత్ర నగదు బదిలీని సీఎం ప్రారంభించారు. వైఎస్సార్‌ వాహనమిత్ర కింద 2.60 లక్షల మంది డ్రైవర్లకు లబ్ధి చేకూరుతోందన్నారు. రోజూ లక్షలమంది ప్రయాణికులకు సేవలు అందిస్తున్న డ్రైవర్లకు...వరుసగా నాలుగో ఏడాది వాహనమిత్ర కింద ఫలాలు అందిస్తున్నామన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'సీఎం పర్యటనకు.. పాఠశాలలకు సెలవు ప్రకటించి.. బస్సులు తరలించడమేంటి?'
    విశాఖ జిల్లాలో సీఎం జగన్ పర్యటనపై తెదేపా నేత పట్టాభి మండిపడ్డారు. సీఎం వస్తున్నాడని పాఠశాలలకు సెలవు ప్రకటించి.. బస్సులు తరలించడమేంటని ప్రశ్నించారు. ఏ సందర్భమూ లేకుండా సెలవులు ప్రకటిస్తే.. విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలని నిలదీశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Dhavaleshwaram: నిండుకుండలా ధవళేశ్వరం బ్యారేజీ...
    Dhavaleshwaram: ఎగువన కురుస్తున్న వర్షాలు, వరద ప్రవాహంతో.. గోదావరి నదిలో వరద ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో.. మూడో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • "స్వచ్ఛ భారత్​ అధికారులమంటూ వచ్చి.. బంగారంతో ఉడాయించారు"
    THEFT: స్వచ్ఛ భారత్​ అంటే గ్రామాలు, పట్టణాలు శుభ్రం చేయడమని మనకు తెలుసు. కానీ ఇక్కడ స్వచ్ఛ భారత్​ అంటే ఇంట్లో నగలు దోచుకెళ్లడం. అదేంటి అనుకుంటున్నారా. అవును అధికారులు పేరుతో మాయమాటలు చెప్పి చోరికి పాల్పడ్డారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఆల్ట్​ న్యూస్​ జుబైర్​కు బెయిల్​.. కానీ...
    ఒక వర్గం మనోభావాలు దెబ్బతీసేలా ట్వీట్ చేశారన్న కేసులో జర్నలిస్ట్​ మహ్మద్​ జుబైర్​కు బెయిల్ లభించింది. అయితే.. అనుమతి లేకుండా ఆయన దేశం విడిచి వెళ్లరాదని న్యాయస్థానం షరతు విధించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • దేశంలోనే టాప్ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్​.. హెచ్​సీయూ ర్యాంక్ ఎంతంటే...
    NIRF ranking 2022: కేంద్ర విద్యాశాఖ జాతీయ ర్యాంకుల్లో మరోసారి ఐఐటీ మద్రాస్ హవా కొనసాగింది. 2022 ఏడాదికి సంబంధించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జాతీయ ర్యాంకులను విడుదల చేయగా ఐఐటీ మద్రాస్ వరుసగా నాలుగో ఏడాదీ దేశంలోని అత్యుత్తమ విద్యాసంస్థగా నిలిచింది. తర్వాతి స్థానాల్లో ఐఐఎస్​సీ బెంగళూరు, ఐఐటీ బాంబే ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నాజీల అరాచకం.. అక్కడ 8,000 మంది అస్థికలు గుర్తింపు
    రెండో ప్రపంచ యుద్ధం సమయంలో నాజీలు కాన్సన్​ట్రేషన్​ క్యాంపులు నిర్వహించిన బంధీలను అతిదారుణంగా హింసించేవారు. వీరి అరాచకాలకు సంబంధించి మరో ఉదాహరణ తాజాగా పోలాండ్​లో బయటపడింది. సోల్డౌ ప్రాంతంలో దాదాపు 8వేల మంది చితా భస్మన్ని అస్థికలను గుర్తించారు. ఇవి దాదాపు 17.5 టన్నులు ఉంటుందని.. ఒక్కో వ్యక్తి అవశేషాలు కనీసం 2 కిలోల బరువు ఉంటాయని పరిశోధకులు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • వడ్డీ రేటు తగ్గాలా? బ్యాంకుతో బేరమాడండి!
    రెండేళ్లుగా తక్కువగా ఉన్న వడ్డీ రేట్లు ఇప్పుడు పెరగడం ప్రారంభించాయి. ఏప్రిల్‌లో గృహరుణాల వడ్డీ రేట్లు 6.40%-6.80% మధ్య ఉండేవి. ఇప్పుడు దాదాపు 90 బేసిస్‌ పాయింట్లు పెరిగాయి. ఆర్‌బీఐ రెపో రేటును మరింత పెంచుతుందనే అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటి రుణం మరింత భారం కానుంది. ఇలాంటి సందర్భంలో వడ్డీ రేటుపై ఎంతో కొంత రాయితీ వచ్చేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయాలి? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కోహ్లీపై పాక్​ సారథి కామెంట్​.. వైరల్​గా మారిన ట్వీట్​
    Babar Azam Kohli: ఫామ్​లేమితో ఇబ్బంది పడుతున్న టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ కోహ్లీ గురించి పాక్​ సారథి బాబర్​ అజామ్​ ఓ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఆ ట్వీట్​ నెట్టింట్లో వైరల్​గా మారింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • శివకార్తికేయన్ కొత్త సినిమా టైటిల్​ టీజర్​ రిలీజ్​​​​.. హీరోయిన్​గా సామ్​!
    Sivakarthikeyan new movie title: తమిళ స్టార్​ హీరో శివ‌కార్తికేయ‌న్​ 22వ సినిమా టైటిల్​ టీజర్​ను సూపర్​స్టార్​ మహేశ్​బాబు విడుదల చేశారు. యాక్షన్​ సీన్స్​తో మొదలైన ఈ వీడియో ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.